Recharge Plan: అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటా.. కేవలం రూ. 99కే
BSNL: చేతిలో ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఉంది. దీంతో కచ్చితంగా రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. కాగా జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి ప్రైవేట్ కంపెనీలు టారిఫ్ ధరలను పెంచితన నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీగా ఆదరణ పెరిగింది. పెద్ద ఎత్తున యూజర్లు BSNLకి పోర్ట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యూజర్లను ఆకర్షిచేందుకు తాజాగా కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది..

తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్‌తో కూడిన రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా మరో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. రూ. 99 రీఛార్జ్‌తో ఈ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 17 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచచు.
తక్కువ వ్యాలిడిటీ అయినా పర్లేదు రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ కావాలనుునే వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ సేవను ఉచితంగా పొందొచ్చు. ఈ పాటలను ఎన్నిసార్లైనా మార్చుకునే అవకాశం కల్పిస్తారు. ఈ లెక్కన ఈ ప్లాన్ వల్ల రూ. 200తోనే 34 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చన్నమాట.
రూ. 147 ప్లాన్..
ఇక బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన మరో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ. 47. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. అయితే ఈ ప్లాన్‌లో డేటా పరిమితంగా లభిస్తుంది. నెలకు కేవలం 10 జీబీ లభిస్తుంది. ఇంటర్నెట్ అవసరం లేకపోయినా పర్లేదు, ఎక్కువ వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
వీటితో పాటు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా కాలర్ ట్యూన్స్ ఆప్షన్ పొందొచ్చు. అలాగే పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ అవకాశం లభిస్తుంది. కాగా 10 జీబీ డేటాను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి రోజువారి పరిమితులు ఉండదు. ఒకేరోజు మొత్తం 10 జీబీ కూడా ఉపయోగించుకోవచ్చు.