ఏడాదంతా నిల్వ ఉండే మజ్జిగ మిరపకాయలు ఎలా చేయాలో తెలుసా?
food-life Mar 18 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
పచ్చి మిరపకాయలు కట్ చేసుకోవాలి..
మొదటగా పచ్చి మిరపకాయలను శుభ్రంగా కడగాలి. వాటిని నిలువుగా లేదా మధ్యలోకి గాటు పెట్టాలి. అప్పుడే మజ్జిగ మిరపకాయల లోపలికి బాగా వెళ్తుంది.
Image credits: instagram
Telugu
ఇవి కూడా కావాలి...
ఒక కప్పు జీలకర్ర, మెంతులు సమానంగా తీసుకోవాలి. వాటిని పొడి చేసుకోవాలి. వీటికి కొద్దిగా ఇంగువ కూడా అవసరం.
Image credits: instagram
Telugu
మజ్జిగ మిశ్రమం
మీగడ లేని పుల్లటి మజ్జిగ తీసుకోవాలి. అందులో జీలకర్ర, మెంతుల పొడి, కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
Image credits: instagram
Telugu
నానబెట్టి, ఎండబెట్టాలి
గాట్లు పెట్టిన మిరపకాయలను మజ్జిగలో వేసి 24 గంటలు నానబెట్టాలి. తర్వాత మిరపకాయలను తీసి కాటన్ క్లాత్‌పై వేసి ఎండలో ఆరబెట్టాలి. మూడు రోజుల పాటు మజ్జిగలో నానపెట్టి, ఎండలో ఆరపెట్టాలి.
Image credits: instagram
Telugu
ఊర మిరపకాయలు రెడీ
మిరపకాయలు గలగలమంటూ శబ్దం వచ్చేలా బాగా ఎండిపోవాలి. అప్పుడు మజ్జిగ మిరపకాయలు సిద్ధమైనట్లే. వాటిని గాలి చొరబడని డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇవి ఏడాది పాటు తాజాగా ఉంటాయి.