Ginger Tea: నార్మల్ టీ కాదు, చలికాలంలో రోజూ అల్లం టీ తాగితే ఏమౌతుంది?
Ginger Tea: టీ ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు. కానీ, అల్లం టీ తో మాత్రం చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ టీ తాగడం వల్ల జలుబు,దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

Ginger Tea
ఉదయం లేవగానే వేడి వేడి టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అసలు టీ తాగకుండా చాలా మందికి రోజు కూడా గడవదు. టీ తాగిన తర్వాత మాత్రమే వారు వేరే ఇతర పనులు చేయగలరు. కానీ, టీ ఆరోగ్యానికి మంచిది కాదు అని నిపుణులు చెబుతుంటారు. మరి.. నార్మల్ గా పాలతో తయారు చేసుకునే టీకి బదులు... అల్లం టీ తాగితే ఏమౌతుంది? చలికాలంలో ఈ అల్లం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం....
పరిశోధనలు ఏం చెబుతున్నాయి..?
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన కథనం ప్రకారం.. అల్లం ఉపయోగించి బరువు తగ్గొచ్చు. క్రమం తప్పకుండా అల్లం తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గడంతో పాటు.. నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించవచ్చు.
రోగనిరోధక శక్తి పెంచుతుంది...
చలికాలం వచ్చినప్పుడల్లా చాలామందికి చలి, దగ్గు, జలుబు, నత్తి, కీళ్ల నొప్పులు పెరుగుతాయి. ఈ సీజన్‌లో శరీరాన్ని లోపల నుండి కాపాడే సహజ రక్షణ కావాలంటే అల్లం టీ ఓ అద్భుతమైన ఎంపిక. అల్లంలో ఉండే పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి శక్తినిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది..
చలికాలంలో రక్త ప్రసరణ మందగించి కొలెస్ట్రాల్ ఇబ్బందులు పెరుగుతాయి. అల్లం టీ తాగడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యల ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉంది.
మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది
చలికాలంలో చక్కెర స్థాయిలు అస్థిరంగా ఉండే అవకాశం ఎక్కువ. కాబట్టి... అల్లం టీ తాగడం వల్ల ఈ ప్రమాదం తగ్గుతుంది. గ్లూకోజ్ మెటబాలిజం మెరుగుపరుస్తుంది. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇన్సులిన్ ప్రతిచర్యను సమతుల్యం చేస్తుంది. అల్లం టీ ఒక్కటే డయాబెటిస్ ప్రమాదాన్ని కంట్రోల్ చేయకపోవచ్చు. కానీ, ఇది డైట్ కి చాలా బాగా సహాయపడుతుంది.
అల్లం టీ రోజూ తాగడం వల్ల శరీరం వేడిగా ఉంటుంది. వాంతులు, వికారం తగ్గుతాయి. అజీర్ణం, గ్యాస్ తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో సహాయపడుతుంది. చలి కారణంగా వచ్చే కీళ్ల నొప్పి కూడా తగ్గుతుంది. అయితే.. అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిది అయినా... అందరికీ మంచిది కాకపోవచ్చు. మరీ ఎక్కువగా తీసుకోకూడదు. కాబట్టి, మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసుకునే ముందు... వైద్యుల సలహా తీసుకోవాలి.

