Black Coffee: బ్లాక్ కాఫీతో బోలెడన్ని ప్రయోజనాలు.. తెలిస్తే షాక్
health-life Jul 15 2025
Author: Rajesh K Image Credits:social media
Telugu
జీరో క్యాలరీ డ్రింక్
బ్లాక్ కాఫీలో చక్కెర, పాలు లేదా అదనపు క్యాలరీలు ఉండవు. కాబట్టి ఇది జీరో క్యాలరీ డ్రింక్. ఇందులోని కెఫీన్ జీవక్రియను పెంచి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
Image credits: social media
Telugu
మెదడు పనితీరు మెరుగు
బ్లాక్ కాఫీలోని కెఫీన్ మెదడును చురుగ్గా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. ఇది మానసిక అలసటను తగ్గించి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
Image credits: social media
Telugu
గుండె ఆరోగ్యానికి మేలు
బ్లాక్ కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మితంగా తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉండి, గుండె రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Image credits: Instagram
Telugu
ఆకలి అదుపులో
బ్లాక్ కాఫీ ఆకలి తగ్గించడంలో సహాయపడుతుంది. తరచూ తినాలనే కోరికను తగ్గించడంతో బరువు పెరిగే అవకాశాన్ని తగ్గిస్తుంది.
Image credits: Instagram
Telugu
ఎనర్జీ డ్రింక్
వ్యాయామం ముందు బ్లాక్ కాఫీ తాగితే శక్తి పెరుగుతుంది, శరీరం త్వరగా అలసిపోదు. దీని వల్ల ఎక్కువ సమయం వ్యాయామం చేయడం సాధ్యమవుతుంది.
Image credits: Instagram
Telugu
కాఫీ మోతాదుగా తీసుకోండి
బ్లాక్ కాఫీలో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ రోజుకు 1-2 కప్పులకే పరిమితం చేయాలి. ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి, చిరాకు లేదా ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది.