Jaggery: ఎండాకాలంలో బెల్లం తింటే ఏమౌతుంది?
బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కానీ, ఎండాకాలంలో మాత్రం బెల్లం తినకూడదట. తింటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయట.

jaggery
భారతీయులు రెగ్యులర్ గా వంటలో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు. పంచదార తింటే ఆరోగ్యానికి మంచిది కాదు అని బెల్లం వాడేవారు కూడా ఉన్నారు. ఆయుర్వేదంలోనూ దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని భావిస్తారు. బెల్లంలో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. నార్మల్ గా రోజూ చిన్న బెల్లం ముక్క తిన్నా ఆరోగ్యంగా ఉంటామని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే, ఎండాకాలం మాత్రం దీనికి దూరంగా ఉండాలట. అది నిజమేనా, వేసవి కాలంలో బెల్లం ఎందుకు తినకూడదు? ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
నిపుణుల ప్రకరాం, బెల్లంలో ఐరన్, కాల్షియం, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఎ, బి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లేలా చేస్తుంది. ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. రక్త హీనత సమస్యే రాదు. ఈ బెల్లంలో అనేక యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలంగా మారుస్తాయి.
jaggery
ఎండాకాలంలో బెల్లం తింటే కలిగే నష్టం ఏంటి?
బెల్లం వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుందని, కాబట్టి దానిని అధికంగా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది అధిక చెమట,నిర్జలీకరణానికి కారణమవుతుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు వేసవిలో బెల్లం తినడం ద్వారా మొటిమలు లేదా అలెర్జీలు రావచ్చు. కొంతమంది వేసవిలో బెల్లం తినడం ద్వారా అజీర్ణం, ఎసిడిటీ, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Sugarcane jaggery
వేసవిలో బెల్లం తినడానికి సరైన మార్గం ఏమిటి?
మొదట, మీరు వేసవిలో బెల్లం తినాలనుకుంటే, దాని పరిమాణాన్ని పరిమితం చేయండి. మీరు చల్లటి నీటిలో కలిపి బెల్లం త్రాగవచ్చు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. మీరు బెల్లం,నిమ్మరసం త్రాగవచ్చు. దీనికి పుదీనా జోడించడం వల్ల దాని ప్రయోజనాలు పెరుగుతాయి.