MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Food
  • Egg Boiled water:కోడి గుడ్లు ఉడికించిన నీరు పారబోస్తున్నారా? ఎలా వాడాలో తెలుసా?

Egg Boiled water:కోడి గుడ్లు ఉడికించిన నీరు పారబోస్తున్నారా? ఎలా వాడాలో తెలుసా?

 Egg Boiled water: కోడి గుడ్లు ఉడికించిన తర్వాత ఆ నీటిని ఏం చేస్తున్నారు? పారబోస్తున్నారా? ఆ నీటిని ఎన్ని రకాలుగా ఉపయోగించొచ్చో తెలుసా? ఆ నీటిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 24 2026, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Egg Boiled water
Image Credit : Freepik

Egg Boiled water

వంట గదిలో మనం పని చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు కొన్నింటిని పనికిరావు అని డస్ట్ బిన్ లో పారేస్తూ ఉంటాం. కానీ, వాటిలో కొన్ని విలువైనవి కూడా ఉంటాయి. గుడ్లు ఉడకపెట్టిన తర్వాత మిగిలే నీరు కూడా అలాంటిదే. ప్రతి ఒక్కరి ఇంట్లో రెగ్యులర్ గా కోడిగుడ్లు ఉడకపెడుతూనే ఉంటారు. అలా ఉడకపెట్టిన తర్వాత నీటిని సింక్ లో పారబోస్తే ఉంటాం. కానీ.. ఈ నీటిని చాలా రకాలుగా ఉపయోగించవచ్చు.గుడ్డు ఉడకపెట్టిన నీటిలో పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మరి, ఈ నీరు దేనికి ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మొక్కలు ఏపుగా పెరుగుతాయి....
Image Credit : Freepik

మొక్కలు ఏపుగా పెరుగుతాయి....

కోడిగుడ్డు పెంకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వాటిని నీటిలో ఉడకపెట్టినప్పుడు.. ఆ కాల్షియం నీటిలోకి కూడా విడుదల అవుతుంది. ఈ నీటిని మొక్కలపై పోసినప్పుడు, మొక్కల కణాలకు, వేర్లకు కాల్షియం అందుతుంది. దీని వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అయితే.. ఆ నీళ్లు వేడిగా ఉన్నప్పుడు పోయకూడదు. ఆ నీరు చల్లారిన తర్వాత మాత్రమే మొక్కలకు పోయాలి.

మనలో కాల్షియం లోపాన్ని కూడా తగ్గించొచ్చు...

కోడిగుడ్డు పెంకులో 90 శాతానికిపైగా కాల్షియం ఉంటుంది. గుడ్డును ఉడకపెట్టినప్పుడు ఆ కాల్షియం కొంత భాగం నీటిలోకి విడుదల అవుతుంది. ఈ నీటిని పోషక జలం అని కూడా పిలుస్తారు. చాలా మంది ఈ నీటిని సూప్ ల్లో కూడా వాడుతుంటారు. అలా సూప్ లో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఉంటే అది తగ్గే అవకాశం ఉంటుంది.

అయితే, ఇలా సూప్ లో వాడాలి అంటే.. ముందుగా కోడిగుడ్లను నీటిలో శుభ్రం చేయాలి. ఆ గుడ్లు కూడా నేచురల్ వి ఎంచుకోవడం మంచిది.

33
జుట్టు, చర్మానికి పోషణ...
Image Credit : Freepik

జుట్టు, చర్మానికి పోషణ...

నమ్మడానికి కాస్త వింతగా అనిపించినప్పటికీ.. కోడిగుడ్లు ఉడికించిన నీరు మన జుట్టు, చర్మానికి మంచి పోషణ అందిస్తుంది. ఈ నీటిలోని ఖనిజాలు జుట్టు కుదుళ్లను బలపరచడానికి, చుండ్రు సమస్యను తగ్గించడానికి, జుట్టు మెరిచేలా, ఆరోగ్యంగా కనిపించేలా చేయడానికి కూడా సహాయపడుతుంది. గుడ్లు ఉడికించిన తర్వాత ఆ నీటిని చల్లారనిచ్చి.. తర్వాత దానితో హెయిర్ వాష్ చేయాలి. రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు అందంగా మారుతుంది. ఈ నీటిని ఫేస్ కి టోనర్ గా వాడితే.. చర్మం కూడా అందంగా మారుతుంది.

పెంపుడు జంతువుల ఎముకలను బలపరుస్తుంది

ఈ నీరు మనుషులకే కాకుండా పెంపుడు జంతువులకు కూడా ప్రయోజనకరం. మీకు కుక్క లేదా పిల్లి ఉంటే, వాటి ఆహారంలో ఈ నీటిని కలపడం వల్ల వాటి ఎముకలు , దంతాలు బలపడతాయి. ఇది కీళ్ల నొప్పులు, కాల్షియం లోపాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే...

ఈ నీటి ప్రయోజనాలను పొందడానికి అత్యంత ముఖ్యమైన విషయం దాని స్వచ్ఛత. గుడ్ల పెంకుల నుండి మురికి నీటిలోకి రాకుండా ఉండటానికి, వాటిని ఉడకబెట్టే ముందు శుభ్రమైన నీటితో కడగాలి. మీరు దీనిని మొక్కలకు నీరు పోయడం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటే, దానిని ఫ్రిజ్‌లో గాజు సీసాలో నిల్వ చేసి, 24 గంటలలోపు వాడండి. ఉడకబెట్టేటప్పుడు గుడ్లు నీటిలో పగిలిపోతే, ఆ నీటిని ఉపయోగించవద్దు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Related Stories
Recommended image1
Electric Kettle: బ్యాచిలర్స్ కి వరం.. ఒక ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటే చాలు, గ్యాస్ తో పని లేదు..ఎన్ని వంటలు చేయచ్చో తెలుసా?
Recommended image2
Electricity Bill: ఈ ఒక్క పని చేస్తే... మీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గడం గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved