MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Electric Kettle: బ్యాచిలర్స్ కి వరం.. ఒక ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటే చాలు, గ్యాస్ తో పని లేదు..ఎన్ని వంటలు చేయచ్చో తెలుసా?

Electric Kettle: బ్యాచిలర్స్ కి వరం.. ఒక ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటే చాలు, గ్యాస్ తో పని లేదు..ఎన్ని వంటలు చేయచ్చో తెలుసా?

 Electric Kettle: ఎల్పీజీ గ్యాస్ దొరకక ఇబ్బంది పడుతున్నారా? ఇండక్షన్ స్టవ్ కూడా అందుబాటులో లేదా? అయితే, మీ దగ్గర ఒక ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటే చాలు. ఎన్ని వంటలు చేయచ్చో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 08 2026, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Electric Kettle
Image Credit : Getty

Electric Kettle

ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ గ్యాస్ సమయానికి దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోతే కనీసం ఇండక్షన్ స్టవ్ కానీ, ఖరీదైన ఎలక్ట్రిక్ కుక్కర్లు కొనేవారు కూడా ఎక్కువైపోయారు. కానీ.. ఇంత ఖర్చు లేకుండా... ఇంట్లో ఒక చిన్న ఎలక్ట్రిక్ కెటిల్ ఉంటే చాలు.

దాదాపు అందరు ఇళ్ల్లో ఎలక్ట్రిక్ కెటిల్స్ ఉంటాయి. దానిని అందరు కేవలం నీరు వేడి చేయడానికి మాత్రమే వాడుతుంటారు. కానీ, దీనిని సూపర్ హీరోగా.. అనేక పనులను ఉపయోగించొచ్చు. ముఖ్యంగా బ్యాచిలర్స్ కి ఇదొక వరంలా పని చేస్తుంది. మరి, ఈ కెటిల్ లో ఎన్ని రకాల వంటలు చేయచ్చో ఇప్పుడు తెలుసుకుందాం...

23
1.హెల్దీ బ్రేక్ ఫాస్ట్...
Image Credit : gemini

1.హెల్దీ బ్రేక్ ఫాస్ట్...

ఉదయం మీకు చాలా తొందరగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ కెటిల్ ఉపయోగిస్తే సరిపోతుంది. దీని కోసం మీరు ఎలక్ట్రిక్ కెటిల్ లో నీటిని మరిగించాలి. దానిని ఒక గిన్నెలో ఇన్ స్టంట్ ఓట్ మీల్ లో పోయాలి. అంతే మీ బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిపోతుంది. అంతేకాదు.. సడెన్ గా అర్థరాత్రి ఆకలి వేసినప్పుడు కూడా ఈ కెటిల్ మీరు మ్యాగీ లేదా పాస్తా లాంటివి రెడీ చేసుకోవచ్చు.

2.గుడ్లు ఉడకపెట్టడానికి...

మీరు ఎలక్ట్రిక్ కెటిల్ లో కోడి గుడ్లు కూడా ఉడకపెట్టొచ్చు. కెటిల్ ల నీరు, అందులో కోడి గుడ్లు వేసి కెటిల్ ఆన్ చేస్తే సరిపోతుంది. కొన్ని నిమిషాల్లోనే గుడ్లు రెడీ అయిపోతాయి. స్టవ్ మీద కంటే.. కెటిల్ లో గుడ్లు చాలా తొందరగా ఉడుకుతాయి.

Related Articles

Related image1
Chicken: వారానికి ఎన్నిరోజులు చికెన్ తినాలి? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదం..!
Related image2
Hotel Secrets: హోటల్ కి వెళ్లినప్పుడు ఇవన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?
33
3.నిమిషాల్లో వేడి వేడి సూప్, అన్నం కూడా..
Image Credit : Pinterest

3.నిమిషాల్లో వేడి వేడి సూప్, అన్నం కూడా..

మీకు వేడి వేడిగా సూప్ తాగాలి అనిపించినప్పుడు, కెటిల్ లో నీటిని మరిగించి.. సూప్ మిక్స్ వేసి కలిపి తాగితే సరిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది. అంతేకాదు.. ఈ కెటిల్ లో అన్నం కూడా చాలా ఈజీగా ఉడికించొచ్చు. సరైన మోతాదులో బియ్యం, నీరు కెటిల్ వేసి ఆన్ చేస్తే.. వేడి వేడిగా అన్నం కూడా ఉడుకుతుంది. కెటిల్ లోని స్టీమ్ సెన్సార్ మీ అన్నం సమానంగా ఉడికేలా చేస్తుంది. ఎక్కువసేపు వేడిగా కూడా ఉంచుతుంది.

4.కాఫీ, హాట్ చాక్లెట్...

మీ ఇంటికి అతిథులు వస్తున్నట్లయితే.. మీరు ఎలక్ట్రిక్ కెటిల్ లో 5 నుంచి 6 మందికి సరిపడా కాఫీ లేదా హాట్ చాక్లెట్ తయారు చేసుకోవచ్చు.

5. వంటకు మాత్రమేకాదు.. సౌందర్య సాధనంగా కూడా వాడొచ్చు....

ఫేషియల్ స్టీమ్

మీకు మెరిసే ముఖం కావాలి కానీ పార్లర్‌కు వెళ్ళడానికి సమయం లేకపోతే, ఎలక్ట్రిక్ కెటిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కెటిల్‌లో నీటిని వేడి చేసి, దానిని ఫేషియల్ స్టీమింగ్ కోసం ఉపయోగించండి.

బాటిళ్ల స్టెరిలైజేషన్

మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే, వారి ఫీడింగ్ బాటిళ్లను శుభ్రం చేయడానికి కూడా కెటిల్ వాడొచ్చు. అందులో నీటిని మరిగించి.. ఆ నీటితో బాటిల్లు శుభ్రం చేయచ్చు. లేదంటే.. బాటిల్స్ కెటిల్ వేసి నీరు పోసి కాసేపు మరిగించినా సరిపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Anklets: బటర్‍ఫ్లై డిజైన్ పట్టీలు.. మీ పాదాలకు కొత్త అందం
Recommended image2
Gold Necklace: అదిరిపోయే నెక్లెస్ డిజైన్లు.. మెడ మెరిసిపోవాల్సిందే
Recommended image3
Saunf: భోజనం తర్వాత సోంపు నమిలితే ఇన్ని అన్నీ లాాభాలు కావు
Related Stories
Recommended image1
Chicken: వారానికి ఎన్నిరోజులు చికెన్ తినాలి? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదం..!
Recommended image2
Hotel Secrets: హోటల్ కి వెళ్లినప్పుడు ఇవన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved