MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Food
  • Ice Cream Storage: ఇస్ క్రీం ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు ఉంటే మంచిది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!

Ice Cream Storage: ఇస్ క్రీం ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు ఉంటే మంచిది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!

Ice Cream Storage: చాలా మంది ఐస్ క్రీం డబ్బాలు, డబ్బాలు తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటూ ఉంటారు. తినాలనిపించినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుని తింటారు. కొందరు నెలలతరబడి ఉంచేస్తారు. అసలు ఐస్ క్రీం ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు ఉంటే సేఫ్?

1 Min read
Author : Nandini Arava
Published : May 30 2026, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్స్ ఎన్ని రోజులు ఉంచాలి?
Image Credit : instagram

ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్స్ ఎన్ని రోజులు ఉంచాలి?

ఫ్రిడ్జ్, ఫీజర్ లో ఎన్ని రోజులు ఆహారం ఉన్నా ఏం కాదని చాలా మంది అనుకుంటారు. అది కేవలం అపోహ మాత్రమే. ఒకటి, రెండు రోజులకు మాత్రమే ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం మంచిది. వీలైతే ఫ్రిడ్జ్ లో పెట్టకపోవడం మరీ మంచిది. కానీ ఐస్ క్రీమ్స్ లాంటివి ఫ్రిడ్జ్ లోనే ఉంచాలి. అందుకని కొందరు నెలల తరబడి ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్స్ పెట్టుకుని తింటారు. డబ్బాలు డబ్బాలు తెచ్చిపెట్టుకుని నిల్వ చేసుకుంటారు. అలా చేయడం అసలు మంచిది కాదు. ప్రతి దానికి ఒక ఎక్స్ పైరీ ఉంటుంది. ఐస్‌క్రీమ్ కూడా పాడవుతుంది. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే, దాని నుంచి వాసన రావడం మొదలవుతుంది. అందుకే ఐస్‌క్రీమ్‌ను ఫ్రీజర్‌లో ఎలా పెట్టాలో, ఎన్ని రోజులు ఉంచాలో కూడా తెలుసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఐస్‌క్రీమ్ ఎంతకాలం సురక్షితం?
Image Credit : chatgpt

ఐస్‌క్రీమ్ ఎంతకాలం సురక్షితం?

ఐస్‌క్రీమ్ ప్యాక్ ఓపెన్ చేయకపోతే, దాన్ని ఒకటి నుంచి రెండు నెలల వరకు ఫ్రీజర్‌లో పెట్టొచ్చు. ప్యాకేజీపై ఉన్న ఎక్స్ పైరీ డేట్ చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ప్యాక్ ఓపెన్ చేస్తే మాత్రం, ఏడు నుంచి పది రోజుల్లో తినేయాలి. అప్పటివరకే ఐస్‌క్రీమ్ తాజాగా ఉంటుంది. లేదంటే త్వరగా కరిగిపోవడం, నీరు పట్టేయడం లాంటివి జరిగే అవకాశం ఉంది. 

34
ఐస్‌క్రీమ్ పాడైందని ఇలా గుర్తించండి
Image Credit : chatgpt

ఐస్‌క్రీమ్ పాడైందని ఇలా గుర్తించండి

ఐస్‌క్రీమ్‌ను ఎప్పుడూ చల్లటి ఉష్ణోగ్రతలో ఉంచాలి. టెంపరేచర్ పెరిగితే ఐస్‌క్రీమ్ త్వరగా పాడవుతుంది. ఐస్‌క్రీమ్ రుచి మారినా, దానిపై మంచు గడ్డలు ఏర్పడినా, లేదా ఫ్రీజర్ వాసన వస్తున్నా.. మీ ఐస్‌క్రీమ్ పాడైపోయినట్లే. అలా ఉంటే అస్సలు తినకండి.

44
ఐస్‌క్రీమ్ నిల్వ ఇలా ఉండాలి
Image Credit : chatgpt

ఐస్‌క్రీమ్ నిల్వ ఇలా ఉండాలి

ఇష్టపడి కొన్న ఐస్‌క్రీమ్ ఎక్కువ రోజులు రావాలంటే, దాన్ని సరైన పద్ధతిలో స్టోర్ చేయాలి. గాలి చొరబడని డబ్బాలో ఐస్‌క్రీమ్ పెట్టండి. మూత గట్టిగా ఉండేలా చూసుకోండి. ఐస్‌క్రీమ్ బాక్స్‌ను, ఫ్రీజర్‌ను పదేపదే తెరవొద్దు. ఐస్‌క్రీమ్ పైన బట్టర్ పేపర్ ఉంచడం వల్ల గాలి తగలకుండా గట్టిగా ఉండేలా చేస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Related Stories
Recommended image1
Fridge Organizers: కేవలం రూ.100కే దొరికే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సులు..నాణ్యతలోనూ బెస్ట్ ఛాయిస్
Recommended image2
Ice Cream: పాలు లేకుండానే ఐస్ క్రీమ్..తింటే ఐసైపోతారు..డైట్ చేసేవాళ్లకి క్రేవింగ్ తీరిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved