MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Electricity Bill: ఈ ఒక్క పని చేస్తే... మీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గడం గ్యారెంటీ

Electricity Bill: ఈ ఒక్క పని చేస్తే... మీ కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గడం గ్యారెంటీ

Electricity Bill: వేసవిలో ఏసీ, ఫ్రిజ్, కూలర్, ఫ్యాన్ ఎక్కువగా వాడుతాం కాబట్టి కరెంట్ బిల్లు వాచిపోద్ది. నెలాఖరులో బిల్ చూసి చేతులు తడుముకుంటారు. అందుకే కొంచెం బ్రెయిన్ వాడితే ఖర్చు తగ్గించుకోవచ్చు. సింపుల్ అలవాట్లతో కరెంట్ బిల్ కంట్రోల్‌లో ఉంటుంది. 

3 Min read
Author : Nandini Arava
Published : Apr 24 2026, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
విద్యుత్ బిల్లు సగానికి తగ్గుతుంది
Image Credit : our own

విద్యుత్ బిల్లు సగానికి తగ్గుతుంది

వేసవి వచ్చిందంటే చాలు కరెంట్ వినియోగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇల్లంతా కూల్ గా ఉండాలని అన్ని గదుల్లోనూ ఫ్యాన్, ఏసీ, కూలర్ నడవాల్సిందే. అందుకే ఎక్కువసేపు ఆన్‌లో ఉండటం వల్ల నెలాఖరులో వచ్చిన బిల్ చూసి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అందుకే తప్పదని అనిపించినా, కొన్ని చిన్న మార్పులు అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఖర్చును సగానికి సగం తగ్గించుకోవచ్చు. దాదాపు రూ.300 నుంచి రూ.500 వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు.

టీవీ, సెట్-టాప్ బాక్స్, ఛార్జర్లు వంటివి స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నా కరెంట్ వృథా అవుతుంది. దీన్ని నివారించడానికి, వాడకం పూర్తయ్యాక స్విచ్ బోర్డు నుంచే ఆఫ్ చేయడం మంచి అలవాటు. ముఖ్యంగా రాత్రిపూట అనవసరమైన అన్ని పరికరాలను ఆఫ్ చేయాలి. ఇది చిన్న విషయంగా అనిపించినా, నెల చివరికి వచ్చే బిల్లులో మంచి ఆదాను చూపిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఏసీ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Image Credit : Pixabay

ఏసీ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

వేసవి కాలంలో ఏసీ లేకుండా ఉండటం చాలా కష్టం. అసలే ఉక్కపోత, బయట సెగలు కక్కే ఎండలు. ఈ సమయంలో ఏసీ వేసుకోకపోతే అస్సలు కుదరదు. అయితే కొంచెం జాగ్రత్తగా వాడితే ఖర్చు చాలా కంట్రోల్ అయిపోతుంది. మరీ ఏసీ 18°C నుంచి 20°C పెట్టడం కంటే కాస్త ఎక్కువగా 26°C పెట్టుకోండి. దానివల్ల కరెంట్ సేవ్ చేయోచ్చు. ఇంట్లోకి బయట వేడి లోపలికి రాకుండా కర్టెన్లు వేసుకోవడం మంచిది. అలాగే తలుపులు, కిటికీలు మూసి ఉంచితే చల్లదనం ఎక్కువసేపు నిలుస్తుంది. ఏసీ ఫిల్టర్‌ను తరచూ శుభ్రం చేస్తూ, సరిగ్గా చూసుకుంటే సూపర్‍గా పనిచేస్తుంది. ఇలా కాస్త జాగ్రత్తగా ఉంటే బిల్లు సగానికి సగం తగ్గినట్లే.

38
LED బల్బులతో కరెంట్ ఆదా
Image Credit : Gemini AI

LED బల్బులతో కరెంట్ ఆదా

పాతకాలపు బల్బులు, ట్యూబ్‌లైట్లతో పోలిస్తే LED బల్బులు చాలా తక్కువ కరెంట్‌ను వాడుకుంటాయి. ఇవి ఎక్కువ కాలం మన్నుతాయి కాబట్టి.. తరచుగా మార్చాల్సిన పని ఉండదు. ముఖ్యంగా రాత్రిపూట నైట్ ల్యాంప్‌గా LED వాడితే మరింత ఆదా అవుతుంది. ఇంట్లో అన్ని చోట్లా LED లైట్లకు మారితే కరెంట్ వాడకం బాగా తగ్గుతుంది. దీనివల్ల కరెంట్ బిల్లులో 10-15% వరకు ఆదా చేయవచ్చు.

48
వంటగదిలో వస్తువులు కరెంట్ ఎక్కువ లాగుతాయి, వెంటిలేషన్ బాగా ఉండాలి
Image Credit : Gemini AI

వంటగదిలో వస్తువులు కరెంట్ ఎక్కువ లాగుతాయి, వెంటిలేషన్ బాగా ఉండాలి

వంటగదిలోని పరికరాలు ఎక్కువ కరెంట్‌ను వాడతాయి. ఫ్రిజ్ టెంపరేచర్‌ను 3°C నుంచి 5°C మధ్యలో ఉంచడం సరైనది. ఫ్రిజ్ డోర్‌ను పదేపదే తెరవొద్దు. అలా చేస్తే లోపలి చల్లదనం తగ్గి, ఎక్కువ కరెంట్ ఖర్చవుతుంది. మైక్రోవేవ్, మిక్సర్, టోస్టర్ వంటి వాటిని అవసరమైనంత వరకే వాడాలి. పని పూర్తయ్యాక వాటిని ఆఫ్ చేసి ప్లగ్ తీసేయాలి. ఈ చిన్న మార్పులతో కరెంట్ వాడకాన్ని తగ్గించి, బిల్లులో మంచి ఆదా పొందవచ్చు.

ఇంట్లోకి గాలి, వెలుతురు వస్తుంటే ఎలక్ట్రిక్ పరికరాల వాడకం తగ్గుతుంది.  గదిలోని వేడిని తగ్గిస్తుంది. దీనివల్ల ఏసీ లేదా కూలర్ వాడకం తగ్గుతుంది. పగటిపూట గాలి, వెలుతురుతో ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. ఇంటి చుట్టూ చెట్లు, మొక్కలు పెంచితే వాతావరణం కూడా చల్లబడుతుంది. 

58
రాత్రి సమయంలో విద్యుత్ ఆదా చేయొచ్చు
Image Credit : our own

రాత్రి సమయంలో విద్యుత్ ఆదా చేయొచ్చు

రాత్రిపూట చాలామంది తెలియకుండానే కరెంట్‌ను వృథా చేస్తుంటారు. మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్లు ఫుల్ ఛార్జ్ అయ్యాక కూడా ప్లగ్‌కు కనెక్ట్ చేసే ఉంటాయి. ఇది అనవసర కరెంట్ వాడకానికి దారితీస్తుంది. అవసరం లేని లైట్లను ఆఫ్ చేయడం చాలా ముఖ్యం. నైట్ ల్యాంప్‌గా తక్కువ కరెంట్ వాడే LED లైట్లను వాడొచ్చు. ఏసీ, ఫ్యాన్లను అవసరానికి తగ్గట్టు వాడాలి. ఈ అలవాట్లు పాటిస్తే నెలకు రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా ఆదా చేయవచ్చు.

68
స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నా కరెంట్ వృథానే
Image Credit : our own

స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నా కరెంట్ వృథానే

టీవీ, కంప్యూటర్ వంటి పరికరాలను స్టాండ్‌బై మోడ్‌లో ఉంచితే కరెంట్ ఆదా అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నా పరికరాలు కరెంట్‌ను వాడుతూనే ఉంటాయి. ఈ కనిపించని ఖర్చు నెల చివరికి బిల్లును పెంచుతుంది. కాబట్టి, వాడని సమయాల్లో పరికరాలను పూర్తిగా ఆఫ్ చేసి ప్లగ్ తీసేయాలి. ఇది మంచి అలవాటుగా మారితే, కరెంట్ ఖర్చులో బాగా తగ్గిపోతుంది.

 

78
డ్యామేజ్ వైర్లు సరిచేసుకోవాలి
Image Credit : Getty

డ్యామేజ్ వైర్లు సరిచేసుకోవాలి

ఇంట్లో ఎలక్ట్రిక్ వైరింగ్ పాతబడినా లేదా పాడైనా కరెంట్ వృథా అవుతుంది. డ్యామేజ్ అయిన వైర్లు, పాత పరికరాలు ఎక్కువ కరెంట్‌ను లాగుతాయి. వాటిని వెంటనే సరిచేయాలి. కరెంట్ మీటర్‌ను అప్పుడప్పుడు చెక్ చేస్తూ, సమస్యలుంటే పరిష్కరించాలి. కొత్తగా ఎనర్జీ ఎఫిషియెంట్ పరికరాలను వాడటం మంచిది. ఇది కరెంట్ వాడకాన్ని తగ్గిస్తే ఖర్చు తగ్గిస్తుంది. భద్రత కూడా పెరుగుతుంది కాబట్టి, ఈ మెయింటెనెన్స్ పనులు చాలా అవసరం.

88
పాత విద్యుత్ వస్తువులు సరిచేసుకోవాలి
Image Credit : our own

పాత విద్యుత్ వస్తువులు సరిచేసుకోవాలి

ఫ్యాన్లు, ఏసీ వంటి పరికరాలను శుభ్రంగా ఉంచడం వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. దుమ్ము పట్టిన ఫ్యాన్లు ఎక్కువ కరెంట్‌ను తీసుకుంటాయి. ఏసీ ఫిల్టర్‌ను తరచుగా శుభ్రం చేస్తే అది గదిని వేగంగా చల్లబరుస్తుంది. దీనివల్ల కరెంట్ వాడకం తగ్గుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాలను సరిగ్గా మెయింటెయిన్ చేస్తే వాటి లైఫ్ కూడా పెరుగుతుంది. రిపేర్ల ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ సింపుల్ మెయింటెనెన్స్ చిట్కాలతో కరెంట్ బిల్లులో మంచి ఆదా పొందవచ్చు.

కరెంట్ ఆదా విషయంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పును తెస్తాయి. గదిలో ఎవరూ లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయాలి. పగటిపూట సహజమైన వెలుతురును వాడుకోవాలి. అనవసరమైన పరికరాలను వాడకుండా ఉండటం ముఖ్యం. ఇంట్లో అందరూ ఈ అలవాట్లను పాటిస్తే, కరెంట్ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. రోజూ ఈ పద్ధతులు పాటిస్తే, నెల చివరికి మంచి ఆదా కనిపిస్తుంది. ఇది మీ డబ్బుకే కాదు, పర్యావరణానికి కూడా మంచిది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
AC Water Reuse: ఏసీ వేస్ట్ వాటర్‌ పడేస్తున్నారా? ఇలా చేస్తే 30 లీటర్ల నీరు ఆదా అవుతుంది
Recommended image2
Electricity Bill : సీలింగ్ ప్యాన్ vs టేబుల్ ప్యాన్ .. మీ కరెంట్ బిల్లు తగ్గాలంటే ఏది బెస్ట్..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved