డెలివరీ అయిన తల్లులు బ్రెడ్ తింటే నిజంగానే పాలు పెరుగుతాయా? అసలు విషయం వేరే ఉంది..
మహిళలు డెలివరీ అయిన వెంటనే చాలా మంది ఇచ్చే సలహా పాలు, బ్రెడ్ తినాలని. ఇలా తింటేనే పిల్లలకు సరిపడ పాలు అందుతాయని పెద్దలు చెబుతుంటారు. అయితే ఇందులో నిజంగానే నిజం ఉందా.? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎవరైనా తెలిసిన మహిళలు బిడ్డకు జన్మనిచ్చారని తెలిసిన వెంటనే వారిని పలకరించేందుకు వెళ్లడం కామన్. అయితే కూడా వెళ్లే సమయంలో కచ్చితంగా ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకెళ్తారు. ఇక చాలా మంది బాలింతలకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు, బ్రెడ్‌ను అందిస్తుంటారు. ఇది చాలా మంది ఇళ్లలో కనిపించే కామన్ సీన్.

పాలు, బ్రెడ్ తీసుకుంటే పిల్లలకు సరిపడ పాలు వస్తాయని. అందుకే డెలివరీ అయిన తల్లులు నచ్చకపోయినా కష్టంగా అయినా బ్రెడ్‌ను తీసుకుంటుంటారు. అయితే బ్రెడ్ తీసుకోవడం వల్ల నిజంగానే పాలు పెరుగుతాయా అంటే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి లాభం కంటే నష్టమే ఎక్కువని వైద్యులు చెబుతున్నారు.
సాధారణంగా బ్రెడ్ మైదా పిండితో తయారు చేస్తారు. ఇది మహిళల్లో అజీర్తి, మలబద్ధకానికి దారి తీస్తుంది. సాధారణంగానే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మలబద్ధకం వేధిస్తుంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. దీనికి తోడు బ్రెడ్ తీసుకుంటే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందుకే అదే పనిగా బ్రెడ్ తినడం మంచిది కాదని అంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు తీసుకుంటే పర్లేదు కానీ ఎక్కువగా తీసుకోకూడదని అంటున్నారు.
మధ్యాహ్నం లేదా సాయంత్రం బ్రెడ్‌ని తీసుకుంటే పర్లేదని చెబుతున్నారు. ఉదయం ఇడ్లీ, ఉప్మా వంటివి బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకానీ బ్రెడ్‌తోనే ఏదో అద్భుతం జరుగుతుందని అనుకోవడం కచ్చితంగా పొరపాటే అంటున్నారు.