MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Food
  • Coriander: కొత్తిమీర ఆకులు తుంచి, కాడలు పారేస్తున్నారా? ఇక నుంచి ఇలా వాడేయండి

Coriander: కొత్తిమీర ఆకులు తుంచి, కాడలు పారేస్తున్నారా? ఇక నుంచి ఇలా వాడేయండి

Coriander: కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కొత్తిమీర ఆకులకంటే కాడల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ విషయం తెలియక చాలా మంది ఆకులను కూరల్లో వేసి.. కాడలను పారేస్తూ ఉంటారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 10 2026, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కొత్తిమీర..
Image Credit : Getty

కొత్తిమీర..

దాదాపు ప్రతి ఒక్కరూ వంట చేసేటప్పుడు కొత్తిమీర వాడుతూ ఉంటారు. చట్నీల నుంచి కూరలు, బిర్యానీల వరకు కొత్తిమీర లేకుండా ఏదీ పూర్తి అవ్వదు. అయితే... ఈ కొత్తిమీర వాడేటప్పుడు చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. కేవలం ఆకులను మాత్రమే వాడి.. కాడలను ఎందుకూ పనికిరావు అని పారేస్తూ ఉంటారు. కొత్తిమీర కాడలు కాస్త మందంగా ఉంటాయి. కూరలో ఉడకవని వాడరు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... కొత్తిమీర ఆకుల కంటే.. కాడలే ఎక్కువ రుచిగా ఉంటాయి. ఈ కాడల్లో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.మరి.. ఈ కొత్తిమీర కాడలను పారేయకుండా...ఎన్ని రకాలుగా వాడచ్చో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గ్రేవీ కర్రీ...
Image Credit : Pinterest

గ్రేవీ కర్రీ...

వెజ్ లేదా నాన్ వెజ్ ఏదైనా గ్రేవీ కర్రీ చేస్తున్నారా అయితే, అప్పుడు మీరు ఈ కొత్తిమీర కాడలను వాడచ్చు. గ్రేవీ కర్రీలు చేసేటప్పుడు చాలా మంది టమాట, ఉల్లిపాయ లాంటి వాటిని వేయించి.. తర్వాత ఆ మిశ్రమాన్ని కూరలో వేస్తూ ఉంటారు. అయితే.. అప్పుడు మీరు ఈ కొత్తిమీర కాడలను కూడా కాస్త వేయించి.. తర్వాత.. దానిని కూడా మిక్సీ పట్టీ కూరలో వేయచ్చు. ఇలా చేయడం వల్ల కూరకు మంచి రుచి రావడమే కాకుండా.. పోషకాలు కూడా లభిస్తాయి.

సూప్ లో వాడేయండి..

మీరు ఏదైనా సూప్ లేదా రసం లాంటివి చేసేటప్పుడు ఈ కొత్తిమీర కాడలు కూడా వేసి మరిగించొచ్చు. మరిగిన తర్వాత కావాలంటే..ఆ కాడలను తీసేయచ్చు. రుచి మాత్రం పెరుగుతుంది.

Related Articles

Related image1
Fenugreek Water: పరగడుపున 30 రోజులు మెంతుల నీళ్లు తాగితే ఏమౌతుంది?
Related image2
Fridge: ఫ్రిజ్ లో చికెన్, మటన్, చేపలు ఎన్ని రోజులు స్టోర్ చేయచ్చో తెలుసా?
33
తాళింపులో...
Image Credit : stockphoto

తాళింపులో...

మీరు పప్పు లేదా ఏదైనా కూరగాయలు వండేటప్పుడు..తాళింపులో కొత్తిమీర కాడలు వేస్తే సరిపోతుంది. అయితే.. ఆ కొత్తిమీర కాడలను సన్నగా తరిగి.. నూనె వేడి చేయ్యగానే వేయాలి. ఇలా తాళింపులో కొత్తిమీర సన్నగా తరిగి వేయడం వల్ల కూరకు మంచి రుచి పెరుగుతుంది

చికెన్ మారినేషన్ లో...

చికెన్ కర్రీ లేదా బిర్యానీ వండేటప్పుడు మనం దానిని మారినేట్ చేస్తూ ఉంటాం. చికెన్ ని అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మసాలాలతో మారినేట్ చేసేటప్పుడు దానిలో ఈ కొత్తిమీర కాడలను కూడా చేర్చాలి. డైరెక్ట్ గా కాకుండా.. ఈ కొత్తిమీర కాడలను మెత్తని పేస్టులా మార్చి చికెన్ లో వేసి మారినేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ చికెన్ కర్రీ రుచి హెల్దీగా మారడంతో పాటు.. రుచి రెట్టింపు అవుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Related Stories
Recommended image1
Fenugreek Water: పరగడుపున 30 రోజులు మెంతుల నీళ్లు తాగితే ఏమౌతుంది?
Recommended image2
Fridge: ఫ్రిజ్ లో చికెన్, మటన్, చేపలు ఎన్ని రోజులు స్టోర్ చేయచ్చో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved