Black Cumin: చలికాలంలో నల్ల జీలకర్ర తీసుకుంటే ఏమౌతుంది?
Black Cumin: నార్మల్ జీలకర్ర కాదు.. నల్ల జీలకర్ర మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటినే కళోంజీ సీడ్స్ అని కూడా పిలుస్తారు. మరి, వీటిని చలికాలంలో ఎందుకు తీసుకోవాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

Black Cumin Seeds
చలికాలంలో సహజంగానే మన శారీరక శ్రమ తగ్గుతుంది.అదే సమయంలో వేడి వేడి పదార్థాలు, నూనెలో వేయించిన తండి తినాలనే కోరిక పెరుగుతుంది. వాటిని తినడం వల్ల తెలియకుండా బరువు పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇలాంటి సమయంలో నల్ల జీలకర్ర ( Black Cumin) మన ఆరోగ్యానికి ఒక అద్భుతమైన వింటర్ సూపర్ ఫుడ్ లా పని చేస్తుంది.
చలికాలంలో నల్ల జీలకర్రను ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు...
1.అధిక బరువు తగ్గుతుంది ( Weight Control)
చలికాలంలో కదలికలు తక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. నల్ల జీలకర్రపై జరిగిన పరిశోధల ప్రకారం, ఇది శరీరంలో కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. దీని వల్ల చలికాలంలో అధిక బరువు పెరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. బరువు పెరుగుతామనే భయం ఉండదు.
2.గుండె ఆరోగ్యం..(Heart Health)
చలికాలంలో రక్తనాళాలు కుచించుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. నల్ల జీలకర్ర తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ( LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది.
3. జీవక్రియను వేగవంతం చేస్తుంది (Metabolism Boost)
చలికాలంలో మన జీర్ణక్రియ మందగిస్తుంది. నల్ల జీలకర్రలో ఉండే థైమోక్వినోన్ (Thymoquinone) అనే శక్తివంతమైన సమ్మేళనం జీవక్రియ ప్రక్రియను చురుగ్గా ఉంచుతుంది. ఇది శరీరంలో శక్తిని పెంచి, ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
4. కీళ్ల నొప్పులు, వాపుల నుండి ఉపశమనం (Anti-Inflammatory)
చలి పెరిగేకొద్దీ చాలామందిలో కీళ్ల నొప్పులు, శరీర వాపులు పెరుగుతాయి. ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. నల్ల జీలకర్రలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని వాపును తగ్గించి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది (Immunity)
జలుబు, దగ్గు వంటి సమస్యలు చలికాలంలో సర్వసాధారణం. నల్ల జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది కేవలం బరువు తగ్గించడమే కాకుండా, సీజనల్ వ్యాధుల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది.
ఈ నల్ల జీలకర్రను ఎలా తీసుకోవాలి..?
పొడి రూపంలో: నల్ల జీలకర్రను కొద్దిగా వేయించి పొడి చేసి, గోరువెచ్చని నీటిలో లేదా తేనెతో కలిపి ఉదయాన్నే తీసుకోవచ్చు. లేదంటే.. మీరు తినే ఏదైనా ఆహారంలో ఈ పొడిని కలుపుకొని తీసుకోవచ్చు.అయితే, నల్ల జీలకర్ర ప్రభావం ఒక్క రోజులో కనిపించదు. క్రమం తప్పకుండా తీసుకుంటూ, చలికాలంలో కూడా చిన్నపాటి వ్యాయామాలు లేదా యోగా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.

