Almond: రోజూ బాదం పప్పు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
Almond Health Benefits: బాదం ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్. ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే.. వీటిని రాత్రి పడుకునే ముందు తినడం వల్ల లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.

పోషకాల నిధి బాదం
డ్రై ఫ్రూట్స్ అంటే గుర్తుకు వచ్చేవి జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష. అందులో బాదం ఓ అద్భుతమైన డ్రై ఫ్రూట్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, సెలీనియం, రాగి, నియాసిన్ వంటి ఎన్నో పోషకాలున్నాయి. అలాంటి బాదం ను రాత్రి పడుకునే ముందు తింటే ఏమవుతుందో తెలుసా?
నిద్రలేమి
ప్రతిరోజూ రాత్రి బాదం తింటే అది మీ నిద్రను మెరుగుపరుస్తుంది. బాదంపప్పులో మెలటోనిన్, మెగ్నీషియం ఉంటాయి, ఇవి నిద్రను మెరుగుపరచడానికి సహాయపడతాయి. మెలటోనిన్ నిద్రను నియంత్రించే హార్మోన్, మెగ్నీషియం కండరాల సడలింపును ప్రోత్సహిస్తుంది.
ఊబకాయానికి చెక్
మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే.. రాత్రి వేళ బాదం తినవచ్చు. ఎందుకంటే బాదంలో ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఇలా అధికంగా తినకుండా బరువును నియంత్రించడంలో సహాయపడుతాయి.
ఎముకల దృఢత్వం
బాదంలో కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి, ఇవి ఎముకలను బలపరుస్తాయి. రాత్రి బాదం తినడం వల్ల బలహీనమైన ఎముకలను బలోపేతం చేయవచ్చు.
జ్ఞాపకశక్తి పెరుగుదల
మీకు మతిమరుపు ఉంటే బాదం తినండి. బాదంలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
మెరుగైన జీర్ణక్రియ
ప్రతిరోజూ రాత్రి బాదం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులోని ఫైబర్ మలబద్ధక సమస్యను తొలగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.