పచ్చిమిర్చి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!
food-life Mar 12 2026
Author: Kavitha G Image Credits:social media
Telugu
శుభ్రంగా కడగడం
మార్కెట్ నుంచి పచ్చిమిర్చి తెచ్చిన వెంటనే వాటిని నీటిలో శుభ్రంగా కడగాలి. తర్వాత, శుభ్రమైన క్లాత్‍పై పరిచి పూర్తిగా ఆరబెట్టాలి. తేమ ఉంటే మిర్చి త్వరగా కుళ్లిపోతుంది.
Image credits: Freepik
Telugu
తొడిమలు తీయడం
పచ్చిమిరపకాయల తొడిమలను తీసివేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
Image credits: social media
Telugu
టిష్యూ పేపర్ వాడకం
పచ్చిమిర్చిని గాలి చొరబడని డబ్బాలో పెట్టే ముందు, దాని అడుగున ఒక టిష్యూ పేపర్ వేయాలి. ఇది తేమను పీల్చుకొని మిర్చిని తాజాగా ఉంచుతుంది.
Image credits: AI
Telugu
గాజు డబ్బాలో..
పచ్చిమిర్చిని ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా, గాజు డబ్బాలో నిల్వ చేయడం మంచిది. ఇలా చేస్తే అవి చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి.
Image credits: social media
Telugu
ఫ్రిజ్‍లో ఎలా పెట్టాలంటే?
పచ్చిమిర్చి ఉన్న డబ్బాను ఫ్రిజ్‌లోని వెజిటబుల్ డ్రాయర్‌లో పెట్టాలి. అక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా, చల్లగా ఉంటుంది. ఇది మిర్చి తాజాగా ఉండటానికి సహాయపడుతుంది.
Image credits: stockphoto
Telugu
ఆవనూనె వాడకం
కొంతమంది పచ్చిమిర్చికి ఆవనూనె రాసి నిల్వ చేస్తారు. ఇలా చేయడం వల్ల అవి పాడవకుండా ఉండటమే కాకుండా, వాటికి ఒక ప్రత్యేకమైన రుచి కూడా వస్తుంది.