Fennel Water: సోంపు తినడం కాదు, ఇలా నీరు తాగితే ఎన్ని లాభాలో..!
సోంపు మాత్రమే కాదు, సోంపు నీళ్లు కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లేలా చేస్తాయి. చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతాయి.

fennel water
మనలో చాలా మందికి సోంపు తినే అలవాటు ఉంటుంది. భోజనం చేసిన తర్వాత తిన్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికి ఈ సోంపు తింటూ ఉంటారు.మరికొందరు నోటి దుర్వాసన రాకుండా ఉండేందుకు సోంపు తింటూ ఉంటారు. అయితే.. కేవలం నోటికి రిఫ్రెష్మెంట్ గా మాత్రమే కాదు.. ఈ గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. సోంపు నమలడం కాకుండా.. నీటి రూపంలో తీసుకుంటే మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

fennel water
సోంపు నీళ్ళల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బిఏ, ఇ, కె, ఎ, బి, ఫోలేట్, నియాసిన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యవంతమైన శరీరానికి చాలా అవసరం.ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి.
సోంపు నీళ్ళు తాగితే కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: సోంపు నీళ్ళు జీర్ణక్రియ సమస్యల్ని తగ్గిస్తాయి. ఇవి జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతాయి, దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరానికి హైడ్రేషన్ ఇస్తుంది.
గ్యాస్, మలబద్ధకం నుంచి ఉపశమనం: సోంపులో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. ఇవి గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. ఇది కడుపులో ఆమ్లాన్ని తగ్గిస్తుంది, దీనివల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట తగ్గుతాయి. సోంపు నీళ్ళల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది: సోంపు నీళ్ళు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సోంపు నీళ్ళు జీవక్రియను పెంచి, బరువు తగ్గడానికి సహాయపడతాయి.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: సోంపు నీళ్ళు శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. సోంపులో ఉండే యాంటీమైక్రోబియల్ గుణాలు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.

సోంపు గింజలలో విటమిన్ బి, విటమిన్ సి తోపాటు పొటాషియం, ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అంతేకాకుండా వీటితోపాటు యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants), పాలీఫినాల్స్ (Polyphenols) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడ్డ కొవ్వును కరిగించి అధిక బరువు సమస్యలను దూరం చేస్తాయి. కనుక బరువు తగ్గాలనుకునేవారు సోంపు గింజల కషాయాన్ని తీసుకుంటే మంచిది.
రక్తపోటు నియంత్రణ:
సోంపు నీటిలో ఉండే పొటాషియం, శరీరంలోని సోడియం స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది హై బీపీ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
హార్మోన్ సమతుల్యతకు సహాయం:
స్త్రీలలో మాసికచక్రం, హార్మోనల్ మార్పుల కారణంగా వచ్చే సమస్యలను సోంపు నీళ్లు కొంతవరకు సమతుల్యం చేస్తాయి. ముఖ్యంగా PCOS/PCOD సమస్యలు ఉన్నవారికి సహాయపడుతుంది.
ఉత్తమ నిద్రకు తోడ్పడుతుంది:
సోంపు నీటిలో సహజమైన శాంతివంతమైన లక్షణాలు ఉండటం వలన ఇది నిద్రలేమి బాధపడే వారికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు సోంపు నీళ్లు తాగితే మెరుగైన నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది.

fennel water
కంటి ఆరోగ్యానికి మంచిది:
సోంపులో ఉండే విటమిన్ A, యాంటీఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. రెటినా ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.
ఇమ్యూనిటీ పెరుగుతుంది:
సోంపు నీటిలో ఉండే విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. సీజనల్ జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి.
సోంపు నీరు ఎలా తయారు చేయాలి?
రాత్రంతా ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ వేసి నాననివ్వాలి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి.. గోరు వెచ్చగా తాగితే సరిపోతుంది.