Cabbage: రెగ్యులర్ గా క్యాబేజీ తింటే ఏమౌతుంది?
Cabbage: క్యాబేజీలో ఫైబర్, నీటి శాతం, గట్ లో ప్రయోజనకరమైన బాక్టీరియా ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. చెడు బాక్టీరియా పెరుగుదలను కూడా నియంత్రిస్తుంది.

క్యాబేజీ
మనం ప్రతిరోజూ వంట కోసం ఉపయోగించే ప్రతి కూరగాయలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. వీటిని సరైన మొత్తంలో తీసుకుంటే, శరీరంలోని అనేక అవయవాలు సజావుగా పని చేయడం మాత్రమే కాకుండా, చాలా రకాల వ్యాధులు దరిచేరకుండా జీవించడానికి సహాయపడుతుంది. మరి.. రెగ్యులర్ గా క్యాబేజీ తింటే ఏమౌతుంది? కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం...
క్యాబేజీలో పోషకాలు...
క్యాబేజీలో విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే క్యాబేజీ శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి,గుండె ఆరోగ్యం, చర్మ సంరక్షణ పెంచడానికి చాలా రకాలుగా సహాయపడుతుంది.
ముఖ్యంగా క్యాబేజీలో ఫైబర్, నీటి శాతం, గట్ లో ప్రయోజనకరమైన బాక్టీరియా ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. చెడు బాక్టీరియా పెరుగుదలను కూడా నియంత్రిస్తుంది.
పేగు ఆరోగ్యం...
ఈ రోజుల్లో, మనం ఏ ఆహారం తిన్నా, కొన్నిసార్లు కడుపు చికాకు, ఆమ్లత్వం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటాము. అంతేకాకుండా, మనం తినే ఆహారం కూడా జీర్ణం కావడానికి చాలా గంటలు పడుతుంది. మీరు దీన్ని సరిచేయాలనుకుంటే, మీరు క్యాబేజీని మెత్తగా రుబ్బుకుని ప్రతిరోజూ ఉదయం రసంగా చేసి త్రాగవచ్చు. పచ్చిగా తినడం మీకు ఇష్టం లేకపోయినా, క్యాబేజీ , క్యారెట్లతో సూప్ తయారు చేసుకోవచ్చు. పనికి వెళ్ళే తొందరలో ఉదయం తినలేకపోయినా, రాత్రిపూట తినవచ్చు. ఇందులోని విటమిన్ కె, ఎ గ్లుటామైన్ వంటి వివిధ పోషకాలు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది పెద్దప్రేగు శోథ, గ్యాస్ట్రిటిస్ వంటి వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. దీనితో పాటు, క్యాబేజీ రసం ఎసిడిటీ కూడా తగ్గిస్తుంది.
క్యాబేజీ తినడం వల్ల కలిగే ఇతర ఉపయోగాలు:
క్యాబేజీలోని విటమిన్ ఎ , సల్ఫర్ అధికంగా ఉండే పోషకాలు జుట్టు సమస్యలను పరిష్కరించడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ సి లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. క్యాబేజీ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె సజావుగా పనిచేయడంలో సహాయపడుతుంది.
క్యాబేజీ ఎవరు తినకూడదు..?
క్యాబేజీ ఎంత మంచిది అయినా.... చాలా పోషకాలు ఉన్నప్పటికీ... అందరూ దీనిని తినకూడదు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్యాబేజీ తినకపోవడమే మంచిది. మరి ఎవరు తినకూడదంటే...
1. థైరాయిడ్ సమస్యలున్న వారు (Hypothyroidism)
క్యాబేజీలో గోయిట్రోజెన్లు (Goitrogens) అనే పదార్థాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా తింటే థైరాయిడ్ హార్మోన్ల పనితీరు తగ్గిపోతుంది. అందుకే..వీరు క్యాబేజీకి దూరంగా ఉండాలి. అయితే ఉడికించిన క్యాబేజీ అయితే తినవచ్చు.
2. జీర్ణ సమస్యలున్న వారు (Gas, Bloating, IBS)
క్యాబేజీ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా అందరూ తినకూడదు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు క్యాబేజీ కి దూరంగా ఉండటమే మంచిది. లేక గ్యాస్, బ్లోటింగ్, కడుపు నొప్పి సంబంధిత సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి. వీరితో పాటు కిడ్నీ స్టోన్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా క్యాబేజీ తినకపోవడమే మంచిది. కొన్ని రకాల మందులు వేసుకునేవారు కూడా దీనికి దూరంగా ఉండాలి.

