MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Food
  • Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్

Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్

Afghani Chicken: నాన్ వెజ్ ప్రియులకు ముక్క లేకపోతే ముద్ద దిగదు. సండే అనగానే ఇంట్లో మసాలా ఘాటు ఘుమఘుమలాడాల్సిందే. ఈ సండే మీ ఇంట్లో వండే చికెన్ కర్రీ..ఓసారి ఇలా ట్రై చేయండి. జీవితాంతం ఈ రెసిపీ గుర్తు పెట్టుకుంటారు. అంత బాగుంటుంది. అయితే ఓ లుక్కేయండి.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 15 2026, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రీమీగా, స్పైసీగా, మసాలా ఫ్లేవర్‌ చికెన్ రెసిపీ
Image Credit : HomeCookingTelugu/Youtube

క్రీమీగా, స్పైసీగా, మసాలా ఫ్లేవర్‌ చికెన్ రెసిపీ

చికెన్‌తో ఎప్పుడూ ఒకేలాంటి కర్రీలు, ఫ్రైలు చేసుకుని ఏం తింటాం? ఈసారి ఈ ఆఫ్గానీ చికెన్ ట్రై చేయండి. క్రీమీగా, స్పైసీగా, మసాలా ఫ్లేవర్‌తో ఉండే ఈ చికెన్ రెసిపీ... పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ లాగించేస్తారు. ఇందులో వాడే పదార్థాల వల్ల రెస్టారెంట్ స్టైల్ రుచిని ఇంట్లోనే ఇస్తుంది. ఇంకేందుకు ఆలస్యం...రెసిపీ చూసేద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కావాల్సిన పదార్థాలు
Image Credit : HomeCookingTelugu/Youtube

కావాల్సిన పదార్థాలు

చికెన్ – 500 గ్రాములు, పెరుగు – ½ కప్పు, ఫ్రెష్ క్రీమ్ – 3 టేబుల్ స్పూన్లు, కాజూ – 10 నుంచి 12, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీస్పూన్, మిరియాల పొడి – 1 టీస్పూన్, గరం మసాలా – ½ టీస్పూన్, ధనియాల పొడి – ½ టీస్పూన్, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్లు, వెన్న – 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా

Related Articles

Related image1
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Related image2
Fish Pulusu: చిక్కటి గ్రేవీతో స్పైసీ చేపల పులుసు..ఇలా చేశారంటే మూడ్రోజులైనా సరే లాగించేస్తారు!
35
ముందుగా చికెన్‌ను మారినేట్ చేయాలి
Image Credit : HomeCookingTelugu/Youtube

ముందుగా చికెన్‌ను మారినేట్ చేయాలి

ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా పోయేలా ఉంచుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో చికెన్ ముక్కలను వేసి మసాలా మొత్తం పట్టేలా కలపాలి. కనీసం 30 నిమిషాలు మారినేట్ చేయాలి. మరింత రుచిగా కావాలంటే ఫ్రిజ్‌లో 2–3 గంటలు ఉంచుకోవచ్చు.

45
అఫ్గానీ చికెన్ రెసిపీ
Image Credit : HomeCookingTelugu/Youtube

అఫ్గానీ చికెన్ రెసిపీ

కాజూను కొద్దిసేపు వేడి నీటిలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ కాజూ పేస్టే ఆఫ్గానీ చికెన్‌కు మంచి క్రీమీ టెక్చర్, రిచ్‌నెస్ ఇస్తుంది. ఇప్పుడు మంచి మందపాటి కళాయిలో నూనె, వెన్న వేసి వేడి చేయాలి. మారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి మీడియం మంటపై అన్ని వైపులా బాగా వేయించాలి. చికెన్ మీద మచ్చలు వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడే తినేటప్పుడు టెండర్‍గా ఉంటుంది. చికెన్ దాదాపు 70–80 శాతం ఉడికిన తర్వాత కాజూ పేస్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి మరోసారి బాగా కలపాలి.

మంటను తగ్గించి పాన్‌పై మూత పెట్టి 8–10 నిమిషాలు ఉడికించాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. చికెన్ పూర్తిగా ఉడికి, మసాలా చిక్కగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి.

55
రెస్టారెంట్ స్టైల్ రుచి రావాలంటే..
Image Credit : Vismai Food/youtube

రెస్టారెంట్ స్టైల్ రుచి రావాలంటే..

ఆఫ్గానీ చికెన్‌కు ఎక్కువ కారం వేయడం కంటే మిరియాల ఘాటు, కాజూ క్రీమీనెస్, పెరుగు పులుపు బ్యాలెన్స్‌గా ఉండేలా చూసుకోవాలి. చికెన్‌ను ఎక్కువ మంటపై ఉడికిస్తే క్రీమ్ విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చికెన్ దించేసుకునే టైంలో వేసి స్టవ్ ఆపేయాలి. ఎప్పుడూ తక్కువ మంటపైనే ఉడికించాలి. వేడి వేడి నాన్, రోటీ, బటర్ నాన్ లేదా జీరా రైస్‌తో ఆఫ్గానీ చికెన్‌ను సర్వ్ చేస్తే అదిరిపోద్ది. ఒక్కసారి ఇంట్లో ఇలా ఆఫ్గానీ చికెన్ చేసి చూడండి.. రెస్టారెంట్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే క్రీమీ, రిచ్ టేస్ట్‌ను ఎంజాయ్ చేయోచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Related Stories
Recommended image1
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Recommended image2
Fish Pulusu: చిక్కటి గ్రేవీతో స్పైసీ చేపల పులుసు..ఇలా చేశారంటే మూడ్రోజులైనా సరే లాగించేస్తారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved