Kitchen tips: 15 నిమిషాల్లో రెడీ అయ్యే టేస్టీ, హెల్తీ ఫుడ్
ఎండాకాలంలో ఎక్కువ సేపు వంటింట్లో ఉండాలని అనిపించదు. కాబట్టి కేవలం 15 నుండి 20 నిమిషాల్లో తయారయ్యే కొన్ని రుచికరమైన వంటకాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

ఉప్మా
ఉప్మా అనేది చాలా మంది ఇష్టపడే బ్రేక్ ఫాస్ట్. రవ్వతో తయారు చేసే ఉప్మా ఆరోగ్యకరమైనది. రవ్వలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది త్వరగా జీర్ణం అవుతుంది కూడా. పిల్లలు, పెద్దలు అందరూ ఉప్మాను ఇష్టపడతారు. తేలికైన, ఆరోగ్యకరమైన వంటకం కావాలంటే ఉప్మా బెస్ట్.
సేమియా ఉప్మా
రుచికరమైన సేమియా ఉప్మా ఒకటి. ఇది తయారు చేయడం చాలా సులభం. ముందుగానే సేమియా వేయించి నిల్వ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు త్వరగా వండుకోవచ్చు. పిల్లలకు కూడా ఇది చాలా ఇష్టం.
ఆమ్లెట్
ఆమ్లెట్ చాలా రుచికరమైన, త్వరగా తయారు చేయగలిగే అల్పాహారం. ఇది కేవలం 10 నిమిషాల్లోనే తయారవుతుంది. బ్రెడ్ తో కలిపి తింటే చాలా బాగుంటుంది.
దోశ
శనగపిండి, రవ్వ దోశలు మంచి ఆప్షన్. ఇవి కూడా కేవలం 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే ఇష్టమైన కూరగాయలు కలిపి దోశలు వేసుకోవచ్చు.
వెజ్ శాండ్విచ్
వెజ్ శాండ్విచ్‌ను కూడా 15 నిమిషాల్లో తయారు చేయవచ్చు. ముందుగా బ్రెడ్ ముక్కలపై వెన్న లేదా మయోనైస్ వేసి, ఆపై మనకు నచ్చిన కూరగాయలను వేసుకోవాలి. చివరగా మరొక బ్రెడ్ ముక్కతో మూసి, టోస్టర్ లేదా పాన్లో వేడి చేయాలి. మీరు ఇష్టమైతే.. చీజ్, సాస్ కూడా వేసుకోవచ్చు