Kitchen tips: ఈ 5 కూరగాయలను తొక్కతో సహా తినడం చాలా మంచిది!
కూరగాయలు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. ప్రతి కూరగాయను వండుకొని తినే విధానం వేర్వేరుగా ఉంటుంది. కానీ వండుకుని తినడానికి సరైన విధానం తెలుసుకోవడం చాలా ముఖ్యం. కూరగాయల ద్వారా రెట్టింపు ప్రయోజనాలు పొందాలంటే.. ఈ కూరగాయలను తొక్కతో సహా తినడం చాలా మంచిది. అవెంటో ఇక్కడ చూద్దాం.

మనం కొన్నిసార్లు తెలిసో... తెలియకో కొన్ని కూరగాయలను సరైన పద్ధతిలో వండుకొని తినం. దీనివల్ల వాటిద్వారా పూర్తి ప్రయోజనాలు పొందలేము. కొన్ని కూరగాయలను తొక్కతో సహా వండుకుని తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఏ కూరగాయలను తొక్కతో సహా వండుకొని తినాలో ఇక్కడ చూద్దాం.
బంగాళదుంప:
బంగాళదుంపను వండేటప్పుడు దాని తొక్క తీసి వండుకుని తింటున్నారంటే.. ఆ అలవాటును మానుకోవడం మంచిది. బంగాళదుంప తొక్కలో అనేక విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉన్నాయి. దాని తొక్కలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి బంగాళదుంపను తినేటప్పుడు వాటి తొక్కను తీయకుండా బాగా కడిగి వండుకుని తినడం మంచిది.
దోసకాయ:
నీటి శాతం ఎక్కువగా ఉండే దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా దోసకాయను చాలా మంది సలాడ్‌గా తీసుకుంటారు. దోసకాయలో ఉండే పూర్తి పోషకాలు మీకు లభించాలంటే, దాన్ని తొక్కతో సహా తినాలి. దోసకాయ తొక్కలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి.
క్యారెట్:
క్యారెట్‌ను ఎప్పుడూ తొక్క తీసి తినకూడదు. దాని తొక్కలో అనేక యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి3 వంటివి ఉంటాయి. క్యారెట్‌ను ఎలా తిన్నా దాని తొక్కను తీయకూడదని గుర్తుంచుకోండి.
చిలగడదుంప:
చిలగడదుంప తొక్కలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, బీటా కెరోటిన్, ఫోలేట్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
గుమ్మడికాయ:
గుమ్మడికాయ తొక్కలో ఐరన్, విటమిన్ ఎ, పొటాషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. అవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. గుమ్మడికాయ తొక్క కాస్త మందంగా ఉండటం వల్ల వండడానికి ఎక్కువ సమయం పడుతుందని చాలా మంది దీన్ని తినడం తగ్గిస్తారు. కానీ గుమ్మడికాయను మరిగించి ఉపయోగిస్తే దాని తొక్క మెత్తబడుతుంది.