MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Summer Health Tips: ఎండాకాలంలో కచ్చితంగా తీసుకోవాల్సిన 5 రకాల ఫుడ్స్ ఇవే!

Summer Health Tips: ఎండాకాలంలో కచ్చితంగా తీసుకోవాల్సిన 5 రకాల ఫుడ్స్ ఇవే!

ఎండలు రోజుకు రోజుకు మండిపోతున్నాయి. బయట అడుగుపెడితే చాలు ఎక్కడ లేని హెల్త్ సమస్యలు వస్తుంటాయి. నిజానికి ఈ కాలంలో మనం తీసుకునే ఫుడ్ ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతుంది. మరి ఎండాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాల గురించి తెలుసుకుందామా.. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 09 2026, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎండాకాలంలో కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు
Image Credit : ai

ఎండాకాలంలో కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

ఎండాకాలం వచ్చిందంటే మన శరీరం ఎక్కువగా నీరసం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలను ఎదుర్కొంటుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కలగడం సాధారణమే. అందుకే వేసవికాలంలో తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. సరైన ఆహారం తీసుకుంటే శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. మరి ఎండాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐదు రకాల ఆహారాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు
Image Credit : our own

నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు

పుచ్చకాయ, ఖర్బూజ, మామిడి, ద్రాక్ష వంటి పండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా, నీటి లోపాన్ని భర్తీ చేస్తాయి. ముఖ్యంగా పుచ్చకాయలో 90 శాతం పైగా నీరు ఉండటంతో ఇది డీహైడ్రేషన్‌ను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ పండ్లు శరీరాన్ని చల్లబరుస్తూ, జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం చాలా మంచిది.

Related Articles

Related image1
Water Plants: వాటర్ ప్లాంట్స్ ని ఇలా పెడితే మీ ఇంటి అందం రెట్టింపు కావడం పక్కా!
Related image2
Camphor Plant: ఈ సింపుల్ చిట్కాలతో కర్పూరం మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!
36
పాల ఉత్పత్తులు
Image Credit : Pinterest

పాల ఉత్పత్తులు

ఎండాకాలంలో పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. మధ్యాహ్న భోజనంతో పాటు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవడం వల్ల వేడి ప్రభావం తగ్గుతుంది.

46
కొబ్బరి నీళ్లు
Image Credit : Getty

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లు సహజమైన ఎనర్జీ డ్రింక్‌. కొబ్బరి నీటిలో పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు ఒకసారి కొబ్బరి నీరు తాగడం వల్ల అలసట తగ్గి, శరీరం తాజాగా ఉంటుంది.

56
కీరదోస, ఆకుకూరలు
Image Credit : Gemini AI

కీరదోస, ఆకుకూరలు

కీరదోసలో నీటిశాతం ఎక్కువగా ఉండటంతో పాటు, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడుతుంది. ఆకుకూరలు కూడా విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని సలాడ్ రూపంలో తీసుకోవడం ఉత్తమం. ఇవి తేలికగా జీర్ణమవుతూ, పోషకాలను అందిస్తుంది.

66
నిమ్మరసం
Image Credit : Asianet News

నిమ్మరసం

ఎండాకాలంలో నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరానికి చల్లదనం కలుగుతుంది. నిమ్మరసంలో విటమిన్ C సమృద్ధిగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మరసం, చిటికెడు ఉప్పు, చక్కెర కలిపి తాగితే ఇది ఉత్తమ సహజ ఎలక్ట్రోలైట్ డ్రింక్‌గా పనిచేస్తుంది. డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dosa: దోశకు పప్పు, బియ్యం ఇలా రుబ్బుతున్నారా? మీరు చేసే అతి పెద్ద తప్పు ఇదే
Recommended image2
Kiwi Fruit: కివీ పండు తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Recommended image3
Kitchen Hack: బెండకాయ కట్ చేసినా చేతులకు జిగురు అంటకూడదా? ఈ టిప్ మీకే
Related Stories
Recommended image1
Water Plants: వాటర్ ప్లాంట్స్ ని ఇలా పెడితే మీ ఇంటి అందం రెట్టింపు కావడం పక్కా!
Recommended image2
Camphor Plant: ఈ సింపుల్ చిట్కాలతో కర్పూరం మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved