MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Gardening
  • Camphor Plant: ఈ సింపుల్ చిట్కాలతో కర్పూరం మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!

Camphor Plant: ఈ సింపుల్ చిట్కాలతో కర్పూరం మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!

పూజలు, వ్రతాల సమయంలో మనం కర్పూరాన్ని వెలిగిస్తుంటాం. ఇది ఇంట్లో సువాసనతో పాటు పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని చాలామంది నమ్ముతారు. మరి అలాంటి కర్పూరం మొక్కను ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 08 2026, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Camphor Plant Step by Step Guide
Image Credit : ChatGPT

Camphor Plant Step by Step Guide

హిందూ సంస్కృతిలో కర్పూరానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పూజలు, వ్రతాలు, ఇతర శుభకార్యాల్లో కర్పూరాన్ని వినియోగిస్తుంటారు. కర్పూరం వెలిగిస్తే ఇంట్లో మంచి వాసనే కాదు.. నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. అయితే కర్పూరాన్ని ప్రతీసారి బయట కొనుగోలు చేయడంకంటే ఇంట్లోనే పెంచుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. సరిగ్గా అలాంటివారికోసమే ఈ టిప్స్. వీటితో ఈజీగా కర్పూరం మొక్కను కుండీలో పెంచుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మొక్క ఎంపిక ముఖ్యం
Image Credit : Google

మొక్క ఎంపిక ముఖ్యం

కర్పూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కర్పూరం మొక్కను పెంచుకోవాలి అనుకునేవారు ముందుగా మొక్కను ఎంచుకోవడం చాలా ముఖ్యం. వేర్లతో ఉన్న చిన్న మొక్క లేదా కర్పూరం గింజలు ఎంచుకోవాలి. ఈ మొక్క కుండీలో ఈజీగా పెరుగుతుంది. అయితే నీరు నిలిచే కుండీ తీసుకోవద్దు. దానివల్ల మొక్క వేర్లు చెడిపోయే అవకాశం ఉంటుంది.

Related Articles

Related image1
Curry Leaves: ఈ ట్రిక్స్ తో కరివేపాకు మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!
Related image2
Coriander Leaves: ఈ ట్రిక్స్ తో కొత్తిమీరను కుండీలో ఈజీగా పెంచవచ్చు!
36
ఎలా నాటాలంటే?
Image Credit : Google

ఎలా నాటాలంటే?

కర్పూరం మొక్కను నాటే మట్టిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మొదట మట్టిలో కొంత కంపోస్ట్ ఎరువు కలిపి మొక్కలను నాటాలి. ఇది వేర్లను బలంగా ఉండేలా చేస్తుంది. కర్పూరం మొక్కను కుండీలో నింపిన మట్టిలో సరిగ్గా నాటడం కూడా ముఖ్యమే. మట్టిలో 10 సెంటీ మీటర్ల లోతులో మొక్కలు లేదా విత్తనాలను నాటాలి. 

46
తేమ అవసరం
Image Credit : our own

తేమ అవసరం

మొక్కకు నీరు పోసే విధానం కూడా ముఖ్యమే. కర్పూరం మొక్కకు తేమ అవసరం. కానీ మట్టిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రతి రోజు మట్టి పైభాగాన్నిచెక్ చేసుకోవాలి. మట్టి పొడిగా మారితే నీళ్లు పోయాలి. మొక్క నాటిన ప్రారంభంలో ప్రతి రోజు నీటిని స్ప్రే చేసి తేమగా ఉండేలా చూసుకోవాలి. 

56
సూర్యరశ్మి అవసరం
Image Credit : our own

సూర్యరశ్మి అవసరం

కర్పూరం మొక్కకు సూర్యరశ్మి అవసరం. కానీ మొక్కను పెట్టిన తర్వాత మొదటి రెండు వారాలు నేరుగా సూర్యరశ్మి తాకకుండా చూసుకోవాలి. దానివల్ల మొక్క త్వరగా పెరుగుతుంది. ఆ తర్వాత దీనికి 15 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. ఉష్ణోగ్రత ఎక్కువైనా, తక్కువైనా మొక్క వేర్లు దెబ్బతింటాయి.

66
మానసిక శాంతి
Image Credit : our own

మానసిక శాంతి

ఈ సింపుల్ చిట్కాలతో కర్పూరం మొక్కను ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. ఈ మొక్క ఇంట్లో సువాసన, సానుకూల శక్తిని పెంచుతుంది. మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, మానసిక శాంతికి తోడ్పడుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
తోటపని
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే
Recommended image2
Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్క ఉంటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Recommended image3
Terrace Gardening: ఇలా చేస్తే ఎన్ని మొక్కలు వేసినా డాబాకు పగుళ్లే రావు
Related Stories
Recommended image1
Curry Leaves: ఈ ట్రిక్స్ తో కరివేపాకు మొక్కను కుండీలో ఈజీగా పెంచవచ్చు!
Recommended image2
Coriander Leaves: ఈ ట్రిక్స్ తో కొత్తిమీరను కుండీలో ఈజీగా పెంచవచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved