Food
పచ్చి మామిడికాయలు- 2, ఆవ నూనె- 3 చెంచాలు, ఆవాలు- 1 చెంచా, జిలకర్ర- 1 చెంచా, మెంతులు-1 చెంచా, పసుపు- 1 చెంచా, కారం- 1 చెంచా, ఉప్పు, ఇంగువ- చిటికెడు
ముందుగా పచ్చి మామిడికాయలను కడిగి, తుడిచి, చిన్న ముక్కలుగా కోసి పిక్క తీసేయండి.
ఒక పాన్‌లో 3 చెంచాల ఆవ నూనె వేసి, పొగ వచ్చేవరకు వేడి చేసి, స్టవ్ ఆఫ్ చేసి, నూనె చల్లారనివ్వండి.
చల్లారిన నూనెలో ఇంగువ, ఆవాలు, జిలకర్ర, మెంతులు వేసి, 20-30 సెకన్లు వేయించండి.
తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపండి.
ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి, మసాలాలో బాగా కలపండి. 1-2 నిమిషాలు అలాగే కలపండి.
పచ్చడి చల్లారిన తర్వాత గాజుసీసా లేదా గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి. 2 గంటల తర్వాత తింటే రుచిగా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెడితే వారం రోజులు నిల్వ ఉంటుంది.