MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Food
  • Garlic Chicken: మీకిష్టమైన వాళ్లకి ఈ చికెన్ రెసిపీ చేసి పెట్టండి..తిన్న వెంటనే ఫిదా అయిపోతారు

Garlic Chicken: మీకిష్టమైన వాళ్లకి ఈ చికెన్ రెసిపీ చేసి పెట్టండి..తిన్న వెంటనే ఫిదా అయిపోతారు

Garlic Chicken: ఎప్పుడూ అదే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఏం తింటారు. బ్యాచ్‍లర్స్ అయినా, ఎవరైనా సరే..ఈజీగా చేసుకునే ఈ గార్లిక్ చికెన్ ట్రై చేయండి. మూడంటే మూడే పదార్థాలతో దీన్ని తయారు చేసేయొచ్చు. మీకిష్టమైన వాళ్లకి చేసి పెట్టండి ఫిదా అయిపోతారు. 

1 Min read
Author : Nandini Arava
Published : May 24 2026, 08:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తిన్న వెంటనే ఫిదా అయిపోతారు పక్కా..
Image Credit : AI Meta

తిన్న వెంటనే ఫిదా అయిపోతారు పక్కా..

నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. బ్యాచ్‍లర్స్ అని, వంటరాదని కంగారు పడకండి. ఎవరైనా సరే సింపుల్‍గా చేసుకోవచ్చు. అలా అని మార్కెట్లో దొరికే అన్ని మసాలాలు వాడక్కర్లేదు. జస్ట్ మూడు పదార్థాలు మీ వంటింట్లో ఉంటే చాలు..అదిరిపోయే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ చికెన్ రెడీ. 10 నిమిషాల్లో చేసేయొచ్చు. మీకిష్టమైన వాళ్లకి ఇది చేసి పెట్టండి. తిన్న వెంటనే ఫిదా అయిపోతారు. ప్లేట్ ఖాళీ చేసేయడం పక్కా. మళ్లీ మళ్లీ కావాలంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గార్లిక్ చికెన్‍కు కావాల్సిన పదార్థాలు
Image Credit : AI Meta

గార్లిక్ చికెన్‍కు కావాల్సిన పదార్థాలు

చికెన్: 200 గ్రాములు, వెల్లుల్లి: 100 గ్రాములు, కారం: 2 టీస్పూన్లు, వంట నూనె: 1 టీస్పూన్, ఉప్పు: రుచికి సరిపడా.

Related Articles

Related image1
Broiler Chicken: బ్రాయిలర్ కోళ్లు అంత ఫాస్ట్ గా ఎలా పెరుగుతాయి?
Related image2
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
36
వెల్లుల్లి చికెన్ చేసే విధానం
Image Credit : AI Meta

వెల్లుల్లి చికెన్ చేసే విధానం

ముందుగా చికెన్‌ను గోరువెచ్చని నీటిలో కడిగి, చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి.

46
వెల్లుల్లి
Image Credit : AI Meta

వెల్లుల్లి

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టాలి. ఒక టీస్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కగానే, దంచి పెట్టుకున్న వెల్లుల్లిలో సగం వేయాలి. ఆ తర్వాత, చికెన్ ముక్కలు వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు వేయించుకోవాలి.
56
రుచికి సరిపడా ఉప్పు
Image Credit : AI Meta

రుచికి సరిపడా ఉప్పు

ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం పొడి వేసి బాగా కలపాలి. మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. ఈ సమయంలో అస్సలు నీళ్లు పోయకూడదు. అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మూత తీసి, మిగిలిన వెల్లుల్లి వేసి ఐదు నిమిషాలు వేయిస్తే చాలు.
66
సాయంత్రం స్నాక్స్ కి మంచి ప్రోటీన్
Image Credit : Amma Chethi Vanta/Youtube

సాయంత్రం స్నాక్స్ కి మంచి ప్రోటీన్

చివర్లో వేసిన వెల్లుల్లి మంచి రుచిని ఇస్తుంది. దించే ముందు కావాలంటే కొంచెం నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి సర్వ్ చేయండి. సాయంత్రం స్నాక్స్‌గా తింటే మంచి ప్రోటీన్ కూడా అందుతుంది. మీకు నచ్చితే చికెన్ మసాలా, పసుపు కూడా వేసుకోవచ్చు. అది పూర్తిగా మీ ఇష్టం. రెసిపీ చెప్తుంటేనే నోరూరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసేయండి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Recommended image2
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Recommended image3
Moringa Leaf Powder: మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం
Related Stories
Recommended image1
Broiler Chicken: బ్రాయిలర్ కోళ్లు అంత ఫాస్ట్ గా ఎలా పెరుగుతాయి?
Recommended image2
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved