MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Curd Vada: ఈ గారెలంటే సమంతకి చాలా ఇష్టమట..మరి ఎలా చేయాలో రెసిపీ చూసేయండి

Curd Vada: ఈ గారెలంటే సమంతకి చాలా ఇష్టమట..మరి ఎలా చేయాలో రెసిపీ చూసేయండి

Curd Vada: నటి సమంతకు ఎంతో ఇష్టమైన పెరుగు గారెలను (పెరుగు వడ) హోటల్ రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మెత్తటి మినప గారెలు, కమ్మటి పెరుగు, కమ్మని తాలింపుతో అదిరిపోయే పెరుగు గారెల్ని ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ చూసేద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 23 2026, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సమంతకు ఇష్టమైన హోటల్ పెరుగు గారెలు
Image Credit : Gemini Ai + @SonyLIVTamil youtube

సమంతకు ఇష్టమైన హోటల్ పెరుగు గారెలు

స్కూల్ రోజుల్లో తిన్న ఫుడ్ ఎప్పటికీ గుర్తిండిపోతుంది కదా. నటి సమంతకు కూడా పెరుగు గారెలతో అలాంటి తీపి గుర్తే ఉంది. రీసెంట్‌గా ఆమె ఓ కుకింగ్ షోలో పాల్గొన్నారు. దాంట్లో తాను తిన్న పెరుగు గారెలను గుర్తుచేసుకుని ఆమె ఎమోషనల్ అయ్యారు.

మెత్తటి మినప గారెలు, అందులో నానిన కమ్మటి పెరుగు, పైన చల్లిన కారం, కమ్మని తాలింపు చూస్తేనే నోరూరిపోతుంది. హోటల్ రుచితో ఇంట్లోనే దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • పొట్టులేని మినప్పప్పు - 1 కప్పు
  • ఉప్పు - తగినంత
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
  • గట్టి పెరుగు (పుల్లగా ఉండకూడదు) - 2 కప్పులు

తాలింపు కోసం:

  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • ఆవాలు - 1/2 టీస్పూన్
  • మినప్పప్పు - 1/2 టీస్పూన్
  • కరివేపాకు - ఒక రెమ్మ
  • ఇంగువ - చిటికెడు
  • జీడిపప్పు - 5 నుంచి 6 (ఇష్టమైతే)
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మినప్పప్పు నానబెట్టుకోవాలి
Image Credit : Gemini Ai

మినప్పప్పు నానబెట్టుకోవాలి

ముందుగా మినప్పప్పును శుభ్రంగా కడిగి, 4 నుంచి 5 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లన్నీ వంపేసి, మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మరీ పల్చగా ఉండకూడదు. గట్టిగా, ప్లఫ్ఫీగా ఉంటేనే గారెలు మెత్తగా వస్తాయి. రుబ్బుకున్న పిండిలో తగినంత ఉప్పు కలపాలి.

37
గారెలు వేయించుకోవాలి
Image Credit : Gemini Ai

గారెలు వేయించుకోవాలి

కడాయిలో నూనె పోసి మీడియం మంట మీద వేడి చేయాలి. చేతిని కొద్దిగా నీళ్లతో తడుపుకుని, పిండిని తీసుకుని మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేయాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం మంట మీదే వేయించాలి. మంట పెంచితే పైన రంగు మారుతుంది కానీ లోపల ఉడకదు.

47
గారెలను మెత్తగా మార్చాలి
Image Credit : Gemini Ai

గారెలను మెత్తగా మార్చాలి

పెరుగు గారెలు పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇదే అసలైన సీక్రెట్. ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు తీసుకుని, నీళ్లు కలిపి మజ్జిగలా చేసుకోవాలి. వేయించిన గారెలను అందులో సుమారు 2 నిమిషాలు నానబెట్టాలి.

ఆ తర్వాత ఒక్కో గారెను విరిగిపోకుండా నెమ్మదిగా నొక్కి, అదనపు నీటిని తీసేయాలి. ఇలా చేయడం వల్ల గారెలు మెత్తబడి, పెరుగును బాగా పీల్చుకుంటాయి.

ఇష్టమైతే కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్రను కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బి మజ్జిగలో కలుపుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్.

57
కమ్మటి పెరుగు ఉండాల్సిందే
Image Credit : Gemini Ai

కమ్మటి పెరుగు ఉండాల్సిందే

మరొక గిన్నెలో గట్టి పెరుగును తీసుకుని ఉండలు లేకుండా బాగా చిలకాలి. అందులో తగినంత ఉప్పు కలపాలి. బాగా పులిసిన పెరుగును అస్సలు వాడొద్దు. అలా వాడితే పెరుగు గారెల రుచి పూర్తిగా మారిపోతుంది.

67
తాలింపు ఎలా వేయాలి?
Image Credit : Gemini Ai

తాలింపు ఎలా వేయాలి?

చిన్న కడాయిలో నూనె వేడి చేయాలి. ముందుగా ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఇష్టమైతే జీడిపప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. చివరగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ తాలింపును పెరుగు మిశ్రమంలో వేసి కలపాలి. ఆవాలు, కరివేపాకు సువాసన పెరుగు గారెలకు అదనపు రుచిని ఇస్తుంది.

77
పెరుగు గారెలు సర్వింగ్
Image Credit : Gemini Ai

పెరుగు గారెలు సర్వింగ్

క వెడల్పాటి గిన్నెలో నానబెట్టిన గారెలను పేర్చాలి. వాటి మీద పెరుగు మిశ్రమాన్ని నిండుగా పోయాలి. గారెలు పెరుగులో పూర్తిగా మునిగేలా చూసుకోవాలి. సర్వ్ చేసే ముందు తురిమిన క్యారెట్, కొత్తిమీర, కారాబూందీ చల్లితే రుచితో పాటు చూడటానికి కూడా భలేగా ఉంటాయి.

సమంతకు పాత జ్ఞాపకాలను గుర్తుచేసిన ఈ పెరుగు గారెలను, మీరు కూడా ఇంట్లో చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఇది సాయంత్రం పూట స్నాక్‌గానే కాకుండా, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చేసి పెట్టడానికి కూడా బెస్ట్ ఆప్షన్.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
వినోదం
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Cucumber Benefits: దోసకాయ తొక్క తీసి తింటున్నారా? అసలు ఏ టైంలో తినాలి?
Recommended image2
Butterfly Chicken: పండగ విందులో అదిరిపోయే చికెన్ స్టార్టర్..రెసిపీ చాలా సింపుల్
Recommended image3
Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..
Related Stories
Recommended image1
Seafood Capital: మనదేశంలో సీ ఫుడ్ అంటే గుర్తొచ్చే సిటీ ఏదో తెలుసా? ఇక్కడి వంటలకు ప్రపంచమే దాసోహం
Recommended image2
Smart Toothbrush: వామ్మో బ్రష్ ధర రూ.47 వేలా? నోట్లో ఏం జరుగుతుందో లైవ్‌గా చూడొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved