MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Broiler Chicken: బ్రాయిలర్ కోళ్లు అంత ఫాస్ట్ గా ఎలా పెరుగుతాయి?

Broiler Chicken: బ్రాయిలర్ కోళ్లు అంత ఫాస్ట్ గా ఎలా పెరుగుతాయి?

 Broiler Chicken: బ్రాయిలర్ కోళ్లు చాలా వేగంగా పెరుగుతాయి. దీంతో.. వీటిని గ్రోత్ హార్మోన్లు ఇస్తారని.. వీటిని తింటే.. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలా మంది భయపడుతుంటారు. వీటిలో నిజమెంత? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 20 2026, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Broiler Chicken
Image Credit : our own

Broiler Chicken

మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతిరోజూ ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి ప్రోటీన్ చికెన్ లో మనకు చాలా పుష్కలంగా లభిస్తుంది. అయితే.. ప్రోటీన్ కోసం బ్రాయిలర్ చికెన్ మాత్రం తినకూడదని, కేవలం నాటు కోళ్లు మాత్రమే తినాలని ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ బ్రాయిలర్ కోళ్లు తొందరగా పెరగాలని వాటికి గ్రోత్ హార్మోన్లు ఇస్తారని.. ఇలాంటి చికెన్ తినడం వల్ల మధ్య కాలంలో ఆడ పిల్లలు 8 ఏళ్లకే యుక్త వయసుకు వచ్చేస్తున్నారని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు.. ఈ చికెన్ తినడం వల్ల పిల్లల శరీరంలో తొందరగా మార్పులు రావడం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని భావిస్తున్నారు. దీనిలో నిజమెంత? నిజంగానే కోళ్లకు గ్రోత్ హార్మోన్లు ఇస్తున్నారా? అసలు ఈ బ్రాయిలర్ కోళ్లు అంత తొందరగా ఎలా పెరుగుతున్నాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కోళ్లకు నిజంగా హార్మోనల్ ఇంజక్షన్లు ఇస్తారా?
Image Credit : our own

కోళ్లకు నిజంగా హార్మోనల్ ఇంజక్షన్లు ఇస్తారా?

బ్రాయిలర్ కోళ్లు వేగంగా పెరగడానికి వాటికి గ్రోత్ హార్మోన్లు ఇస్తారు అనే దాంట్లో ఎలాంటి నిజం లేదని.. అది అపోహ మాత్రమే అని హ్యూమన్ లీగ్ నివేదిక చెబుతోంది. అసలు.. లక్షలాది కోళ్లకు హార్మోన్లు ఎక్కించడం అనేది జరిగే విషయమే కాదు. ఇది అసాధ్యం కూడా.

‘ బ్రాయిలర్ కోళ్ల గురించి ప్రజల్లో ఉన్నది పూర్తిగా భయం మాత్రమే. భయట మార్కెట్లో అమ్మే కోళ్లు వేగంగా పెరగడానికి ఎలాంటి కృత్రిమ హార్మోన్లు ఉపయోగించరు. కోళ్ల ఫారాలలో ప్రతి కోడికీ ప్రతిరోజూ ఇంజెక్షన్ ఇవ్వడం సాధ్యం కాదు. ఒకవేళ హార్మోన్లు ఫుడ్ ద్వారా అందిస్తే.. కోళ్ల జీర్ణ వ్యవస్థ వాటిని సాధారణ ప్రోటీన్ లాగే జీర్ణం చేసుకుంటుంది. వాటివల్ల కూడా ఎటువంటి ప్రభావం ఉండదు’ అని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

Related Articles

Related image1
Chicken Recipe: చికెన్ కర్రీ, చట్నీ కాదు.. టేస్టీగా చికెన్ కారం పొడి చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
Related image2
Chicken Parts: చికెన్ తింటున్నారా? చికెన్ లో ఈ పార్ట్ తింటే ఆరోగ్యానికే ప్రమాదం...!
33
మరి అంత వేగంగా ఎలా పెరుగుతాయి?
Image Credit : Getty

మరి అంత వేగంగా ఎలా పెరుగుతాయి?

మరి, ఇంజెక్షన్లు ఏమీ లేకుండా బ్రాయిలర్ కోళ్లు అంత వేగంగా ఎలా పెరుగుతున్నాయి అనే అనుమానం మీకు రావచ్చు. ఆర్గానిక్ ఫీడ్స్ ప్రకారం, బ్రాయిలర్ కోళ్లు సాధారణ నాటు కోళ్లకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ జాతి కోళ్లు వేగంగా పెరిగి, సుమారు 45 రోజుల్లోనే పెరిగిపోతాయి.

అంతేకాకుండా, బ్రాయిలర్ కోళ్లు వేగంగా పెరగడానికి ప్రత్యేక పోషణ అందిస్తారు. గత కొన్ని దశాబ్దాలుగా.. పౌల్ట్రీ నిపుణులు ఆరోగ్యంగా ఉండే, వేగంగా పెరిగే కోళ్లను మాత్రమే పెంచుతున్నారు. దీనికి తోడు, పౌల్ట్రీ ఫారాలలో వాటి ఆహారంపై అధిక శ్రద్ధ పెడతారు. వాటికి ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారాన్ని అందిస్తారు. అందుకే, అవి త్వరగా బరువు పెరుగుతాయి.

అయితే.. కొన్ని కోళ్ల ఫారాల్లో కోళ్లకు రోగాలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్స్ ఇస్తారు. అవి కూడా ప్రమాదమే.. అవి ఇవ్వకుండా పెరిగిన బ్రాయిలర్ కోళ్లను అయితే.. మనం హ్యాపీగా తినొచ్చు. యాంటీ బయోటిక్స్ ఇచ్చినా కూడా.. మార్కెట్లో అమ్మకానికి పంపడానికి కొద్ది రోజుల ముందే.. వాటిని ఇవ్వడం ఆపేయాలి.  అలాంటివి అయితే.. మనం తిన్నా కూడా ఎలాంటి సమస్యలు రావు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Coconut Water: కొబ్బరి నీళ్లు రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Watch: అంబానీ కోడలు రాధిక మర్చంట్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? ఒక్క వాచ్ ఖరీదుతో లైఫ్ సెటిల్..!
Related Stories
Recommended image1
Chicken Recipe: చికెన్ కర్రీ, చట్నీ కాదు.. టేస్టీగా చికెన్ కారం పొడి చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
Recommended image2
Chicken Parts: చికెన్ తింటున్నారా? చికెన్ లో ఈ పార్ట్ తింటే ఆరోగ్యానికే ప్రమాదం...!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved