MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Food
  • Curd Recipe: ఇంట్లో కూరగాయలు ఏమీ లేకున్నా, పెరుగుతో చేసే టేస్టీ కర్రీ..!

Curd Recipe: ఇంట్లో కూరగాయలు ఏమీ లేకున్నా, పెరుగుతో చేసే టేస్టీ కర్రీ..!

 Curd Recipe: ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా.. కేవలం పది నిమిషాల్లో రుచి కరమైన గ్రేవీ కర్రీ చేయచ్చు. రుచికి రుచితో పాటు.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఆ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 20 2026, 01:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Curd Gravy
Image Credit : our own

Curd Gravy

బయట ఆల్రెడీ ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండాకాలంలో శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. అయితే.. ఈ వేడి తట్టుకొని కిచెన్ లో ఎక్కువ సేపు నిలబడి వంట చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా కేవలం పది నిమిషాల్లో వంట రెడీ అయితే ఎంత బాగుటుంది. అది కూడా ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకపోయినా.. రుచికరమైన వంట తయారు చేయచ్చు. ఇది తయారు చేయడానికి మనకు ఇంట్లో పెరుగు ఉంటే చాలు. మరి.. ఈ పెరుగు గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పెరుగు కర్రీ ఎలా తయారు చేయాలంటే..
Image Credit : our own

పెరుగు కర్రీ ఎలా తయారు చేయాలంటే..

కావాల్సిన పదార్థాలు..

పెరుగు 1కప్పు, నీళ్లు 1 కప్పు, ఎండు మిరపకాయలు 2, ఆవాలు, కరివేపాకు, ఉప్పు సరిపడినంత, కొబ్బరి తురుము రెండు స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, పచ్చి మిరపకాయలు 2

మీ దగ్గర కూరగాయలు లేకపోయినా పర్వాలేదు. ఉంటే కనుక బెండకాయ, వంకాయ లాంటి వాటిని కలిపితే రుచి అద్భుతంగా ఉంటుంది.

పెరుగు గ్రేవీ కర్రీ తయారు చేసే విధానం..

ముందుగా మీ దగ్గర కూరగాయలు ఉంటే... వంకాయ, బెండకాయ ఏదైనా పర్వాలేదు.. చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత.. కొబ్బరి తురుము, జీలకర్ర, పచ్చి మిరపకాయలను బ్లెండర్ లో వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. మరోవైపు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని బాగా కలపాలి. అందులోనే నీళ్లు కూడా పోసి.. బాగా కలపాలి. పెరుగు పుల్లగా ఉంటే.. పచ్చిమిరపకాయలు మరో రెండు ఎక్కువ వేసుకోవచ్చు. పులుపు తగ్గుతుంది.

ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి పోపు వేయాలి. పోసు వేగిన తర్వాత.. ముక్కలు కోసుకున్న కూరగాయల ముక్కలు వేసుకోవాలి. రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ( మీ దగ్గర కూరగాయలు లేకపోతే.. ఈ స్టైప్ స్కిప్ చేయండి). తర్వాత.. ముందుగా రుబ్బి ఉంచుకున్న పచ్చి మిరపకాయ, కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేయాలి. దీనిని కూడా కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు.. అందులో పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. మీడియం మంట మీద ఉంచి.. సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు ఉడకనిచ్చి.. స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చివరగా సన్నగా తురిమిన కొత్తమీర చల్లితే సరిపోతుంది. అంతే.. రుచి కరమైన పెరుగు కర్రీ తయారైనట్లే.

33
ఈ పెరుగు కర్రీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
Image Credit : our own

ఈ పెరుగు కర్రీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఇది ఎండాకాలంలో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కేలరీలు కూడా తక్కువ. బరువు పెరుగుతాం అనే భయం ఉండదు. పోపు వేయడానికి కూడా ఒక స్పూన్ నూనె మాత్రమే వాడతాం. అంతేకాదు... ఇది చేయడం చాలా సులభం. ఎక్కువ గ్యాస్ పట్టదు.అంతేకాదు.. వేడి వేడి అన్నంలో..అప్పడంతో కలిపి దీనిని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Thummi Kura: ఏడాదిలో ఒక్క‌సారే తినే వంట‌కం.. తుమ్మి కూర ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా.?
Recommended image2
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image3
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Related Stories
Recommended image1
Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Recommended image2
Dosa Prasadam: ఈ గుడిలో ప్రసాదంగా దోశలు పెడతారు.. ఆ దోశ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved