చిలగడ దుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇవి… మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తాయి.
చిలగడదుంపలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణమై, రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా చూస్తుంది.
ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. దీంతో గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
ఇందులో ఉండే కరిగే, కరగని ఫైబర్ పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండటంతో, కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇది బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
చిలగడదుంప కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని ఫైబర్.. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుంది.
Walnuts: రోజూ నానపెట్టిన వాల్ నట్స్ తింటే ఏమౌతుందో తెలుసా?
Idli: రోజూ ఇడ్లీలు తింటే ఏమౌతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?
Chicken:కేజీ చికెన్ కూరలో ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి?
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు