MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • IRCTC Jyotirlinga Yatra: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఒకే ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం

IRCTC Jyotirlinga Yatra: ఐఆర్‌సీటీసీ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఒకే ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం

IRCTC Sapta Jyotirlinga Darshan Yatra: ఐఆర్‌సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా 7 జ్యోతిర్లింగాల దర్శన యాత్రను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఆ వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 18 2026, 06:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగాల యాత్ర
Image Credit : Chatgpt తో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగాల యాత్ర

భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రయాణికుల కోసం మరో ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. నవరత్న హోదా కలిగిన ఈ ప్రభుత్వ సంస్థ, భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్రను నిర్వహిస్తోంది. ఈ ప్యాకేజీ ద్వారా ప్రయాణికులు దేశంలోని ఏడు ముఖ్యమైన జ్యోతిర్లింగాలను దర్శించుకునే అద్భుతమైన అవకాశం లభిస్తుంది.

ఈ యాత్ర మొత్తం 10 రాత్రులు, 11 రోజులు సాగుతుంది. డిసెంబర్ 17 నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ రైలులో మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్‌లో 237, తర్డ్ ఏసీ క్లాస్‌లో 416, సెకండ్ ఏసీ క్లాస్‌లో 52 సీట్లు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎక్కడెక్కడ బోర్డింగ్ సౌకర్యం ఉంది?
Image Credit : Asianet News

ఎక్కడెక్కడ బోర్డింగ్ సౌకర్యం ఉంది?

ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రయాణం సికింద్రాబాద్‌లో ప్రారంభమవుతుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం పలు స్టేషన్లలో బోర్డింగ్, డీ-బోర్డింగ్ సౌకర్యం కల్పించారు. సికింద్రాబాద్‌తో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, ధర్మాబాద్, ముద్ఖేడ్ జంక్షన్, నాందేడ్, పూర్ణ జంక్షన్ స్టేషన్లలో ప్రయాణికులు ఈ రైలు ఎక్కవచ్చు. రైలు ప్రయాణంతో పాటు రాత్రి బస, వాష్ అండ్ ఛేంజ్, రవాణా సౌకర్యం వంటి సేవలు ప్యాకేజీ కేటగిరీని బట్టి అందిస్తారు.

ఎకానమీ (స్లీపర్) ప్యాకేజీకి నాన్-ఏసీ వసతి, స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీలకు ఏసీ వసతి కల్పిస్తారు. యాత్రలో భాగంగా ప్రయాణికులకు శాఖాహార భోజనం (ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్) ప్రీ-సెట్ మెనూ ప్రకారం అందిస్తారు.

35
ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగాల యాత్ర టికెట్ ధరలు, కేటగిరీలు
Image Credit : Instagram

ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగాల యాత్ర టికెట్ ధరలు, కేటగిరీలు

ప్రయాణికుల ఆర్థిక స్థోమతను బట్టి మూడు రకాల కేటగిరీలను ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసింది. ఎకానమీ (స్లీపర్) కేటగిరీలో ఒక్కరికి రూ. 18,000, ఐదు నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ. 16,700 గా ధర నిర్ణయించారు. స్టాండర్డ్ (3AC) కేటగిరీలో పెద్దలకు రూ. 27,400 కాగా, పిల్లలకు రూ. 25,900 చెల్లించాలి. ఇక కంఫర్ట్ (2AC) కేటగిరీలో పెద్దలకు రూ. 35,500, పిల్లలకు రూ. 33,600 ధర ఉంది.

ఈ ధరలన్నీ జీఎస్టీతో కలిపి వర్తిస్తాయి. భారతీయ రైల్వేలు రైలు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారత్ గౌరవ్ రైలు పథకం కింద దాదాపు 33 శాతం రాయితీని అందిస్తున్నాయి. ఈ ధరలన్నీ ఆ రాయితీని మినహాయించిన తర్వాతే వర్తిస్తాయని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది.

45
ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగాల యాత్ర: ఏయే ప్రసిద్ధ క్షేత్రాలు కవర్ అవుతాయి?
Image Credit : our own

ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగాల యాత్ర: ఏయే ప్రసిద్ధ క్షేత్రాలు కవర్ అవుతాయి?

ఈ పర్యటనలో భాగంగా ఉజ్జైనిలోని మహాకాలేశ్వర్, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలు దర్శించుకోవచ్చు. అలాగే ద్వారకలో నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ద్వారకాధీశ్ మందిర్, బేట్ ద్వారక సందర్శన ఉంటుంది. సోమనాథ్‌లో ప్రసిద్ధ సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం లభిస్తుంది.

పూణె సమీపంలో భీమశంకర్ జ్యోతిర్లింగం, నాసిక్‌లో త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, ఛత్రపతి శంభాజీనగర్ లో గ్రిషణేశ్వర్ జ్యోతిర్లింగాలను ఈ యాత్రలో సందర్శించవచ్చు. ప్రయాణికులు భద్రత నిమిత్తం టూర్‌కు వెళ్లేటప్పుడు ఓటరు ఐడీ లేదా ఆధార్ కార్డు వంటి ఫోటో గుర్తింపు కార్డులను విధిగా వెంట ఉంచుకోవాలని సూచించారు.

55
ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగాల యాత్ర షెడ్యూల్, ముఖ్యమైన సూచనలు
Image Credit : our own

ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగాల యాత్ర షెడ్యూల్, ముఖ్యమైన సూచనలు

డిసెంబర్ 17న సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర డిసెంబర్ 27న తిరిగి సికింద్రాబాద్ చేరుకోవడంతో ముగుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం రైలులో ప్రత్యేక భద్రతా సిబ్బంది ఉంటారు. అలాగే ప్రతి టూర్ వివరాలను పర్యవేక్షించడానికి ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్లు ప్రయాణం అంతటా అందుబాటులో ఉంటారు.

ప్రయాణం చేసేటప్పుడు పర్యాటకులు అందరూ నిబంధనలు పాటించాలని, టూర్ మేనేజర్ సూచనలను తూచా తప్పకుండా పాటించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎల్‌టీసీ సౌకర్యాన్ని కూడా నిబంధనల ప్రకారం పొందవచ్చని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
325
SLSL
(22.0 ov) 98 & 74/3
Day 2
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Tsunami: బంగాళాఖాతంలో సునామీ వస్తే ఏ నగరానికి ఎక్కువ ప్రమాదమో తెలుసా.. మన విశాఖ సేఫేనా ?
Recommended image2
భారతదేశంలోని ఈ నదుల్లో బంగారం దొరుకుతుంది.. ఇసుక నుంచి బంగారాన్ని ఎలా తీస్తారంటే?
Recommended image3
వరుస టెక్ ఔటేజ్ లు, ఆర్థిక అలజడులు... ఏదో తేడా కొడుతోందే..!
Related Stories
Recommended image1
Gold: మనం నగలు కోసం.. మరి బ్యాంకులు బంగారం ఎందుకు కొంటాయో తెలుసా?
Recommended image2
Laknavaram Lake: తెలంగాణ మాల్దీవులు.. కోనసీమను తలపించే ప్రకృతి అందాలు.. ఒక్కసారైనా చూడాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved