- Home
- Feature
- సరిగ్గా వందేళ్ల సీన్ రిపీట్... 1926 పరిస్థితులే 2026 లో కూడా.. ఇక అమెరికా పరిస్థితి అంతేనా..?
సరిగ్గా వందేళ్ల సీన్ రిపీట్... 1926 పరిస్థితులే 2026 లో కూడా.. ఇక అమెరికా పరిస్థితి అంతేనా..?
ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే అమెరికా పరిస్థితి ప్రస్తుతం ఏం బాగాలేదు. ట్రంప్ పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశాన్ని రిస్క్ లో పడేస్తున్నాయా..? 1926 ఇంగ్లాండ్ పరిస్థితే 2026 లో అమెరికాకు వస్తుందా..?

అమెరికా దాదాగిరి..
1. అప్పుల ఊబిలో అమెరికా ! కొత్త డాలర్ నోట్లు ముద్రిస్తూ నెట్టుకొని వస్తోంది. తన ఆర్థిక శక్తికి మించి ఒక దేశం నోట్లు ముద్రిస్తే.. అది ఒక విధంగా దొంగనోట్లు అవుతాయి . కానీ ప్రపంచంపై తనకున్న మిలిటరీ ఆధిపత్యాన్ని చూపించి దాదాగిరితో నెట్టుకొని వస్తోంది అమెరికా. పెట్రో ఉత్పత్తుల అమ్మకం కొనుగోలు డాలర్ ద్వారా మాత్రమే జరగాలి అని శాసిస్తోంది. డాలర్ కు ప్రత్యామ్నాయ మారకపు విధానం ఎవరు తీసుకొని రావాలని ప్రయత్నిస్తే వారిపై విరుచుకొని పడుతోంది.
చైనా ఇప్పుడు సూపర్ పవర్. దాన్ని ఏమీ చేయలేదు. ఇండియాను బెదిరిస్తోంది. వెనెజువెలా అధ్యక్షుడి బందీ చేసి తీసుకొని వెళ్ళింది. ట్రంప్ కు అంతర్గతంగా అనేక సమస్యలు. 2025 సంవత్సరంలో 11 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కృతిమ మేథను ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇప్పటికీ ఈ రంగంలో చైనాది పైచేయి. నిరుద్యోగిత పెరిగిపోతుంది. అందుకే విదేశీయులను వెళ్లగొడుతోంది. ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రదర్సనలు. ముదురోను బంధించి 3400 కిలోమిటర్లు తీసుకొని వెళ్లి జైల్లో బంధించడం .. తన ఇమేజ్ పెంచుకోవడానికి. "మేము ఏమైనా చేయగలం. అమెరికా ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలి. కాదంటే మీ పని చెబుతాను" అని దీని ద్వారా ట్రంప్ ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాడు .
పతనం దిశగా రష్యా
2 . రష్యా లో పరిస్థితి ఏమీ బాగాలేదు. విపరీతమయిన ద్రవ్యోల్భణం. ఉఫ్ అని ఉదేయొచ్చు అని భావించిన యుక్రెయిన్ ఎదురు నిలుస్తోంది.. యుద్ధం ఆగడం లేదు. పుతిన్ ఇంటిపై యుక్రెయిన్ డ్రోన్ దాడి అనే వార్తలను అమెరికా, యుక్రెయిన్ కొట్టి పడేస్తున్నాయి.
ఇరాన్, వెనుజువెలా పరిస్థితి అంతే..
3. ఇరాన్ లో పరిస్థి దారుణం గా ఉంది . బియ్యం ఒక కిలో దాదాపు లక్ష రియాల్స్. కోడి గుడ్లు డజను నలభై వేల రియాల్స్. ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు.
4 . వెనుజువెలా 1998 దాక నందనవనం లాంటి దేశం. చావెజ్ దేశాన్ని ముంచేశాడు. పెట్టుబడిదారులు పారిపోయారు. ప్రజలను ఉచితాలకు బానిస చేసాడు. ధరలు దారుణంగా పెరిగిపోయాయి. దేశం దొంగల పాలయ్యింది. మాధకద్రవ్యాలు, తుపాకులు, కిడ్నాపులు ఇది అక్కడ స్థితి. డెబ్భై లక్షల మంది వెనుజువెలా ప్రజలు దేశాన్ని వదిలి పారిపోయారు. ఇప్పుడు అమెరికా చేతిలో వెనుజువెలా. దాన్ని పీల్చి పిప్పి చేసేదాకా అమెరికా వదలదు.
అమెరికా పని అయిపోయినట్లేనా..?
ఒక్క మాటలో చెప్పాలి అంటే 1925 నాడు అంటే వందేళ్ల క్రితం ప్రపంచం ఎలా ఉందో సరిగ్గా ఇప్పుడు అదే విధంగా .
అప్పటికి ఇంగ్లాండ్ సూపర్ పవర్ .
తాము సూపర్ పవర్ కావాలని ఒక పక్క ఫ్రాన్స్ .. అంతకు మించి జర్మనీ ఇటలీ.
మరో పక్క అమెరికా, సోవియెట్ రష్యా.
1929 లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది.
ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతా.
చివరకు 1939 కు ప్రపంచ యుద్ధం .
అది ముగిసే నాటికి 1945 .
1950 కి కానీ ప్రపంచం కుదుటపడలేదు .
యుద్ధం ముగిసే నాటికి ఇగ్లాండ్ తుస్సు .
జర్మనీ ఇటలీ చితికి పోయాయి .
అప్పటి దాక వరల్డ్ నెంబర్ 2 గా ఉన్న ఫ్రాన్స్ కూడా తుస్.
ఇప్పుడు అమెరికా తన గూండాయిజం తో ఎన్నాళ్ళు నెట్టుకొని వస్తుందో చూడాలి.
ఒకటి నిజం. ఎక్కువ కాలం నిలవదు .
కొత్త ప్రపంచం ఆవిర్భవించబోతోంది .
అందుకే భూగోళం ఇప్పుడు పురిటి నొప్పుల్లో...

