TRUMP WARNING: భారత్ పై ట్రంప్ పగ చల్లారలేదా? మళ్లీ బాంబ్..
TRUMP WARNING: ట్రంప్ కు భారత్ పై పగ చల్లారలేదనుకుంటా. ప్రేమ ఒలకబోస్తూనే..అక్కసు వెళ్లగక్కుతున్నారు. రష్యా పేరు చెప్పి సుంకాల మోత మోగిస్తున్నారు. తాజాగా ట్రంప్.. మోదీను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

భారత్ పై ట్రంప్ మరో బాంబ్
భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం వాణిజ్య సంబంధాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు.. మరోసారి భారత్ పై టారిఫ్ లు పెంచే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఓ వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. వెనుజువెలాపై అగ్రరాజ్యం దాడుల వేళ అధ్యక్షుడు ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు.
నా గురించి మోదీకి తెలుసు
తెనేపూసిన మాటలతో ట్రంప్ మళ్లీ డ్రామా మొదలుపెట్టారు. తాను చెప్పాల్సిన విషయానికి ముందుగానే..ప్రధాని మోదీ మంచి వ్యక్తి అని ప్రశంసల వర్షం కురిపిస్తూనే తన కడుపు మంటను బయటపెట్టారు. తాను సంతోంగా లేనని, ఈ విషయం మోదీకి తెలుసన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనను తృప్తి పరచడం ఆయనకు చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రష్యాతో చమురు డీలింగ్స్ నిలిపివేయకపోతే..సుంకాలు పెంచడం తప్పదన్నారు. తమకు టారిఫ్ లు పెంచడం చాలా సులువైన అంశమని, రష్యా విషయంలో భారత్ అమెరికాకు సహకరించకపోతే సుంకాలు మళ్లీ పెంచి తీరుతామని ట్రంప్ స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ హామీ నిజమేనా?
అయితే గతంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని మోదీ మాట ఇచ్చినట్లు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. కానీ ట్రంప్ కామెంట్స్ ను భారత్ ఖండించింది. అలాంటి హామీ ఏమీ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది.
2025లోనూ రష్యా పేరు చెప్పే భారత్ పై టారిఫ్ లు విధించారు. ఇక ఆ తర్వాత నుంచి..అమెరికాకు, భారత్ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మరోసారి ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం..వాణిజ్య సంబంధాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

