MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Trump Next Target: వెనెజులా ఫినిష్.. ట్రంప్ తరువాతి టార్గెట్ ఈ అందమైన దేశమే

Trump Next Target: వెనెజులా ఫినిష్.. ట్రంప్ తరువాతి టార్గెట్ ఈ అందమైన దేశమే

Trump Next Target: వెనిజులా దేశాన్ని అమెరికా ఆక్రమించేసింది. ట్రంప్ ఇప్పుడు మరిన్ని దేశాలను ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వెనెజులా తరువాత మరికొన్ని దేశాలపై ఆయన విరుచుకు పడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ దేశాలు ఏవో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jan 05 2026, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వెనెజులా ఇక అమెరికాదే
Image Credit : Google

వెనెజులా ఇక అమెరికాదే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏనాడో వెనెజులా అధ్యక్షుడిపై యుద్ధం ప్రకటించాడు. అతడిని పట్టిస్తే లక్షల డాలర్లు ఇస్తానని ప్రకటించాడు. చివరికి ఆయన దొరక్కపోవడంతో ఏకంగా వెనెజులాపై సైనిక చర్యకు దిగాడు. బాంబుల వర్షం కురిపించాడు. అర్థరాత్రి వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో బెడ్ రూమ్లోకి వెళ్లి మరీ సైనికులు అతడిని లాక్కోచ్చారు. అక్కడించి అతడిని న్యూయార్క్ కు తరలించారు. 

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై చర్యల తర్వాత, అమెరికాపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. కానీ కొన్ని దేశాలు మాత్రం తెగ భయపడుతున్నాయి. ట్రంప్ మరిన్ని దేశాలపైకి సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయం ట్రంప్ బయటికే చెబుతున్నాడు.  వెనిజులా తర్వాత ఇరాన్, మెక్సికో, గ్రీన్‌లాండ్, క్యూబా, కొలంబియాలపై అమెరికా ఎప్పుడైనా తమ కమాండోలను, యుద్ధ విమానాలను పంపే అవకాశం ఉందని సమాచారం.

24
తరువాత గ్రీన్‌లాండ్‌?
Image Credit : Getty

తరువాత గ్రీన్‌లాండ్‌?

ట్రంప్ వెనెజులా తరువాత గ్రీన్‌లాండ్ దేశాన్నే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ట్రంప్ ఈ విషయాన్ని చెప్పాడు.  గ్రీన్ లాండ్ పై అమెరికాకు ఆసక్తి ఉందని అన్నాడు. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌కు జనవరి 20వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు గ్రీన్‌లాండ్‌ మా సొంతం కావాలి అని ట్రంప్ పట్టుదల మీద ఉన్నాడు. దీంతో గ్రీన్ లాండ్ ప్రజలు, ప్రభుత్వ వర్గాల్లో చాలా భయం పెరిగింది. గ్రీన్ ల్యాండ్ చాలా ప్రశాంతమైన దేశం. బలమైన సైనిక వ్యవస్థ కూడ లేదు. చాలా సులువుగానే అమెరికా దీన్ని ఆక్రమించే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Simple Business: ఇంటి దగ్గరే నెలకు రూ.50,000 సంపాదించే బిజినెస్, నష్టం వచ్చే ఛాన్సే లేదు
Related image2
Gold Wholesale Market: బంగారాన్ని తక్కువ ధరకు కొనాలా? మన దేశంలో ఉన్న హోల్‌సేల్ మార్కెట్‌ కు వెళ్ళండి
34
ఇరాన్
Image Credit : Reuters

ఇరాన్

అమెరికా ఇరాన్‌పై  కూడా ఒత్తిడిని పెంచుతోంది. గత ఏడాది జూన్ 2025లో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పనిచేసింది. ఆ సమయంలో ఇజ్రాయెల్ కు సపోర్టు చేస్తూ ఇరాన్‌పై దాడి కూడా చేసింది. ఆ సమయంలో ట్రంప్ చాలా కఠినంగా ఇరాన్ ను హెచ్చరించింది. ఏదైనా సమస్య వస్తే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మాస్కో పారిపోయే అవకాశం ఉందని విదేశీ మీడియాలో వార్తలు వచ్చాయి.  ఇతనితో ట్రంప్ కు మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో  దీంతో ఇరాన్ తన భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసుకుంటోంది.

44
క్యూబాకు బెదిరింపు
Image Credit : Reuters

క్యూబాకు బెదిరింపు

అమెరికా అధ్యక్షులు ట్రంప్ క్యూబాను కూడా బహిరంగంగానే బెదిరించారు. క్యూబా సైనికులు వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను రక్షించేందుకు ప్రయత్నించారని కానీ విఫలమయ్యారని ఆ దేశం తెలిపింది. ఆ ప్రయత్నంలో 32 మంది క్యూబా సైనికులు కూడా మరణించారని క్యూబా ప్రభుత్వం తెలిపింది. అమెరికాకు చిరకాల శత్రువు  క్యూబా. చివరికి అమెరికాలో తీసే సినిమాల్లో కూడా క్యూబా దేశాన్నివిలన్ గానే చూపిస్తారు. క్యూబాలో ప్రస్తుతం మిగెల్ డియాజ్కా నెల్ ప్రభుత్వం అధికారంలో ఉంది. క్యూబాపై కూడా అమెరికా దాడులు చేసే అవకాశం కనిపిస్తోంది. జనవరి 2026లో అమెరికా ఏ దేశంలపై విరుచుకుపడుతుందోనని చాలా దేశాలు భయపడుతున్నాయి.

అయితే వెనిజులాలో ఇంకా పూర్తిగా అమెరికా పని పూర్తిచేయలేదని అధికారులు చెబుతున్నారు.  రెండో దశ చర్యలకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. వెనిజులా ప్రభుత్వం సహకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. మదురో అరెస్ట్ తర్వాత వెనెజులాలో ఏ ప్రభుత్వం ఏర్పడినా తాము చెప్పినట్టు వినాలని ట్రంప్ ఇప్పటికే చెప్పాడు. ఒకవేళ ఆ  కొత్త ప్రభుత్వం మాట వినకపోతే మళ్లీ సైనిక చర్యకు దిగుతామని ట్రంప్ బెదరించాడు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
డొనాల్డ్ ట్రంప్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Artificial Intelligence : చాట్ జిపిటి, జెమినిని అస్సలు అడగకూడని విషయాలివే... అడిగారో అంతే సంగతి..!
Recommended image2
Asianet Exclusive : సరిహద్దులో కొత్త ఎత్తుగడలు.. చైనాకు చెక్ పెట్టేలా భారత్ ప్రోయాక్టివ్ ప్లాన్
Recommended image3
Top 10 Least Corrupt Country : ప్రపంచంలోనే అత్యంత అవినీతి రహిత దేశం ఇదే.. ఇండియా ర్యాంక్ ఎంతంటే?
Related Stories
Recommended image1
Simple Business: ఇంటి దగ్గరే నెలకు రూ.50,000 సంపాదించే బిజినెస్, నష్టం వచ్చే ఛాన్సే లేదు
Recommended image2
Gold Wholesale Market: బంగారాన్ని తక్కువ ధరకు కొనాలా? మన దేశంలో ఉన్న హోల్‌సేల్ మార్కెట్‌ కు వెళ్ళండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved