MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • మీరు కూడా స‌మ‌స్యను చూసి పారిపోతున్నారా.? ఈ క‌థ చ‌దివితే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం.

మీరు కూడా స‌మ‌స్యను చూసి పారిపోతున్నారా.? ఈ క‌థ చ‌దివితే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం.

Motivational story: మ‌న‌లో చాలా మంది స‌మ‌స్య అన‌గానే పారిపోతుంటారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం కంటే దానిని ప‌ట్టించుకోవ‌ద్ద‌నే ఆలోచ‌న‌తో ఉంటారు. అయితే ఓ క‌థ చ‌దివితే మాత్రం మీ ఆలోచ‌న మార‌డం ఖాయం. ఇంత‌కీ ఆ క‌థ ఏంటంటే.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 21 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజు చేసిన ఆలోచన
Image Credit : Gemini AI

రాజు చేసిన ఆలోచన

కాసులాబాద్ అనే గ్రామంలో ఓ రాజు ఉండేవాడు. అతను ధనవంతుడు. కానీ అత‌నికి ప్రజల మనస్తత్వం తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. త‌న గ్రామంలో ప్ర‌జ‌ల‌కు ఎంత వ‌ర‌కు బాధ్య‌త ఉందో తెలుసుకోవాల‌ని అనుకున్నాడు. ప్రజల్లో ఎవరు సమస్యను చూసి పారిపోతారు? ఎవరు ముందుకు వచ్చి పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు? అన్నది తెలుసుకోవాలని నిర్ణయించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రహదారి మధ్యలో పెద్ద బండరాయి
Image Credit : Gemini AI

రహదారి మధ్యలో పెద్ద బండరాయి

ఇందులో భాగంగానే ఒక రోజు రాజు ఒక పెద్ద బండరాయిని రహదారి మధ్యలో పెట్టించాడు. తర్వాత దగ్గర్లో దాక్కొని ఎవరు ఏమి చేస్తారో గమనించసాగాడు. కొంతసేపటికి ధనిక వ్యాపారులు, రాజదర్బారు అధికారులు ఆ దారిలో వెళ్లారు. వాళ్లు బండరాయి చూసి తొలగించడానికి ప్రయత్నించలేదు. కొంతమంది “రాజు రోడ్లు సరిగ్గా చూసుకోవడం లేదు” అని విమర్శించారు. ఇంకొంతమంది రాయి ప‌క్క నుంచి వెళ్లిపోయారు. కానీ సమస్యను తొలగించాలనే ఆలోచన మాత్రం ఎవరికీ రాలేదు.

35
రైతు చేసిన చిన్న ప్రయత్నం
Image Credit : Gemini AI

రైతు చేసిన చిన్న ప్రయత్నం

కొంతసేపటికి ఒక రైతు కూరగాయల బరువుతో అక్కడికి చేరుకున్నాడు. బండరాయి చూసి ఆగిపోయాడు. “ఇది ఇక్కడ ఉంటే ఎంతో మంది ఇబ్బంది పడతారు” అని అనుకున్నాడు. తన బరువును కింద పెట్టి, బండరాయిని తోసేందుకు ప్రయత్నించాడు. మొదట కదల్లేదు, చెమటలు పట్టాయి, శక్తి తగ్గింది. కానీ కానీ అతను ఆపలేదు. చివరకు తీవ్రంగా శ్రమించి బండరాయిని పక్కకు జరిపాడు.

45
ఆశ్చర్యపరిచిన బహుమతి
Image Credit : Gemini AI

ఆశ్చర్యపరిచిన బహుమతి

బండ‌రాయి జ‌ర‌ప‌గ్గానే అక్క‌డ ఒక సంచి కనిపించింది. ఆ సంచిలో బంగారు నాణేలు ఉన్నాయి. అందులో ఒక చిట్టీ కూడా ఉంది. ఆ చిట్టీలో “ఈ బండరాయిని తొలగించిన వ్యక్తికి ఇది బహుమతి.” అని రాసి ఉంది. దీంతో రైతు కళ్లలో ఆనందం మెరిసింది. అతను సమస్యను తప్పించుకోలేదు. దాన్ని అవకాశంగా మార్చుకున్నాడు.

55
గొప్ప సందేశం
Image Credit : Gemini AI

గొప్ప సందేశం

మన జీవితంలో సమస్యలు తప్పవు. చాలామంది వాటిని చూసి పారిపోతారు. కొంతమంది విమర్శిస్తారు. కానీ కొద్దిమంది మాత్రమే ముందుకు వచ్చి పరిష్కారం కోసం కృషి చేస్తారు. ప్రతి అడ్డంకి వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది. మనం ప‌డే క‌ష్టం, ధైర్యం ఆ అవకాశాన్ని బయటకు తీస్తాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి బండరాయిని తోసేయండి. అందులో మీ భవిష్యత్తు దాగి ఉండవచ్చనే గొప్ప సందేశాన్ని ఈ క‌థ అందిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
ఫీల్ గుడ్ న్యూస్
నీతి కథలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : బాత్రూమ్, టాయిలెట్లలోకి పాములు ఎందుకు వస్తాయి? రాకుండా ఎలా ఆపాలి?
Recommended image2
Birds Facts : పక్షులు చెట్టు చిటారుకొమ్మలపై నిద్రించినా ఎందుకు కిందపడిపోవు? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Recommended image3
River : నదులే ఈ రాష్ట్రానికి పేరు పెట్టాయా..! ఇంతకీ ఈ రాష్ట్రమేది, ఆ నదులేవి?
Related Stories
Recommended image1
Vastu: ఇంటి ప్ర‌ధాన ద్వారంలో ఇదొక్క‌టి పెట్టి చూడండి.. మీ జీవితం మార‌డం ఖాయం
Recommended image2
ఒక‌ప్పుడు తెలుగు వారిని గుక్క‌పెట్టి ఏడిపించిన ఈ హీరోయిన్‌ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved