MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Facts : రైల్లో 72వ సీటు బాత్రూమ్ పక్కనే ఎందుకు వస్తుంది?

Facts : రైల్లో 72వ సీటు బాత్రూమ్ పక్కనే ఎందుకు వస్తుంది?

రైలు ప్రయాణంలో మీకు తరచుగా బాత్రూమ్ పక్కన ఉండే సీటు వస్తుందా? అసలు అలా ఎందుకు జరుగుతుంది? దీనివల్ల ఎదురయ్యే ఇబ్బందులేంటి? కోచ్ మధ్యలో బెర్త్ కావాలంటే ఏం చేయాలి?

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 25 2026, 08:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రైల్లో ఎప్పుడూ బాత్రూమ్ పక్కన 72వ సీటే వస్తోందా?
Image Credit : Gemini AI

రైల్లో ఎప్పుడూ బాత్రూమ్ పక్కన 72వ సీటే వస్తోందా?

భారతదేశంలో రోజూ కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు… దీంతో కొన్ని ట్రైన్స్ లో టికెట్లు దొరకడమే గగనమైపోయింది. ఒకవేళ టికెట్ దొరికినా మనకు నచ్చని చోట సీటు వస్తే ఆ ప్రయాణం నరకంగా మారుతుంది. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే వారికి బాత్రూమ్ పక్కన ఉండే 72వ సైడ్ అప్పర్ బెర్త్‌నే IRCTC సాఫ్ట్‌వేర్ కేటాయిస్తోందని ఓ సాధారణ ఫిర్యాదు ఉంది. దీంతో బాత్రూంలో లైట్ వెలుగుతూ ఉండటం, దుర్వాసన రావడం వంటివి నిద్రకు భంగం కలిగిస్తాయి.

ఓ స్లీపర్ క్లాస్ కోచ్ లో మొత్తం 72 సీట్లుంటే ఒంటరిగా ప్రయాణించేవారికి ఎందుకు ఎప్పుడూ చివరి సీటే వస్తుంది? దీని వెనుక ఉన్న IRCTC సాఫ్ట్‌వేర్ రహస్యం ఏంటి? ఈ సమస్య నుంచి బయటపడి మంచి సీటు ఎలా పొందాలో వివరంగా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రైలు ప్రమాదాలు జరక్కుండా సీట్ల రిజర్వేషన్..
Image Credit : Gemini

రైలు ప్రమాదాలు జరక్కుండా సీట్ల రిజర్వేషన్..

IRCTC సీట్ల కేటాయింపు సాఫ్ట్‌వేర్ మనుషుల్లా ఆలోచించి సీట్లను కేటాయించదు. ఇది రైలు భద్రత కోసం రూపొందించిన 'వెయిట్ బ్యాలెన్సింగ్ రూల్' (బరువు సమతుల్యత నియమం) ప్రకారం పనిచేస్తుంది. దీంతో రైలు ప్రమాదాలను నివారించవచ్చు. 

ఒక రైలు కోచ్ అధిక వేగంతో వెళ్తున్నప్పుడు, మలుపుల్లో తిరుగుతున్నప్పుడు దాని బరువు సమానంగా ఉండాలి. లేదంటే కోచ్ పట్టాలు తప్పే ప్రమాదం ఉంది. ఈ కారణంగా సాఫ్ట్‌వేర్ టికెట్లను బుక్ చేసేటప్పుడు మొదట కోచ్ మధ్యలో ఉన్న సీట్లను (ఉదాహరణకు 30 నుంచి 50 వరకు నంబర్లు) ప్రయాణికులకు కేటాయిస్తుంది. మధ్య భాగం నిండిన తర్వాతే కోచ్‌కు రెండు చివర్లలో ఉన్న సీట్లను నింపడం ప్రారంభిస్తుంది.

Related Articles

Related image1
Free Train Journey : తెలుగు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ లాగే.. వీరికి 100% ఉచిత రైలు ప్రయాణం
Related image2
Train Driver: ట్రైన్ డ్రైవర్ నెల జీతం ఎంతో తెలుసా? రోజుకు ఎంతసేపు పని చేస్తారు?
34
72వ సీటు ఎందుకు వస్తుంది?
Image Credit : Getty

72వ సీటు ఎందుకు వస్తుంది?

సాధారణంగా చాలామంది ప్రయాణానికి కొద్ది రోజుల ముందు టికెట్లు బుక్ చేస్తారు. అయితే అప్పటికే సాఫ్ట్‌వేర్ మధ్యలో ఉన్న సీట్లను ఇతరులకు కేటాయించేసి ఉంటుంది. చివరి నిమిషంలో లేదా వెయిటింగ్ లిస్ట్ క్లియర్ అయ్యాక టికెట్ పొందినప్పుడు కోచ్‌కు రెండు చివర్లలో ఉన్న సీట్లు మాత్రమే మిగిలి ఉంటాయి. ముఖ్యంగా 'అప్పర్ బెర్త్' ఆప్షన్‌ను ఎంచుకున్నప్పుడు చివరగా నిండే 72వ సీటు (సైడ్ అప్పర్ - డోర్, బాత్రూమ్ పక్కన) మాత్రమే ఖాళీగా ఉంటుంది. అందుకే కంప్యూటర్ ఆటోమేటిక్‌గా ఆ సీటును కేటాయిస్తుంది. దీనివల్ల రాత్రిపూట డోర్ తెరిచే శబ్దం, బాత్రూమ్‌కు వెళ్లేవారి కదలికలు, లైట్ల వెలుగుతో ప్రయాణికులు ఇబ్బంది పడతారు.

44
బాత్రూమ్ పక్కన సీటు రాకుండా 'సూపర్ ట్రిక్'
Image Credit : Gemini

బాత్రూమ్ పక్కన సీటు రాకుండా 'సూపర్ ట్రిక్'

డోర్ పక్కన లేదా 72వ సీటు రాకుండా ఉండాలంటే ప్రయాణికులు ఓ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వొచ్చు. రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు మొదటి చార్ట్ తయారు చేస్తారు… ఆ సమయంలో ఎవరైనా మధ్య భాగంలోని సీటును బుక్ చేసి చివరి నిమిషంలో రద్దు చేసుకుంటే ఆ సీట్లు ఖాళీ అవుతాయి. దీన్ని IRCTC యాప్‌లోని 'Chart Vacancy' విభాగంలో చూడవచ్చు.  

 IRCTC యాప్‌లో బుక్ చేసేటప్పుడు 'Book only if confirm berth are allocated' అనే బాక్స్‌ను క్లిక్ చేయకుండా 'Preferred Coach' అనే చోట నిర్దిష్ట కోచ్ నంబర్ (ఉదాహరణకు S5), బెర్త్ ప్రిఫరెన్స్‌లో 'Upper' అని ఇచ్చి బుక్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఆ నిర్దిష్ట కోచ్ మధ్యలో (ఉదాహరణకు 43వ సీటు) ఏదైనా రద్దయిన సీటు ఉంటే సాఫ్ట్‌వేర్ వెంటనే ఆ మంచి సీటును మీకు కేటాయిస్తుంది. ఇకపై ఈ ట్రిక్ గుర్తుంచుకుంటే, బాత్రూమ్ పక్క సీట్ల నుంచి తప్పించుకుని, ప్రశాంతంగా ప్రయాణించవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Raksha Bandhan: అక్క లేదా చెల్లెలు లేకపోతే రాఖీ ఎవరు కట్టాలి? చరిత్ర చెప్పే నిజాలు ఇవే
Recommended image2
Chanakya Niti : మనిషి దగ్గర ఎంతున్నా.. ఇంకా కావాలనిపించేవి ఏవి?
Recommended image3
Cyber Scam Alert : మీ అకౌంట్లో డబ్బులు పడ్డట్లు మెసేజ్ వచ్చిందో తస్మాత్ జాగ్రత్త... ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Free Train Journey : తెలుగు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ లాగే.. వీరికి 100% ఉచిత రైలు ప్రయాణం
Recommended image2
Train Driver: ట్రైన్ డ్రైవర్ నెల జీతం ఎంతో తెలుసా? రోజుకు ఎంతసేపు పని చేస్తారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved