MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • USA Wedding: అమెరికాలో పెళ్లిళ్లకు ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తారో తెలుసా?

USA Wedding: అమెరికాలో పెళ్లిళ్లకు ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తారో తెలుసా?

USA Wedding: జనరల్ గా ఎవరి పెళ్లికైనా వెళ్లేటప్పుడు ఏ గిఫ్ట్ తీసుకెళ్లాలని తెగ హైరానా పడిపోతాం? అమెరికాలో మాత్రం ఈ టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఏం కొనాలో ఆలోచించే పని లేకుండా..ఒక లిస్ట్ పెడతారంట. ప్రెజెంట్ యూఎస్ లో నడుస్తున్న ఆ ట్రెండ్ ఏంటో చూసేయండి.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 24 2026, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అమెరికాలో పెళ్లిళ్లలో ఏం గిఫ్ట్ ఇస్తారు?
Image Credit : Gemini

అమెరికాలో పెళ్లిళ్లలో ఏం గిఫ్ట్ ఇస్తారు?

మన ఇండియాలో పెళ్లికి వెళ్లేటప్పుడు కొత్త జంటకు ఏ బహుమతి ఇవ్వాలనే విషయంలో చాలామంది తర్జనభర్జన పడుతుంటారు. బట్టలు, ఇంటికి అవసరమైన థింగ్స్, డేకరేషన్ వస్తువులు, డబ్బు.. ఇలా తమకు తోచిన బహుమతిని తీసుకెళ్తారు. అయితే, ఆ బహుమతి వధూవరులకు నిజంగా అవసరమా? ఇప్పటికే అలాంటి వస్తువు వారి దగ్గర ఉందా? అనే విషయాలు చాలాసార్లు ఆలోచించం, పట్టించుకోం కూడా. మనకు నచ్చిందా లేదా, బడ్జెట్ లో వస్తుందా, లేదా అని మాత్రమే చూసుకుంటాం. దీంతో ఉపయోగపడని బహుమతులు పక్కన పడేసే అవకాశం ఉంటుంది. కానీ అమెరికాలో కొన్ని జంటలు ఈ సమస్యకు చెక్ పెడుతున్నారు. తమకు ఏ బహుమతులు కావాలో అతిథులకు ముందే చెప్పేస్తున్నారు. ఇదే వెడ్డింగ్ రిజిస్ట్రీ (Wedding Registry).

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వెడ్డింగ్ రిజిస్ట్రీ అంటే ఏమిటి?
Image Credit : Asianet News

వెడ్డింగ్ రిజిస్ట్రీ అంటే ఏమిటి?

వెడ్డింగ్ రిజిస్ట్రీ అంటే పెళ్లి చేసుకోబోయే జంటకు అవసరమైన వస్తువులతో తయారుచేసే లిస్ట్. ఈ లిస్ట్ ను ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు లేదా ప్రత్యేక వెడ్డింగ్ వెబ్‌సైట్ల ద్వారా క్రియేట్ చేసుకుంటారు. కొత్త ఇంటికి కావాల్సిన వంటగది సామాన్లు, బెడ్‌షీట్లు, గృహోపకరణాలు, డిన్నర్ సెట్లు, ఇతర నిత్యావసర వస్తువులను ఇందులో చేర్చుతారు.

పెళ్లికి వచ్చే అతిథులు ఈ లిస్ట్ చూసి తమ బడ్జెట్‌కు సరిపోయే బహుమతిని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, ఒక జంటకు మిక్సర్ గ్రైండర్, కాఫీ మేకర్, వంట పాత్రలు అవసరమైతే వాటిని తమ రిజిస్ట్రీలో చేర్చవచ్చు. అతిథులు తమకు నచ్చిన వస్తువును ఎంచుకుని బహుమతిగా ఇస్తారు.

దీంతో బహుమతి ఏది ఇవ్వాలనే టెన్షన్ తగ్గుతుంది. కొత్త జంటకు నిజంగా అవసరమైన వస్తువులు అందే అవకాశమూ పెరుగుతుంది.

34
ఒకే గిఫ్ట్ ఇద్దరు కొంటే పరిస్థితి ఏంటి?
Image Credit : PR

ఒకే గిఫ్ట్ ఇద్దరు కొంటే పరిస్థితి ఏంటి?

ఒకే వస్తువును ఇద్దరు అతిథులు కొనుగోలు చేస్తే ఎలా? అనే సందేహం రావచ్చు. చాలా ఆన్‌లైన్ రిజిస్ట్రీల్లో దీనికి పరిష్కారం ఉంటుంది. ఒక వ్యక్తి ఒక వస్తువును కొనుగోలు చేసిన తర్వాత..దాని మీద టిక్ పెడతారు. అలా ఆ వస్తువు అప్‌డేట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇది కొనేశారని మిగతావాళ్లకి అర్థమవుతుంది. దీంతో అదే వస్తువును మరో అతిథి కొనకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే, ఈ సదుపాయం ఉపయోగిస్తున్న వెబ్‌సైట్‌ను బట్టి మారవచ్చు.

ఒకవేళ బహుమతిగా వచ్చిన వస్తువు కొత్త జంటకు అవసరం లేకపోయినా, నచ్చకపోయినా.. దుకాణం రిటర్న్ పాలసీని బట్టి దాన్ని తిరిగి ఇచ్చే లేదా మార్చుకునే అవకాశం ఉండవచ్చు. ఇందుకోసం కొనుగోలు రసీదు లేదా గిఫ్ట్ రసీదు ఉపయోగపడుతుంది.

44
వస్తువులే కాదు.. నగదు కూడా బహుమతిగా!
Image Credit : Asianet News

వస్తువులే కాదు.. నగదు కూడా బహుమతిగా!

వెడ్డింగ్ రిజిస్ట్రీలో వస్తువులే ఉండాలనే నియమం లేదు. కొన్ని జంటలు డబ్బు, హనీమూన్ ఖర్చులు, కొత్త ఇంటి ఏర్పాట్ల కోసం డబ్బు..ఇలా సమకూర్చే అవకాశాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. అతిథులు తమకు అనుకూలమైన మొత్తాన్ని ఎంచుకుని బహుమతిగా ఇవ్వవచ్చు.

అయితే, అమెరికాలో ప్రతి పెళ్లిలోనూ ఇదే విధానం పాటిస్తారని చెప్పలేం. కొందరు జంటలు రిజిస్ట్రీని ఉపయోగిస్తే, మరికొందరు సంప్రదాయ బహుమతులు లేదా నగదును స్వీకరిస్తారు. జంటల అభిరుచులు, కుటుంబ సంప్రదాయాలు, ప్రాంతాలను బట్టి పద్ధతులు మారుతుంటాయి.

బహుమతుల ఎంపికలో టెన్షన్ తగ్గించే విధానం

వెడ్డింగ్ రిజిస్ట్రీ వల్ల బహుమతి కొనేవారికి ఏది ఎంచుకోవాలనే ఆలోచన తగ్గుతుంది. కొత్త జంటకు అవసరమైన వస్తువులు అందే అవకాశం పెరుగుతుంది. అలాగే ఒకే రకమైన బహుమతులు పదేపదే రావడాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు. మనదేశంలోనూ పెళ్లి బహుమతుల విషయంలో ఆచారాలు మారుతున్నాయి. కొందరు జంటలు నగదు లేదా తమకు అవసరమైన వస్తువులనే బహుమతిగా ఇవ్వాలని కోరుతున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ట్యాబ్లెట్‌, క్యాప్సుల్స్ మధ్య తేడా ఏంటి? దేని ఉపయోగం ఏంటో తెలుసా?
Recommended image2
Gold Capital: ఇండియాలోనే అతిపెద్ద బంగారం మార్కెట్ ఎక్కడుందో తెలుసా? పెద్ద గోల్డ్ బ్రాండ్స్ అన్నిఇక్కడివే!
Recommended image3
Weekend : శని, ఆదివారాలు కాదు.. ఈ దేశాల్లో వీకెండ్ సెలవులు ఎప్పుడో తెలుసా?
Related Stories
Recommended image1
Inspiring Story: సరదాగా చేసిన వీడియోలే జీవితాన్ని మార్చేశాయి.. పచ్చళ్లతో మొదలై రూ.కోట్ల బిజినెస్
Recommended image2
Inspiring Story: అమ్మమ్మ జ్ఞాపకాలతో మొదలైన వ్యాపారం..ఇప్పుడు రూ.580 కోట్ల బ్రాండ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved