MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Kainchi Dham: కోహ్లీ, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్ బర్గ్ జీవితాలను మార్చిన ఆలయం.. కైంచీ ధామ్ సీక్రెట్ ఇదే !

Kainchi Dham: కోహ్లీ, స్టీవ్ జాబ్స్, మార్క్ జూకర్ బర్గ్ జీవితాలను మార్చిన ఆలయం.. కైంచీ ధామ్ సీక్రెట్ ఇదే !

Kainchi Dham: ఆపిల్ స్టీవ్ జాబ్స్, ఫేస్‌బుక్ మార్క్ జకర్‌బర్గ్ నుండి విరాట్ కోహ్లీ వరకు ఎందరో ప్రముఖులు నీమ కరోలి బాబా కైంచీ ధామ్ ఆశ్రమాన్ని సందర్శించారు. అసలు అక్కడ ఏముంది? కైంచీ ధామ్ సీక్రెట్ విశేషాలు, అక్కడికి ఎలా వెళ్లాలో పూర్తి వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 15 2026, 08:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యాపిల్, ఫేస్‌బుక్ సక్సెస్ వెనుక ఉన్న ఆ ఇండియన్ బాబా ఎవరు? కోహ్లీ కూడా వెళ్ళింది ఇందుకేనా?
Image Credit : X@RadhaKeliKunj

యాపిల్, ఫేస్‌బుక్ సక్సెస్ వెనుక ఉన్న ఆ ఇండియన్ బాబా ఎవరు? కోహ్లీ కూడా వెళ్ళింది ఇందుకేనా?

లైఫ్‌లో ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు లేదా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు మైండ్ బ్లాక్ అయితే మనం ఏం చేస్తాం? కాస్త ప్రశాంతత కోసం చూస్తాం. ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజాలు, గ్లోబల్ సెలబ్రిటీలు కూడా సరిగ్గా ఇదే చేశారు. ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, మెటా అధినేత మార్క్ జకర్‌బర్గ్, మన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, హాలీవుడ్ స్టార్ జూలియా రాబర్ట్స్... ఇలా వీరందరి లైఫ్ ట్రాక్‌ను మార్చిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం ఇండియాలో ఉంది. అదే ఉత్తరాఖండ్‌లోని 'కైంచీ ధామ్'. హిమాలయాల ఒడిలో ప్రశాంతంగా ఉండే ఈ ఆశ్రమానికి అంతర్జాతీయంగా ఎందుకంత క్రేజ్ వచ్చింది? అసలు ఎవరీ నీమ కరోలి బాబా? ఆయన మహిమలు ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కైంచీ ధామ్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నీమ కరోలి బాబా ఎవరు?
Image Credit : Geemini

కైంచీ ధామ్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? నీమ కరోలి బాబా ఎవరు?

ఈ అద్భుతమైన ఆశ్రమాన్ని 1964లో 'నీమ కరోలి బాబా' స్థాపించారు. ఆయనను లక్షలాది మంది భక్తులు ఒక గొప్ప మహానుభావుడిగా, సాక్షాత్తూ ఆ హనుమంతుని పరమ భక్తుడిగా, ఆయన అవతారంగా కొలుస్తారు. బాబా అసలు పేరు లక్ష్మణ్ నారాయణ్ శర్మ. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా అక్బర్‌పూర్ గ్రామంలో ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో 1900 సంవత్సరంలో ఆయన జన్మించారు.

కేవలం 11 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో, సంసార బంధాలను వదిలేసి సాధువుగా మారి దేశాటన చేశారు. ఆ తర్వాత తండ్రి కోరిక మేరకు మళ్లీ ఇంటికి వచ్చి ఇద్దరు కొడుకులు, ఒక కూతురితో సాధారణ జీవితం గడిపినప్పటికీ, ఆయన మనసంతా ఆధ్యాత్మికత పైనే ఉండేది. చివరికి 1973 సెప్టెంబర్ 11న బృందావనంలోని ఆసుపత్రిలో డయాబెటిక్ కోమాలోకి వెళ్లి ఆయన మహాసమాధి చెందారు.

Related Articles

Related image1
TV Expiry Date: టాబ్లెట్ల లాగే మీ ఇంట్లోని టీవీకి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని తెలుసా? ఎన్ని ఏళ్లకు పాడవుతుంది?
Related image2
Indian Railways : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే సూపర్ ట్రిక్!
35
‘నీమ కరోలి బాబా’ పేరు వెనుక ఉన్న క్రేజీ మిస్టరీ
Image Credit : our own

‘నీమ కరోలి బాబా’ పేరు వెనుక ఉన్న క్రేజీ మిస్టరీ

బాబాకు ఈ పేరు రావడం వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ ఉంది. స్వాతంత్ర్యానికి ముందు ఒకరోజు బాబా లగ్జరీగా ఉండే ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. బ్రిటీష్ టికెట్ కలెక్టర్ అది చూసి, కోపంతో వచ్చే స్టాప్‌లో బాబాను రైలు దింపేశాడు. బాబా ఏమాత్రం కోప్పడకుండా ప్రశాంతంగా నవ్వుతూ కిందకు దిగి, అక్కడ ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నారు.

ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది! బాబా కిందకు దిగాక గార్డ్ ఎంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఇంజన్ డ్రైవర్ ఎంత ట్రై చేసినా రైలు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. మెకానిక్‌లు వచ్చి చెక్ చేసినా అంతా పర్ఫెక్ట్‌గా ఉందని తేలింది కానీ రైలు మాత్రం స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు ఎవరో స్థానికులు బాబా పవర్‌ను గుర్తించి, ఆయనను మళ్లీ రైలు ఎక్కించాలని సలహా ఇచ్చారు. బ్రిటీష్ అధికారులు వెళ్లి బాబాను క్షమాపణలు కోరి గౌరవంగా రైలులోకి ఆహ్వానించారు. అంతే.. బాబా లోపలికి అడుగు పెట్టగానే రైలు ఒక్కసారిగా స్టార్ట్ అయ్యింది. ఆ సంఘటన జరిగిన గ్రామం పేరే 'నీమ కరోలి'. అప్పటి నుండి ఆయనకు 'నీమ కరోలి బాబా' అనే పేరు స్థిరపడిపోయింది.

45
బిగ్ టెక్ సక్సెస్ కనెక్షన్: స్టీవ్ జాబ్స్, జకర్‌బర్గ్ జీవితాలను మార్చిన సలహా
Image Credit : Getty

బిగ్ టెక్ సక్సెస్ కనెక్షన్: స్టీవ్ జాబ్స్, జకర్‌బర్గ్ జీవితాలను మార్చిన సలహా

1974లో ఆపిల్ సంస్థను స్థాపించడానికి ముందు, తన జీవితంలో ఒక క్లారిటీ కోసం స్టీవ్ జాబ్స్ తన ఫ్రెండ్ డాన్ కాట్కేతో కలిసి ఇండియాకు వచ్చారు. ఇక్కడి ఆధ్యాత్మికత, ముఖ్యంగా బాబా గారి ఆలోచనలు ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ తర్వాత కాలంలో స్టీవ్ జాబ్స్ ఆపిల్‌ను ఎంత పెద్ద బ్రాండ్‌గా మార్చారో అందరికీ తెలిసిందే.

కథ ఇక్కడితో అయిపోలేదు.. 2015లో ఫేస్‌బుక్ తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు, కంపెనీని అమ్మేయాలనే ఆలోచనలో మార్క్ జకర్‌బర్గ్ ఉన్నారట. ఆ సమయంలో స్టీవ్ జాబ్స్ ఆయనకు ఒక సూపర్ సలహా ఇచ్చారు. "నువ్వు ఇండియాలోని కైంచీ ధామ్‌కు వెళ్లి కొన్ని రోజులు గడుపు, నీకు రూట్ క్లియర్ అవుతుంది" అని చెప్పారు. జకర్‌బర్గ్ వెంటనే ఉత్తరాఖండ్ వచ్చి ఆశ్రమంలో గడిపారు. ఆ తర్వాత ఫేస్‌బుక్ రేంజ్ ఎలా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ కూడా బాబా ఫోటోను చూసి కనెక్ట్ అయి హిందూ మతం వైపు ఆకర్షితురాలయ్యారు. బాబా భక్తులైన రామ్ దాస్, లారీ బ్రిలియంట్లు అమెరికాలోని కాలిఫోర్నియాలో 'సేవా ఫౌండేషన్' స్థాపించారు, దీనికి స్టీవ్ జాబ్స్ ఫండింగ్ కూడా ఇచ్చారు.

55
సెలబ్రిటీల విజిట్.. రూట్ మ్యాప్: ఆశ్రమానికి ఎలా వెళ్ళాలి?
Image Credit : Getty

సెలబ్రిటీల విజిట్.. రూట్ మ్యాప్: ఆశ్రమానికి ఎలా వెళ్ళాలి?

ఇటీవల ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ తమ కూతురు వామికతో కలిసి బృందావనంలోని నీమ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ బాబా సమాధిని దర్శించుకుని, ఒక కుటీరంలో దాదాపు గంటసేపు ధ్యానం చేశారు. ఈ ఫొటోలు వైరల్ అవ్వడంతో యూత్ అంతా ఈ ప్లేస్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అని గూగుల్‌లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు.

• ఉత్తరాఖండ్ ఆశ్రమం (కైంచీ ధామ్): దీనికోసం మీరు మొదట ట్రైన్ ద్వారా ఉత్తరాఖండ్‌లోని 'కత్‌గోడమ్' రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. అక్కడ నుండి బస్సు లేదా ట్యాక్సీలో రెండు గంటలు ప్రయాణిస్తే కైంచీ ధామ్ ఆశ్రమానికి చేరుకోవచ్చు. బస్ స్టాప్‌కు చాలా దగ్గరలోనే ఈ ఆశ్రమం ఉంటుంది.

• బృందావన్ ఆశ్రమం (మధుర, యూపీ): 1967లో ప్రారంభమైన ఈ ఆశ్రమంలోనే బాబా గారి మహాసమాధి మందిరం ఉంది. ఇది బృందావన్ బస్ స్టాండ్ నుండి కేవలం 1.9 కిలోమీటర్లు, అలాగే బృందావన్ రైల్వే స్టేషన్ నుండి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉంది. లోకల్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా చాలా ఈజీగా ఇక్కడికి వెళ్ళవచ్చు. ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ స్టే చేయాలనుకుంటే ఆన్‌లైన్ ద్వారా ఎన్‌రోల్ చేసుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistani Products in India : ఇండియన్స్ వాడే పాకిస్థానీ వస్తువులివే
Recommended image2
Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్.. కానీ నివసించేది 400 చదరపు అడుగుల ఇంట్లో
Recommended image3
Indian Railways : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే సూపర్ ట్రిక్!
Related Stories
Recommended image1
TV Expiry Date: టాబ్లెట్ల లాగే మీ ఇంట్లోని టీవీకి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని తెలుసా? ఎన్ని ఏళ్లకు పాడవుతుంది?
Recommended image2
Indian Railways : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే సూపర్ ట్రిక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved