MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • ప్రపంచంలోని ఏ దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ? ఇక భారత స్థానం ఎంతంటే..!

ప్రపంచంలోని ఏ దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ? ఇక భారత స్థానం ఎంతంటే..!

ఒక్కో కారణంతో జీవితాన్ని అర్థాంతరంగా ముగించేస్తున్నారు ఎంతో మంది. ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఏ దేశంలో ఆత్మహత్యలు అధికంగా నమోదవుతున్నాయో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇక మన భారతదేశం ఏ స్థానంలో ఉందో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 05 2026, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఏ దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ?
Image Credit : Gemini AI

ఏ దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ?

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం చూస్తే ప్రపంచంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి.ప్రపంచంలోనే అత్యధిక ఆత్మహత్యల రేటు ఉన్న ప్రాంతంగా ఆఫ్రికా దేశం ‘లెసోతో’ నిలిచింది. అక్కడ ప్రతి లక్ష మంది జనాభాకు దాదాపు 87.5 మంది తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ జాబితాలో ఆసియా ఖండం తరఫున దక్షిణ కొరియా ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత ఎస్వాతిని, గయానా, ఉరుగ్వే వంటి దేశాలు కూడా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున చూస్తే లక్ష మందికి తొమ్మిది మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అయితే చిన్న దేశాల్లో జనాభా తక్కువగా ఉంటుంది కాబట్టి... అక్కడ ఆత్మహత్యల రేటు ఎక్కువగా నమోదవుతున్నట్లు అర్థం చేసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
భారతదేశంలోని పరిస్థితి
Image Credit : Pixabay

భారతదేశంలోని పరిస్థితి

ఇక మన భారత దేశం విషయానికి వస్తే లెక్కలు వేరే రకంగా ఉన్నాయి. భారతదేశంలో జనాభా అధికంగా ఉండటం చేత ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఆత్మహత్యా మరణాలు ఇక్కడే నమోదు అవుతున్నాయి. ఒక సంవత్సరంలో నమోదయ్యే మొత్తం ఆత్మహత్యా ఘటనల సంఖ్యలో ఇండియా మొదటి స్థానంలో ఉంటోంది. అయితే జనాభా దామాషా ప్రకారం లక్ష మందికి ఎంతమంది చనిపోతున్నారనే లెక్కను పరిశీలిస్తే ఇండియా 43వ స్థానంలో నిలుస్తుంది. మన దేశంలో సగటున ప్రతి లక్ష మంది జనాభాకు సుమారు పన్నెండు కన్నా ఎక్కువ మంది తమ ప్రాణాలు తామే తీసుకుంటున్నారు.

33
మనదేశంలో ఏ రాష్ట్రంలో?
Image Credit : Pixabay

మనదేశంలో ఏ రాష్ట్రంలో?

భారతదేశంలోని వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు స్పష్టంగా తెలియజేసింది. ఇక రాష్ట్రాల పరంగా పరిశీలిస్తే మనదేశంలో మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యా కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే స్థానిక జనాభా దామాషాతో పోల్చి చూసినప్పుడు మాత్రం సిక్కిం రాష్ట్రంలో ఆత్మహత్యల శాతం ఎక్కువగా ఉంటోంది. మన సమాజంలో రోజువారీ కూలీలు అత్యధికంగా ఇరవై ఆరు శాతం వరకు బలవన్మరణాలకు గురవుతున్నారు. చదువుకునే విద్యార్థులు, గృహిణులు, పదిహేను నుండి ఇరవై తొమ్మిది ఏళ్ల మధ్య ఉండే యువత తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Coffee Capital: మనదేశంలో కాఫీ రాజధానిగా పిలిచే సిటీ ఏదో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు
Recommended image2
సముద్రాల్లోని నీరు వేడెక్కితే చేపలు ఏమవుతాయి?
Recommended image3
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Related Stories
Recommended image1
Coconut Water: కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయి? ఈ నీరు ఎలా తయారవుతుంది?
Recommended image2
Coffee Capital: మనదేశంలో కాఫీ రాజధానిగా పిలిచే సిటీ ఏదో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved