MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Coconut Water: కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయి? ఈ నీరు ఎలా తయారవుతుంది?

Coconut Water: కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయి? ఈ నీరు ఎలా తయారవుతుంది?

Coconut Water: ఎప్పుడైనా ఆలోచించారా కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయి? కొబ్బరికాయ ముదిరేకొద్దీ అందులో నీళ్లు ఎందుకు తగ్గిపోతాయి? అని. కొబ్బరి కాయలోకి నీళ్లు చేరడం వెనుక ఎంతో సైన్స్ దాగి ఉంది. ఆసక్తికరమైన ఈ అంశం గురించి చదవండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 05 2026, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయి?
Image Credit : Gemini Ai

కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయి?

కొబ్బరికాయ లేదా కొబ్బరి బోండాం కొట్టగానే లోపల నీళ్లు పైకి చిమ్ముతాయి. ఆ నీళ్లు ఎంతో రుచిగా ఉంటాయి. పైగా పోషకాలు నిండి ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచించార ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని. కొబ్బరికాయలోకి ప్రత్యేకంగా ఎవరూ నీళ్లు నింపరు. కాయ పెరిగే దశలోనే సహజంగా ఈ నీళ్లు తయారవుతాయి. మరి ఈ నీళ్లు ఎలా తయారవుతాయి? కాయ ముదిరేకొద్దీ నీళ్లు ఎందుకు తగ్గుతాయి? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అసలు కొబ్బరికాయ ఎలా పుడుతుంది?
Image Credit : Pixabay

అసలు కొబ్బరికాయ ఎలా పుడుతుంది?

కొబ్బరికాయ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది తెల్లటి కొబ్బరి, తియ్యటి నీళ్లు. కొబ్బరికాయ అంటే మనం అనుకునే సాధారణ కాయ కాదు. ఇది కొబ్బరి చెట్టు విత్తనాన్ని దాచుకున్న ఒక పండు. కొబ్బరి చెట్టుకు పూలు పూసి, పరాగసంపర్కం జరిగిన తర్వాత, అందులోని కొన్ని పూలు కాయలుగా మారడం మొదలవుతాయి.

చెట్టు నీటిని పీల్చుకుంటే, అది కొబ్బరికాయలో నీళ్లుగా ఎలా మారుతుంది? అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. దీనికి సమాధానం కొబ్బరి చెట్టు వేర్ల నుంచి మొదలవుతుంది. కాయ ఏర్పడే తొలి దశలోనే దాని లోపల ఎన్నో మార్పులు జరుగుతాయి. కొబ్బరి చెట్టు వేర్లు.. మట్టిలోని నీటిని, అందులో కరిగిన ఖనిజాలను పీల్చుకుంటాయి. ఈ నీరు 'జైలమ్' (Xylem) అనే కణజాలం ద్వారా చెట్టు పైభాగాలకు చేరుకుంటుంది.

కాయ పెరగడం మొదలవ్వగానే, దానికి కావాల్సిన నీరు, పోషకాలు అందుతాయి. అక్కడ జరిగే జీవక్రియల వల్ల చక్కెరలు, ఖనిజ లవణాలు కలిసి కొబ్బరికాయ లోపల నీరుగా మారతాయి. దాన్నే మనం కొబ్బరి నీళ్లు అంటాం.

33
కొబ్బరికాయలోని నీళ్లు బయటకు ఎందుకు రావు?
Image Credit : Pixabay

కొబ్బరికాయలోని నీళ్లు బయటకు ఎందుకు రావు?

కొబ్బరికాయలో నీరు తయారవుతున్నా.. అవి అంత సులువుగా బయటకు రావు. కొబ్బరికాయల బయల పీచుతో కూడిన పొర ఉంటుంది. దాని లోపల గట్టి చిప్ప ఉంటుంది. ఆ చిప్ప లోపల విత్తనానికి సంబంధించిన ముఖ్యమైన భాగాలు, వాటితో పాటే కొబ్బరి నీళ్లు ఉంటాయి. ఇలా ఇన్ని పొరలు కలిసి కొబ్బరికాయ లోపలి నీళ్లను బయటకు రాకుండా సురక్షితంగా కాపాడతాయి.

కొబ్బరి బొండాంలో నీళ్లు ఉండే దశలోనే, లోపల మరో ముఖ్యమైన మార్పు సైలెంట్‌గా జరిగిపోతుంటుంది. కొబ్బరికాయ విత్తన భాగమైన తెల్లటి పొర (Endosperm) నెమ్మదిగా ఏర్పడటం మొదలవుతుంది. మొదట్లో ఇది చాలా మెత్తగా, జెల్లీలా ఉంటుంది. దీన్నే మనం 'లేత కొబ్బరి' అంటాం. కానీ కాయ అక్కడితో ఆగిపోదు. అది ముదిరేకొద్దీ, లోపల ఉన్న మెత్తటి కొబ్బరి క్రమంగా గట్టిపడటం మొదలవుతుంది.

ఇలా సమయం గడిచేకొద్దీ, ఆ లేత కొబ్బరి మందంగా, గట్టిగా మారి తెల్లటి కొబ్బరిగా తయారవుతుంది. చివరకు మనం వంటల్లో వాడుకునే ముదిరిన కొబ్బరికాయగా మారుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్ర‌పంచంలో న‌దులు లేని దేశం ఏదో తెలుసా.? మ‌రి అక్క‌డి వారి ప‌రిస్థితి ఏంటి.?
Recommended image2
Bhavani island: కృష్ణా నది మధ్యలో అందమైన ద్వీపం ‘భవాని ఐలాండ్’.. దసరా సెలవుల్లో ఓ ట్రిప్పేయండి
Recommended image3
Facts: కొంగ‌లు ఒంటి కాలుపై ఎందుకు నిల‌బ‌డ‌తాయో, ఎప్పుడైనా ఆలోచించారా.?
Related Stories
Recommended image1
Bhavani island: కృష్ణా నది మధ్యలో అందమైన ద్వీపం ‘భవాని ఐలాండ్’.. దసరా సెలవుల్లో ఓ ట్రిప్పేయండి
Recommended image2
Idli Podi: స్పెషల్ ఇడ్లీ కారం పొడి.. దీంతో ఎన్ని ఇడ్లీలైనా తినేయాలనిపిస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved