MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Jalebi/Tang Huan: మన జిలేబీకి చైనా వెర్షన్ ఇది.. దీని పేరేంటో తెలుసా?

Jalebi/Tang Huan: మన జిలేబీకి చైనా వెర్షన్ ఇది.. దీని పేరేంటో తెలుసా?

Jalebi/Tang Huan: జిలేబీ పేరు వినగానే నోరూరిపోతుంది కదా. అయితే మనకు ఎంతో ఇష్టమైన ఈ స్వీట్‌ను పోలిన మరో రెసిపీ కూడా చైనాలో ఉంది. అచ్చం జిలేబీలానే ఉంటుంది. వీటి తయారీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరి వీటిని ఏమంటారో తెలుసా?

2 Min read
Author : Nandini Arava
Published : Nov 01 2026, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మన జిలేబీకి చైనాలో ట్విన్
Image Credit : twitter

మన జిలేబీకి చైనాలో ట్విన్

భారతీయులకు జిలేబీతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండుగైనా, పెళ్లైనా, ఏ వేడుకైనా ఉండాల్సిందే. జిలేబీని ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. అయితే మనకు ఎంతో ఇష్టమైన ఈ స్వీట్‌ను పోలిన మరో వంటకం చైనాలోనూ ఉందని తెలుసా? దాని పేరు టాంగ్ హువాన్. చైనీస్ షుగర్ రింగ్స్‌గా పిలిచే ఈ స్వీట్ కూడా చూడటానికి అచ్చం జిలేబీలా ఉంటుంది. అయితే తయారీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చైనా జిలేబీకి పేరు టాంగ్ హువాన్!
Image Credit : gemini ai

చైనా జిలేబీకి పేరు టాంగ్ హువాన్!

భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి యు జింగ్ ఈ రెండు స్వీట్ల మధ్య ఉన్న పోలికను సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పంచుకున్నారు. చైనాలోని షుగర్ రింగ్స్, భారత్‌లోని జిలేబీ.. రెండూ రుచికరమైన మెలికలతో ప్రతి ముక్కలోనూ కరకరలాడే అనుభూతిని ఇస్తాయని చెప్పారు.

చైనీస్ షుగర్ రింగ్స్‌ను టాంగ్ హువాన్ లేదా షుగర్ స్పైరల్స్ అని పిలుస్తారు. ఇవి పలుచగా, గుండ్రంగా ఉంటాయి. పిండిని నూనెలో వేయించి తయారు చేస్తారు. తినేటప్పుడు కరకరలాడుతూ, తియ్యగా ఉంటాయి. జిలేబీతో పోలిస్తే ఇవి పలుచగా, తేలికగా ఉంటాయి.

34
చైనీస్ షుగర్ రింగ్స్ ఎలా తయారు చేస్తారు?
Image Credit : gemini ai

చైనీస్ షుగర్ రింగ్స్ ఎలా తయారు చేస్తారు?

టాంగ్ హువాన్ తయారీలో గుడ్లను ముందుగా బాగా గిలకొడతారు. ఆ తర్వాత నీళ్లు కలిపి, బ్రెడ్ ఫ్లోర్, కేక్ ఫ్లోర్‌ను సమానంగా తీసుకుని అందులో వేస్తారు. దీనికి కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్, బేకింగ్ పౌడర్, చక్కెర కలుపుతారు. ఈ మిశ్రమాన్ని వడకట్టి పిండిని సిద్ధం చేస్తారు.

ఈ స్వీట్ తయారీకి ప్రత్యేకమైన లోహపు అచ్చులను ఉపయోగిస్తారు. ఆ అచ్చులను ముందుగా పిండిలో ముంచి, ఆ తర్వాత వేడి నూనెలో ఉంచుతారు. కొద్దిసేపటికి అచ్చును మెల్లగా కదిలిస్తే పిండి విడిపోయి గుండ్రటి ఆకారంలో నూనెలో పడుతుంది. అవి బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు వేయిస్తారు. అంతే.. చైనీస్ షుగర్ రింగ్స్ రెడీ.

చైనాలో ఈ స్వీట్‌కు చైనీస్ న్యూ ఇయర్ వేడుకల సమయంలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఇళ్లలోనే వీటిని తయారు చేసుకుంటారు. అంతేకాదు, వంటగదిలో చెడు మాటలు మాట్లాడితే అవి షుగర్ రింగ్‌లోకి వెళ్లిపోతాయని, దాని ప్రభావం వచ్చే ఏడాదిపై పడుతుందని ఓ నమ్మకం కూడా ఉంది.

44
మరి మన జిలేబీ ఎలా తయారవుతుంది?
Image Credit : Asianet News

మరి మన జిలేబీ ఎలా తయారవుతుంది?

భారత్‌లో జిలేబీ తయారీ గురించి తెలిసిందే. తోపుడుబండ్లు, బేకరీల్లో కూడా జిలేబీలు అమ్ముతుంటారు. సాయంత్రమైతే చాలు...దుకాణాలన్నీ నిండిపోయింటాయి. వేడివేడిగా జిలేబీలు తినడానికి జనం ఎగబడుతుంటారు.

జిలేబీకి, టాంగ్ హువాన్‌కు అసలు తేడా ఇదే!

చూడటానికి రెండూ ఒకేలా కనిపించినా తయారీలో తేడా ఉంది. మన జిలేబీ పూర్తిగా వెజ్. కానీ చైనీస్ షుగర్ రింగ్స్ తయారీలో గుడ్లను ఉపయోగిస్తారు. జిలేబీని పాకంలో ముంచి తియ్యగా తయారు చేస్తే, టాంగ్ హువాన్ పిండిలోనే చక్కెర కలిపి వేయిస్తారు. జిలేబీకి ప్రత్యేకమైన పాకం రుచి ఉంటే, చైనీస్ షుగర్ రింగ్స్‌కు వాటి పలుచటి, కరకరలాడటమే ప్రత్యేకత.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
 
5th T20 • NZ vs IND 2026
Live
NZNZ
-
INDIND
(3.0 ov)19/1
NZ chose to bowl.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Business: ఇక్కడ చీరలు రూ.30 నుంచి మొదలు, చీరల బిజినెస్ ప్రారంభించాలంటే ఈ హోల్‌సేల్ మార్కెట్‌కు వెళ్లండి
Recommended image2
DMart: డీమార్ట్ కు ఎప్పుడు వెళ్తే టైమ్ సేవ్ అవుతుంది? ఏ రోజు వెళ్తే డబ్బులు ఆదా చేసుకోవచ్చో తెలుసా?
Recommended image3
Snakes : 100 ఎకరాల్లో 4,30,000 పాములా..! కేవలం విషసర్పాలు మాత్రమే ఉండే ఐలాండ్ ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
Tribal Style Fish Fry: ఎప్పుడూ తినే చేపల వేపుడు కాదు..ఉసిరితో చేసే ఈ రెసిపీ తింటే మైమరిచిపోతారు
Recommended image2
Litchi Capital: ప్రపంచం మొత్తంలో ఇక్కడి లిచ్చీకే గిరాకీ.. కేరాఫ్ అడ్రస్ ఎక్కడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved