MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Feature
  • Mercy Killing: కారుణ్య మరణం అంటే ఏమిటి? ఏ దేశంలో ఎలా ప్రాణాలు తీస్తారు?

Mercy Killing: కారుణ్య మరణం అంటే ఏమిటి? ఏ దేశంలో ఎలా ప్రాణాలు తీస్తారు?

Mercy Killing : మనిషి ప్రాణాలు తీసే హక్కు ఎవరికి ఉంది? అసలు కారుణ్య మరణం అంటే ఏమిటి? ప్రపంచ దేశాల్లో దీనిపై ఉన్న భిన్నమైన చట్టాలు, భారతదేశంలో లివింగ్ విల్ నిబంధనల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 07 2026, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చావుకు కూడా అనుమతి
Image Credit : Gemini

చావుకు కూడా అనుమతి

మానవ జీవితం ఎంతో విలువైనది. కానీ, కొన్ని పరిస్థితుల్లో బతుకు భారమైనప్పుడు, మరణమే శరణ్యం అనిపిస్తుంది. తీవ్రమైన అనారోగ్యం, భరించలేని నొప్పి.. ఇక కోలుకునే అవకాశం లేదని తెలిసినప్పుడు మనిషి కోరుకునేది ఒక్కటే శాంతి. ఆ శాంతి మరణం రూపంలో వస్తే? దానినే కారుణ్య మరణం అంటారు. వైద్య పరిభాషలో దీనిని యూతనేషియా అంటారు. ఈ కారుణ్య మరణం ఏయే దేశాల్లో చట్టబద్ధం? భారత సుప్రీంకోర్టు దీనిపై ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులేంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కారుణ్య మరణంలో రకాలు
Image Credit : ChatGPT

కారుణ్య మరణంలో రకాలు

కారుణ్య మరణాన్ని ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి.

1. యాక్టివ్ యూతనేషియా: ఇక్కడ వైద్యులు రోగికి ప్రాణాంతకమైన ఇంజెక్షన్ లేదా మందులు ఇచ్చి నేరుగా ప్రాణం తీస్తారు. ఇది ప్రపంచంలోని మెజారిటీ దేశాల్లో నేరంగా పరిగణిస్తారు. చాలా దేశాల్లో ఇది లీగల్ కాదు.

2. పాసివ్ యూతనేషియా : ఇందులో రోగిని బతికించడానికి ఇచ్చే కృత్రిమ చికిత్సను నిలిపివేస్తారు.ఉదాహరణకు వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్, లైఫ్ సపోర్ట్ ఇవ్వరు. అంటే ప్రకృతి సిద్ధంగా మరణం సంభవించేలా వదిలేయడం. ఈ విషయంలో శరీరం స్పందనలను పరిగణలోకి తీసుకుంటారు.

Related Articles

Related image1
Gays in Pakisthan: పాకిస్థాన్‌లో సగానికి పైగా నపుంసకులేనట, ఇక మిగతా అంతా ఆ టైపు
Related image2
Ice Cream : ఆ ఊరిలో ఐస్‌క్రీం అమ్మితే రూ. 5 వేలు ఫైన్.. ఎందుకో తెలుసా?
34
ఏ దేశంలో ఎలా ప్రాణాలు తీస్తారు?
Image Credit : Gemini

ఏ దేశంలో ఎలా ప్రాణాలు తీస్తారు?

కారుణ్య మరణంపై ఒక్కో దేశానిది ఒక్కో విధానం. నెదర్లాండ్స్, బెల్జియంలలో కఠిన నిబంధనల మధ్య యాక్టివ్ యూతనేషియాకు అనుమతి ఉంది. రోగి పూర్తి స్పృహతో ఉండాలి, కోలుకోలేనంత నొప్పిని అనుభవిస్తూ ఉండాలి. ఇక స్విట్జర్లాండ్ లో అసిస్టెడ్ స్యూసైడ్ ఫేమస్. రోగి స్వయంగా తనే ప్రాణాంతక మందును తీసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. దీని కోసం ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు స్విట్జర్లాండ్ వెళ్తుంటారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే దీనికి పరిమితంగా అనుమతి ఉంది.

44
మనదేశంలో అనుమతి ఉందా?
Image Credit : Gemini

మనదేశంలో అనుమతి ఉందా?

2018లో భారత అత్యున్నత న్యాయస్థానం ఒక సంచలన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తికి గౌరవంగా మరణించే హక్కు కూడా ఉందని పేర్కొంది. ఇందులో భాగంగా లివింగ్ విల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ఒక వ్యక్తి తాను స్పృహలో ఉన్నప్పుడే.. భవిష్యత్తులో తనకు నయం కాని వ్యాధి వస్తే లేదా తాను కోమాలోకి వెళ్తే, కృత్రిమంగా తనను బతికించవద్దని ముందుగానే లిఖితపూర్వక విజ్ఞప్తి చేయవచ్చు.

భారతదేశంలో కారుణ్య మరణం గురించి చర్చ వస్తే మొదట గుర్తొచ్చే పేరు అరుణా షాన్‌బాగ్. 1973లో ముంబైలోని కేఈఎం ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమెపై జరిగిన దారుణమైన అఘాయిత్యం ఆమె జీవితాన్ని ఛిద్రం చేసింది. మెడకు చైన్‌ బిగించి దాడి చేయడంతో మెదడుకు ఆక్సిజన్ అందక ఆమె పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళిపోయారు. దాదాపు 42 ఏళ్ల పాటు ఆమె కేవలం బెడ్‌పై ఒక జీవచ్ఛవంలా ఉండిపోయారు. ఆమె స్నేహితురాలు పింకీ విరానీ అరుణకు విముక్తి ప్రసాదించాలని కోర్టును ఆశ్రయించగా, 2011లో సుప్రీంకోర్టు మొదటిసారిగా పాసివ్ యూతనేషియా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Onion Tears : ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనక ఇంత కెమిస్ట్రీ దాగుందా?
Recommended image2
Beer Facts: బీర్‌లో నురగ ఎందుకు వస్తుంది? 6 వేల ఏళ్ల చరిత్ర వెనుక ఆసక్తికర విషయాలివే
Recommended image3
సచిన్, ధోని, రోహిత్, కోహ్లీ లకు ఆడపిల్లలే పుట్టడానికి కారణమేంటో తెలుసా?
Related Stories
Recommended image1
Gays in Pakisthan: పాకిస్థాన్‌లో సగానికి పైగా నపుంసకులేనట, ఇక మిగతా అంతా ఆ టైపు
Recommended image2
Ice Cream : ఆ ఊరిలో ఐస్‌క్రీం అమ్మితే రూ. 5 వేలు ఫైన్.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved