MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Feature
  • Railways Luggage Rules : ఏ క్లాస్ ప్రయాణికులు ఎంత లగేజ్ తీసుకెళ్లవచ్చు..? రైల్వే రూల్స్ ఇవే

Railways Luggage Rules : ఏ క్లాస్ ప్రయాణికులు ఎంత లగేజ్ తీసుకెళ్లవచ్చు..? రైల్వే రూల్స్ ఇవే

రైళ్లలో లగేజీ తీసుకెళ్లడానికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది ఇండియన్ రైల్వే. వివిధ తరగతులకు వేర్వేరు బరువు పరిమితులను నిర్ణయించింది. ఈ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 09 2026, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైళ్లలోనూ లగేజీ బరువు చూసుకోవాల్సిందే..
Image Credit : Gemini AI

రైళ్లలోనూ లగేజీ బరువు చూసుకోవాల్సిందే..

మీరు తరచుగా రైళ్లలో ప్రయాణిస్తుంటే, ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. అవును.. విమాన ప్రయాణాల మాదిరిగానే, ఇకపై రైలులో లగేజీ తీసుకెళ్లే ముందు దాని బరువును తప్పనిసరిగా చూసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రైల్వే లగేజీపై పరిమితి ఉందా..?
Image Credit : Getty

రైల్వే లగేజీపై పరిమితి ఉందా..?

ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఇటీవల రైళ్లలో గరిష్ఠంగా ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చనే దానిపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఉచితంగా అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ లగేజీ తీసుకెళ్తే ప్రయాణికులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది.

ఈ నిబంధనలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. ప్రతి తరగతికి లగేజీ పరిమితి, గరిష్ఠ పరిమితి, అదనపు ఛార్జీలను నిర్దిష్టంగా పేర్కొన్నారు.

అనుమతించిన పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లే ప్రయాణికులకు నిబంధనల ప్రకారం జరిమానా విధించవచ్చని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. రద్దీని నియంత్రించి, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రతి తరగతి కోచ్‌కు వేర్వేరు పరిమితులు నిర్ణయించారు.

Related Articles

Related image1
Railway Track: రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?
Related image2
Railway Station Owner : ఇంటిముందే ట్రైన్ పార్కింగ్.. మనదేశంలో సొంతంగా రైల్వే స్టేషన్ కలిగిన ఒకేఒక్కడు..
35
ఉచిత లగేజీకి పరిమితి..
Image Credit : chat gpt

ఉచిత లగేజీకి పరిమితి..

ఉచితంగా అనుమతించే లగేజీకి కూడా గరిష్ఠ పరిమితి ఉంటుందని రైల్వే మంత్రి లోక్‌సభలో స్పష్టం చేశారు. ప్రయాణికులు రుసుము చెల్లించినప్పటికీ, తమ తరగతికి నిర్దేశించిన గరిష్ఠ పరిమితికి మించి వస్తువులను తీసుకెళ్లడానికి వీల్లేదు.

ఉచిత పరిమితిని దాటిన ప్రయాణికులు అదనపు లగేజీని బుక్ చేసుకోవచ్చు. వారు తమ కోచ్‌లోనే ఆ లగేజీని తీసుకెళ్లడానికి నిర్దేశించిన రేటుకు ఒకటిన్నర రెట్లు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

45
ఏ కోచ్ లో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు..?
Image Credit : Gemini

ఏ కోచ్ లో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు..?

వివిధ క్లాసుల్లో లగేజీ గరిష్ఠ పరిమితులు ఇలా ఉన్నాయి

ఏసీ ఫస్ట్ క్లాస్: తలకు 70 కిలోల వరకు

ఏసీ టూ టైర్: తలకు 50 కిలోల వరకు.

ఏసీ త్రీ టైర్, చైర్ కార్: తలకు 40 కిలోల వరకు.

స్లీపర్ క్లాస్: తలకు 40 కిలోల వరకు.

సెకండ్ క్లాస్: తలకు 35 కిలోల వరకు.

లగేజీ పరిమాణం ఎంతుండాలి..?

లగేజీ పరిమాణాన్ని కూడా రైల్వే శాఖ నిర్ధారించింది. ప్రయాణికులు తమ కోచ్‌లలోకి ట్రంకులు, సూట్‌కేసులు లేదా పెట్టెలను మాత్రమే తీసుకెళ్లగలరు. వాటి గరిష్ఠ పరిమాణం 100 సెం.మీ x 60 సెం.మీ x 25 సెం.మీ మించకూడదు. ఇంతకంటే పెద్ద లగేజీని కోచ్‌లోకి అనుమతించరు.

నిర్ణీత పరిమాణం కంటే పెద్ద లగేజీని తప్పనిసరిగా బుక్ చేసి బ్రేక్ వ్యాన్ లేదా పార్సెల్ వ్యాన్‌కు పంపాలి. అంతకంటే పెద్ద వస్తువులను వ్యక్తిగత లగేజీగా పరిగణించరు, వాటిని కోచ్‌లోకి అనుమతించరు. వాటిని విడిగా బుక్ చేసి బ్రేక్ వ్యాన్‌లో మాత్రమే పంపాలి.

55
అదనపు లగేజీ ఎక్కడ పెట్టాలి?
Image Credit : Gemini AI

అదనపు లగేజీ ఎక్కడ పెట్టాలి?

నిర్ణీత పరిమితికి మించిన లగేజీని బ్రేక్ వ్యాన్ (SLR)లో మాత్రమే తీసుకెళ్లాలి. రైల్వే నిర్దేశించిన గరిష్ఠ బుకింగ్ పరిమితిని తప్పనిసరిగా పాటించాలి. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు రూపొందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ నిబంధనలు పాటిస్తే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రయాణానికి ముందే తమ లగేజీ బరువును తూకం వేసుకోవాలని కోరారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Tourism : నేపాల్ లో ఇండియన్స్ అత్యధికంగా సందర్శించే టూరిస్ట్ స్పాట్స్ ఇవే..
Recommended image2
Facilities in Jail : జైల్లో ఖైదీలకు బెడ్, పరుపు, దుప్పటి ఇస్తారా? స్నానానికి సబ్బు సంగతేంటి?
Recommended image3
School Bus : అమెరికా నుండి అమీర్ పేట వరకు స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకుంటాయి? టాప్ 5 సైంటిఫిక్ రీజన్స్
Related Stories
Recommended image1
Railway Track: రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?
Recommended image2
Railway Station Owner : ఇంటిముందే ట్రైన్ పార్కింగ్.. మనదేశంలో సొంతంగా రైల్వే స్టేషన్ కలిగిన ఒకేఒక్కడు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved