MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Telangana
  • Ice Cream : ఆ ఊరిలో ఐస్‌క్రీం అమ్మితే రూ. 5 వేలు ఫైన్.. ఎందుకో తెలుసా?

Ice Cream : ఆ ఊరిలో ఐస్‌క్రీం అమ్మితే రూ. 5 వేలు ఫైన్.. ఎందుకో తెలుసా?

Ice Cream : నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు ఐస్‌క్రీం అమ్మకాలను నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. నిబంధనలు ఉల్లంఘించి గ్రామంలోకి ఐస్‌క్రీం బండ్లు వస్తే  భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించాయి. ఈ గ్రామాలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి?

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 06 2026, 07:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Ice Cream ఆ గ్రామాల్లో ఐస్‌క్రీం బండ్లకు నో ఎంట్రీ
Image Credit : Gemini

Ice Cream ఆ గ్రామాల్లో ఐస్‌క్రీం బండ్లకు నో ఎంట్రీ

నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాయి. సాధారణంగా వేసవి కాలం వస్తే ఐస్‌క్రీం బండ్ల సందడి కనిపిస్తుంది. కానీ, ఈ జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీలు మాత్రం తమ వీధుల్లోకి ఐస్‌క్రీం తోపుడు బండ్లు రాకుండా నిషేధాన్ని విధిస్తున్నాయి. కేవలం నోటి మాటతోనే కాకుండా, గ్రామ సభల్లో అధికారికంగా తీర్మానాలు చేస్తూ, నిబంధనలను కఠినం చేశాయి. ఈ నిర్ణయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఐస్‌క్రీం బండ్ల పై నిషేధం.. పెరుగుతున్న గ్రామాలు
Image Credit : our own

ఐస్‌క్రీం బండ్ల పై నిషేధం.. పెరుగుతున్న గ్రామాలు

ప్రారంభంలో కొన్ని గ్రామాలకే పరిమితమైన ఈ ఉద్యమం ఇప్పుడు జిల్లాలోని పలు మండలాలకు పాకింది. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి, మాక్లూర్ మండలం మందాపూర్, డొంకేశ్వర్ మండలం గాదేపల్లి, అన్నారం, నూత్‌పల్లి, తొండాకూర్ గ్రామాలు ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. అలాగే నందిపేట్, ఆర్మూర్, ముప్కాల్, వేల్పూర్ మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఊరిలోకి వచ్చే దారుల వద్ద ఐస్‌క్రీం బండ్లు రావొద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Related Articles

Related image1
IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ ఇదే.. ఆ బౌలర్ కెరీర్ క్లోజ్ !
Related image2
Gays in Pakisthan: పాకిస్థాన్‌లో సగానికి పైగా నపుంసకులేనట, ఇక మిగతా అంతా ఆ టైపు
34
ఐస్‌క్రీం బండ్లకు నో ఎంట్రీ.. అసలు కారణం ఇదే
Image Credit : Gemini

ఐస్‌క్రీం బండ్లకు నో ఎంట్రీ.. అసలు కారణం ఇదే

ఈ కఠిన నిర్ణయాల వెనుక ప్రధాన కారణం పిల్లల ఆరోగ్య పరిరక్షణే. తోపుడు బండ్లపై విక్రయించే ఐస్‌క్రీంలలో నాణ్యత ఉండదని, రంగులు, హానికరమైన రసాయనాలను కలుపుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని తినడం వల్ల చిన్న పిల్లలకు వెంటనే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు రావడమే కాకుండా, దీర్ఘకాలంలో కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో గ్రామాభివృద్ధి కమిటీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

44
భారీ జరిమానాలు
Image Credit : Gemini

భారీ జరిమానాలు

నిషేధాజ్ఞలను ధిక్కరించి ఎవరైనా గ్రామంలో ఐస్‌క్రీం విక్రయాలు జరిపితే, వారికి రూ. 5,000 జరిమానా విధించనున్నట్లు పంచాయతీలు ప్రకటించాయి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ నిబంధనలు కఠినంగా అమల్లోకి వచ్చాయి. "గ్రామస్తుల సహకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని" ఐస్‌క్రీం బండ్ల ఎంట్రీని నిషేధించిన గ్రామాలు పేర్కొంటున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ‌.. జ‌పాన్‌తో యంగ్‌ ఇండియా స్కిల్స్ వ‌ర్సిటీ ఒప్పందం
Recommended image2
RTC: ఇక కండ‌క్ట‌ర్‌తో ప‌ని లేదు.. మీ టికెట్ మీరు తీసుకోవ‌చ్చు. ఆర్టీసీలో స‌రికొత్త ప్ర‌యోగం
Recommended image3
LPG: మరో మూడు రోజులే టైముంది.. వెంటనే ఈ పనిచేయకపోతే మీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కట్ !
Related Stories
Recommended image1
IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్ ఇదే.. ఆ బౌలర్ కెరీర్ క్లోజ్ !
Recommended image2
Gays in Pakisthan: పాకిస్థాన్‌లో సగానికి పైగా నపుంసకులేనట, ఇక మిగతా అంతా ఆ టైపు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved