MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Gays in Pakisthan: పాకిస్థాన్‌లో సగానికి పైగా నపుంసకులేనట, ఇక మిగతా అంతా ఆ టైపు

Gays in Pakisthan: పాకిస్థాన్‌లో సగానికి పైగా నపుంసకులేనట, ఇక మిగతా అంతా ఆ టైపు

Gays in Pakisthan: పాకిస్థాన్‌లో 80% మంది గేలేనని ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ హీనా బలోచ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ ధురంధర్ మూవీ సీన్ వైరల్ అవుతోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 06 2026, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాక్ లో అందరూ ఆ టైపా?
Image Credit : Chat gpt

పాక్ లో అందరూ ఆ టైపా?

పాకిస్థాన్ సమాజంలోని అంతర్గత వైరుధ్యాలను, అక్కడ అణచివేసిన లైంగిక వాస్తవాలను ఎండగడుతూ ప్రముఖ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ హీనా బలోచ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1500 కోట్ల వసూళ్లతో దూసుకుపోతుండగా, హీనా వ్యాఖ్యలు ఈ సినిమాలోని ఒక కీలక సన్నివేశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాయి. ఆ వీడియో వైరల్ కావడంతో పాటు సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అందరూ నపుంసకులేనా?
Image Credit : Asianet News

అందరూ నపుంసకులేనా?

పాకిస్థాన్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ హక్కుల పోరాట యోధురాలు హీనా బలోచ్ ఇటీవల క్వీర్ గ్లోబల్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. "పాకిస్థాన్ జనాభాలో సుమారు 80 శాతం మంది గే లు అని, మిగిలిన 20 శాతం మంది బైసెక్సువల్స్ అని నేను నమ్ముతున్నాను. అక్కడ అసలు స్ట్రైయిట్ అనేవారే లేరని నా అభిప్రాయం" అని ఆమె పేర్కొన్నారు. మతం, సంస్కృతి, కుటుంబ గౌరవం అనే ముసుగులో ప్రజలు తమ అసలు లైంగిక గుర్తింపును దాచుకుంటున్నారని, ఇది పాకిస్థాన్ సమాజంలో ఒక ఓపెన్ సీక్రెట్ అని ఆమె కుండబద్దలు కొట్టారు.

Everyone knows it exists, nobody wants their name attached to it.
Pakistani activist Hina Baloch claims 80% of Pakistan is gay and the rest bisexual.. pic.twitter.com/OF6nL55ona

— Wellu (@Wellutwt) April 3, 2026

34
అణచివేత.. సామాజిక ఒత్తిడి ప్రభావం
Image Credit : Priyadarshan/ Facebook, Jio Studios

అణచివేత.. సామాజిక ఒత్తిడి ప్రభావం

హీనా బలోచ్ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ, పాక్ సమాజంలో లైంగికత కంటే లింగ గుర్తింపు పైనే ఎక్కువ దాడులు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. "చిన్నప్పుడు నేను లిప్‌స్టిక్ వేసుకోవాలన్నా, నగలు ధరించాలన్నా భయపడేదాన్ని. కుటుంబం నుండి వచ్చే దాడులు, వేధింపులు అంతా ఇంతా కాదు" అని ఆమె వివరించారు. అక్కడ ట్రాన్స్‌జెండర్లను కేవలం భిక్షాటన, డ్యాన్స్ లేదా ప్రాస్టిట్యూషన్ వంటి వృత్తులకే పరిమితం చేస్తున్నారని, హక్కుల కోసం పోరాడితే కిడ్నాపులు, దాడులు తప్పవని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఆమె లండన్‌లోని SOAS యూనివర్సిటీలో స్కాలర్‌షిప్ పొంది, యూకేలో ఆశ్రయం పొందుతున్నారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Queer Global (@queer.global)

44
ధురంధర్ సీన్‌తో ముడిపడిన పాక్ నిజస్వరూపం
Image Credit : Asianet News

ధురంధర్ సీన్‌తో ముడిపడిన పాక్ నిజస్వరూపం

హీనా బలోచ్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో, నెటిజన్లు ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ మొదటి భాగంలోని రణ్‌వీర్ సింగ్ సీన్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో భారతీయ గూఢచారి హమ్జా అలీ మజారీగా నటించిన రణ్‌వీర్, పాకిస్థాన్‌లోని లియారీ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ గ్యాంగ్‌స్టర్ రెహమాన్ డకైత్ (అక్షయ్ ఖన్నా) గ్యాంగ్‌లో చేరిన మొదటి రోజే, రణ్‌వీర్ పాత్ర లైంగిక వేధింపులకు గురవుతుంది. లుల్లీ డకైత్ అనే పాత్ర ద్వారా జరిగే ఆ అమానవీయ దాడిని దర్శకుడు చాలా సహజంగా చిత్రీకరించారు. ఆ సమయంలో రణ్‌వీర్ కళ్ళలో కనిపించే వేదన, అసహ్యం ఇప్పుడు హీనా బలోచ్ చెప్పిన సామాజిక పరిస్థితులకు అద్దం పడుతున్నాయనే చర్చ సాగుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
బాలీవుడ్
భారత దేశం
పాకిస్తాన్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Rishabh Pant : లక్నో కెప్టెన్ లగ్జరీ లైఫ్.. రిషబ్ పంత్ నెట్ వర్త్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !
Recommended image2
Coconut : ఫ్లైట్‌లో ఎండు కొబ్బరి పై నిషేధం ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved