MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Hotel vs Motel : హోటల్ అంటే తెలుసు.. మరి ఈ మోటల్ ఏంటి? రెండింటి మధ్య తేడా ఏంటి?

Hotel vs Motel : హోటల్ అంటే తెలుసు.. మరి ఈ మోటల్ ఏంటి? రెండింటి మధ్య తేడా ఏంటి?

స్వస్థలం నుండి దూర ప్రాంతాలకు వెళ్ళినపుడు బస చేసేది హోటల్... ఇది అందరికీ తెలిసిందే. మరి 'మోటల్' అంటే ఏమిటో తెలుసా? అసలు హోటల్, మోటల్ కి మధ్య తేడా ఏంటి?

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 21 2026, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మోటల్ అంటే ఏమిటి?
Image Credit : Gemini AI

మోటల్ అంటే ఏమిటి?

మోటల్ అనే పదం "మోటరిస్ట్స్ హోటల్" అనే ఆంగ్ల పదాల సంక్షిప్త రూపం. Motor+Hotel = Motel అన్నమాట. ఇది ప్రధానంగా రోడ్డు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించబడిన ప్రత్యేక వసతి గృహం. సాధారణంగా వీటిని ప్రధాన రహదారుల పక్కన, నగరాలకు దూరంగానే ఏర్పాటు చేస్తారు.

అమెరికాలో మొట్టమొదట మోటల్ ఏర్పాటుచేశారు. కాలిఫోర్నియాలోని శాన్ లూయిస్ ఒబిస్పోలో 1925లో 'మోటెల్ ఇన్' పేరుతో మోటల్ ప్రారంభమైంది. ఇక్కడ అతిథులు తమ వాహనాలను నేరుగా గదుల ముందు పార్క్ చేసుకోవచ్చు... అలాగే తక్కువ ఖర్చుతో బస సౌకర్యం లభిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హోటల్, మోటల్ మధ్య తేడా ఏంటి?
Image Credit : Getty

హోటల్, మోటల్ మధ్య తేడా ఏంటి?

హోటల్, మోటల్ రెండూ బస సౌకర్యాలను అందించినప్పటికీ వాటి నిర్మాణ శైలి, సేవలలో చాలా తేడాలున్నాయి. హోటల్స్ సాధారణంగా బహుళ అంతస్తులతో, పెద్ద లాబీలతో… రెస్టారెంట్లు, జిమ్, స్విమ్మింగ్ ఫూల్, మసాజ్ సెంటర్లు వంటి విస్తృతమైన సౌకర్యాలను కలిగి ఉంటాయి. అలాగే వీటిలో బడ్జెట్ ను బట్టి సాధారణ గదులు, లగ్జరీ సూట్స్ ఉంటాయి... ఇలా బేసిక్ సౌకర్యాల నుండి లగ్జరీ సేవలు అందుబాటులో ఉంటాయి.

అయితే హోటల్ కి చాలా భిన్నమైనది మోటల్... ఇది భారీ బిల్డింగ్స్ లో కాకుండా సాధారణంగా ఒకటి లేదా రెండు అంతస్తుల నిర్మాణాలుగా ఉంటాయి. రోడ్డుపై ప్రయాణాలు చేసేవారు తమ వాహనాలను నేరుగా తమ గదుల వద్ద పార్క్ చేసుకుని, బయటి నుండి నేరుగా గదుల్లోకి ప్రవేశించవచ్చు. మోటల్స్ తక్కువ ఖర్చుతో ప్రాథమిక వసతిని అందిస్తాయి... లగ్జరీ సదుపాయాలు ఉండవు. రాత్రి బసచేసి ఉదయం చెక్ ఔట్ చేసేందుకు వీలుగా మోటల్స్ ఉంటాయి.

Related Articles

Related image1
Hotel: హోటల్ లో ఉండే కెటిల్ లో మ్యాగీ చేసే అలవాటు ఉందా? ఇది తెలిస్తే..మళ్లీ ఆ పనిచేయరు..!
Related image2
Hotel Secrets: హోటల్ రూమ్ లో బెడ్ కింద వాటర్ బాటిల్ ఎందుకు దొర్లించాలి?
35
ప్రపంచవ్యాప్తంగా మోటల్స్ ఎలా విస్తరించాయి?
Image Credit : stockPhoto

ప్రపంచవ్యాప్తంగా మోటల్స్ ఎలా విస్తరించాయి?

అమెరికాలో 1920వ దశకంలో ఆటోమొబైల్ రంగం ఊపందుకుంది... దీంతో వాహనాలు వినియోగం బాగా పెరిగి ప్రయాణాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో రోడ్లపై ప్రయాణించే వారికి సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వసతి చాలా అవసరం ఉండేది... దీంతో మోటల్స్ పుట్టుకొచ్చాయి. 

అయితే 1950లు, 60లలో అమెరికాలో అంతర్రాష్ట్ర రహదారులు (Interstate Highway System) అభివృద్ధి చెందడంతో మోటల్స్ సంఖ్య భారీగా పెరిగింది. ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సొంత వాహనాల్లో ప్రయాణించేవారు బడ్జెట్ లో స్టే చేసేందుకు హోటల్స్ వెతికేవారు… వారికి ఈ శ్రమ లేకుండా చేసేందుకు మోటల్స్ వచ్చాయి. ఇక హాలిడే ఇన్, రామ్దా వంటి ప్రముఖ మోటల్ చైన్‌ల ఎంట్రీతో ఈ పరిశ్రమను భారీగా విస్తరించింది. ఇలా హోటల్ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రజలు మోటల్స్ ను ఉపయోగించడం ప్రారంభించారు.

45
మోటల్స్ అందిచే ప్రత్యేక సౌకర్యాలు
Image Credit : Getty

మోటల్స్ అందిచే ప్రత్యేక సౌకర్యాలు

మోటల్స్ అనేవి రోడ్డు ప్రయాణం చేసేవారికి ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త బస సౌకర్యాలు… ఇవి హోటల్స్ కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఈ డ్రైవ్-అప్ గదుల వల్ల ప్రయాణికులు తమ వాహనాలను నేరుగా గది ముందు పార్క్ చేసుకోవచ్చు, తద్వారా త్వరగా చెక్-ఇన్, చెక్-అవుట్ చేసుకోవడం సులభతరం అవుతుంది. పెద్ద లాబీలతో పని లేకుండా సమయం ఆదా అవుతుంది. అధిక సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇవి హోటల్స్ కంటే తక్కువ ధరకే లభిస్తాయి. ముఖ్యంగా రహదారులకు దగ్గరగా ఉండటం వలన తమ ప్రయాణాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా సులభంగా కొనసాగించడానికి ఇది ఒక ఆచరణీయమైన, ఉపయోగకరమైన ఎంపిక. అందుకే అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా ఈ మోటల్స్ ప్రాచుర్యం పొందాయి... కార్పోరేట్ సంస్థలు కూడా ఈ మోటల్ బిజినెస్ లో అడుగుపెట్టడంతో మోటల్స్ సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి.

55
భారతీయ ప్రయాణికులకు మోటల్స్ ఎలా ఉపయోగపడతాయి?
Image Credit : Getty

భారతీయ ప్రయాణికులకు మోటల్స్ ఎలా ఉపయోగపడతాయి?

భారతదేశంలో రోడ్డు మార్గాల అభివృద్ధి, సెల్ప్ డ్రైవ్ (self-drive) ప్రయాణాలు పెరుగుతున్న నేపథ్యంలో మోటల్స్‌కు మంచి భవిష్యత్తు ఉంది. సుదూర ప్రయాణాలు చేసే కుటుంబాలకు, బిజినెస్ పనులపై నిత్యం రోడ్లపై రాకపోకలు సాగించేవారికి మోటాల్స్ ఉపయోగడతాయి. జాతీయ రహదారుల పక్కన ఏర్పాటు చేయబడే ఇవి, ప్రయాణికులకు అలసట లేకుండా సురక్షితమైన రాత్రి బసను అందిస్తాయి. తక్కువ ఖర్చుతో, తక్షణ వసతి లభించడం భారతీయ ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే వంటి కొత్త రహదారుల వెంట వీటి అవసరం పెరుగుతుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల శివారు ప్రాంతాల్లో కూడా మోటల్స్ పుట్టుకొస్తున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Recommended image2
దేశానికి అత్యధికమంది ఐపిఎస్ లను అందించిన టాప్ 10 రాష్ట్రాలివే.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?
Recommended image3
కాఫీ, టీలు లేనప్పుడు మన పూర్వీకులు ఏం తాగేవారు? అసలు ఈ పానీయాలు మనకెలా అలవాటయ్యాయి?
Related Stories
Recommended image1
Hotel: హోటల్ లో ఉండే కెటిల్ లో మ్యాగీ చేసే అలవాటు ఉందా? ఇది తెలిస్తే..మళ్లీ ఆ పనిచేయరు..!
Recommended image2
Hotel Secrets: హోటల్ రూమ్ లో బెడ్ కింద వాటర్ బాటిల్ ఎందుకు దొర్లించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved