MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Restaurant: ఈ రెస్టారెంట్ లో సమాధుల పక్కనే భోజనం వడ్డిస్తారు..ఎలా తింటున్నార్రా బాబు..!

Restaurant: ఈ రెస్టారెంట్ లో సమాధుల పక్కనే భోజనం వడ్డిస్తారు..ఎలా తింటున్నార్రా బాబు..!

Restaurant: టేస్టీ ఫుడ్, అందమైన వాతావరణం ఉంటే.. ఆ రెస్టారెంట్ కి జనాలు క్యూలు కడుతూ ఉంటారు. కానీ, సమాధుల మధ్య భోజనం పెడుతున్నా కూడా జనాలు క్యూలు కడుతున్న రెస్టారెంట్ గురించి ఎప్పుడైనా విన్నారా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 30 2026, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వింతైన రెస్టారెంట్...
Image Credit : Chat GPt

వింతైన రెస్టారెంట్...

ప్రతిరోజూ ఇంట్లో భోజనం చేయడం బోరింగ్ గా అనిపిస్తే.. అప్పుడప్పుడు రెస్టారెంట్ కి వెళ్లి కమ్మగా భోజనం లాంగించేస్తూ ఉంటాం. మంచి రెస్టారెంట్ ఉంది అంటే.. ఎంత దూరమైనా వెళ్లి.. తినేవాళ్లు చాలా మందే ఉంటారు. మోస్ట్ లీ ఎవరైనా ఎలాంటి రెస్టారెంట్లకు వెళ్తుంటారు..? ఫుడ్ టేస్టు బాగుండేవి..లేదంటే.. చూడటానికి ఆంబియన్స్ బాగుండే రెస్టారెంట్స్ కి వెళ్తూ ఉంటారు.కానీ, సమాధుల మధ్యలో కూర్చొని భోజనం చేయడం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వినడానికే వింతగా అనిపిస్తుంది కదా.. కానీ, అహ్మదాబాద్ లోని ఓ రెస్టారెంట్ మాత్రం.. సమాధుల మధ్యలో కూర్చొని ఫుడ్ వడ్డిస్తారు. అక్కడికి జనాలు కూడా క్యూలు కట్టి వెళ్లి మరీ తింటూ ఉంటారు. ఆ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది?
Image Credit : Instagram

ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది?

అహ్మదాబాద్ సిటీలో న్యూ లక్కీ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ మొత్తం సమాధుల మధ్యలోనే ఉంటుంది. సమాధులు పక్కనే ఉన్నా కూడా.. జనాలు ఈ రెస్టారెంట్ కి వచ్చి హ్యాపీగా కడుపు నిండా భోజనం చేస్తూ ఉంటారు. ఈ రెస్టారెంట్ ని ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన భోజన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇతర రెస్టారెంట్స్ కంటే డిఫరెంట్ గా ఉండాలని వీళ్లు.. హోటల్ మధ్యలో సమాధులు పెట్టలేదు. సమాధుల మధ్యలోనే వీళ్లు ఈ రెస్టారెంట్ డిజైన్ చేశారు. దాదాపు 75ఏళ్ల క్రితం దీనిని నిర్మించారు. ఆ నిర్మించే సమయంలో.. ఇక్కడ సమాధులు ఉన్నాయని దీని యజమాని కృష్ణన్ కుట్టికి తెలిసింది. తన వ్యాపారం కోసం.. కొందరి మనోభావాలను దెబ్బతీయడం ఇష్టంలేని ఆయన.. వాటిని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచి వాటి మధ్యలో తన రెస్టారెంట్ ని నిర్మించుకున్నాడు.

Related Articles

Related image1
Masala Spices: ఇక్కడ బిర్యానీ మసాలాలు చాలా చీప్ గా దొరుకుతాయి..!
Related image2
Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!
33
26 సమాధులు..
Image Credit : Chat GPt

26 సమాధులు..

ఈ రెస్టారెంట్ లో మొత్తం 26 సమాధులు ఉన్నాయి. ప్రతి సమాధి చుట్టూ కంచె వేసి.. అవి పాడవ్వకుండా.. వాటిని ఎవరూ అగౌరపరచకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు.. హోటల్ సిబ్బంది ప్రతిరోజూ ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, తాజా పూలు తెచ్చి పెడుతూ ఉంటారు. సమాధుల పక్కన ఎవరు కూర్చొని భోజనం చేస్తారు అని మీరు అనుకోవచ్చు. కానీ, ప్రతిరోజూ వేల మంది ఈ రెస్టారెంట్ కి వస్తూ ఉంటారు. ఈ రెస్టారెంట్ నిత్యం జనాలతో కిక్కిరిసి కనిపిస్తుంది. ఎవరూ ఎలాంటి సంకోచం లేకుండా ఇక్కడికి వచ్చి హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఈ రెస్టారెంట్ విషయంలో ఓ నమ్మకం కూడా ఉంది. ఇక్కడ భోజనం చేసినా, కప్పు కాఫీ తాగినా అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు సరిగా లాభాలు రాకపోతే.. ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారు.అలా జరిగితే.. మంచి లాభాలు వస్తాయని నమ్ముతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Agriculture : వర్షాలు ఆలస్యమైనా డోన్ట్ వర్రీ.. సెప్టెంబర్‌లో ఈ పంటలు వేస్తే మంచి ఆదాయం ఖాయం
Recommended image2
World Wonders: కళ్లని మాయ చేసే రెయిన్ బో బిల్డింగ్స్..ప్రపంచంలోనే అద్భుత కట్టడాలు ఇవి
Recommended image3
Property Buying Tips: వర్షాకాలంలోనే ఇల్లు కొనాలి.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Masala Spices: ఇక్కడ బిర్యానీ మసాలాలు చాలా చీప్ గా దొరుకుతాయి..!
Recommended image2
Pearls: మన దేశంలో ముత్యాలు చీప్ గా దొరికేది ఎక్కడో తెలుసా? అందరూ ఇక్కడికే వచ్చి కొంటారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved