MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Why Snakes Enter Houses: వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి రావడానికి అసలు కారణం ఇదే !

Why Snakes Enter Houses: వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి రావడానికి అసలు కారణం ఇదే !

Why Snakes Enter Houses: వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి రావడం మనం చూస్తుంటాం. అడవుల్లో లేదా మన చుట్టు పక్కల పొలాలు, ప్రాంతాల్లో వుండే పాములు వానకాలంలో ఇళ్లలోకి ఎందుకు వస్తాయి? దీనికి గల కారణాలు, నివారణ మార్గాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 30 2026, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వర్షాకాలంలో పాములు మీ ఇంట్లోకి ఎందుకు వస్తాయి?
Image Credit : Chatgpt

వర్షాకాలంలో పాములు మీ ఇంట్లోకి ఎందుకు వస్తాయి?

వర్షాకాలం వస్తే చాలు.. బయట వర్షం కురుస్తుంటే ఇంట్లోకి పాములు వస్తున్నాయనే వార్తలు తరచుగా వింటూ ఉంటాం. చాలామంది పాములు కావాలనే మనుషులపై దాడి చేయడానికి లేదా ఇళ్లలోకి రావడానికి ప్రయత్నిస్తాయి అని అనుకుంటారు. కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. పాములు ఇళ్లలోకి రావడం వెనుక ఉన్నది కేవలం వాటి జీవన పోరాటం, మనుగడ మాత్రమే.

వర్షాల వల్ల వాటి సహజ నివాసాలు దెబ్బతిన్నప్పుడు, అవి రక్షణ, వెచ్చదనం, ఆహారం కోసం మాత్రమే సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్ల వైపు వస్తాయి. వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి ఎందుకు వస్తాయి? వాటిని నివారించడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
వానలతో నివాసాలు మునిగిపోవడం
Image Credit : Gemini

వానలతో నివాసాలు మునిగిపోవడం

పాములు సాధారణంగా భూమిలోని కలుగులు, ఎలుకల రంధ్రాలు, రాళ్ల మధ్య ఖాళీలు, డ్రెయిన్లు, దట్టమైన పొదల్లో నివసిస్తాయి. అయితే వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా పడే వర్షాల వల్ల ఈ కలుగులు, రంధ్రాలు పూర్తిగా నీటితో నిండిపోతాయి. నేల మొత్తం నీటితో నిండిపోవడంతో పాములకు అక్కడ శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దాంతో అవి నీటిలో మునిగిపోకుండా ఉండేందుకు, చలికి గడ్డకట్టుకుపోకుండా ఉండేందుకు ఎత్తైన, పొడిగా ఉండే ప్రదేశాల కోసం బయటకు వస్తాయి. ఈ క్రమంలోనే అవి సమీపంలోని గ్యారేజీలు, షెడ్లు, గదులు, ఇళ్లలోకి ప్రవేశిస్తాయి.

Related Articles

Related image1
Snake Bite First Aid: పాము కరిస్తే నిమిషాల్లో చేయాల్సిన పని ఇదే.. చాలామందికి తెలియని నిజాలు !
Related image2
IMD Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఏయే జిల్లాల్లో అంటే?
37
ఆహారం వెతుక్కుంటూ రావడం
Image Credit : Asianet News

ఆహారం వెతుక్కుంటూ రావడం

వర్షాకాలంలో కేవలం పాములు మాత్రమే కాదు, ఎలుకలు, కప్పలు, తొండలు, పెద్ద పెద్ద కీటకాలు కూడా వరద నీటి నుంచి తప్పించుకోవడానికి పొడిగా ఉండే ఇళ్ల వైపు వస్తాయి. పాములకు ఇవన్నీ ప్రధానమైన ఆహారం. ఎలుకలు, కప్పలు ఇళ్లలోని ధాన్యాల నిల్వలు, చెత్త డబ్బాలు, తడి ప్రదేశాల వైపు వచ్చినప్పుడు, వాటి వాసనను పట్టుకుంటూ పాములు కూడా నేరుగా ఇళ్ల ప్రాంగణంలోకి వస్తాయి. మీ ఇంట్లో ఎలుకలు లేదా కప్పలు ఎక్కువగా ఉంటే, పాములు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

47
వెచ్చదనం, సురక్షిత ఆశ్రయం
Image Credit : Gemini AI

వెచ్చదనం, సురక్షిత ఆశ్రయం

పాములు చల్లని రక్తం కలిగిన జీవులు. అంటే అవి తమ శరీర ఉష్ణోగ్రతను సొంతంగా నియంత్రించుకోలేవు. బయట వాతావరణం చల్లగా, తడిగా మారినప్పుడు వాటి జీవక్రియ మందగిస్తుంది. శక్తి తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితిలో వాటికి స్థిరమైన, వెచ్చని, పొడి వాతావరణం అవసరం అవుతుంది.

మన ఇళ్లు, భవనాలు వాటికి సరిగ్గా అటువంటి వాతావరణాన్ని అందిస్తాయి. అందుకే అవి ఇంట్లో ఎవరూ తిరగని చీకటి మూలలు, ఫ్రిజ్ వెనుక భాగం, వాషింగ్ మెషీన్ల దగ్గర, పెట్టెల వెనుక, మంచాల కింద, షూ రాక్లలో దాక్కోవడానికి ఇష్టపడతాయి. అంతేకాకుండా, కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం ప్రారంభం పాముల పునరుత్పత్తి సమయంతో కూడుకుని ఉంటుంది. జతను వెతుక్కునే క్రమంలో కూడా పాముల సంచారం పెరుగుతుంది.

57
సులభమైన ప్రవేశ మార్గాలు
Image Credit : pinterest

సులభమైన ప్రవేశ మార్గాలు

పాములు చాలా చిన్న ఖాళీల గుండా కూడా ఇంట్లోకి ప్రవేశించగలవు. తలుపుల కింద ఉండే ఖాళీలు, గోడల ఫౌండేషన్ బిటౌన్లు, పైపుల చుట్టూ ఉండే రంధ్రాలు, డ్రెయినేజీ రంధ్రాలు, ఓపెన్ విండోస్ ద్వారా అవి ఇంట్లోకి ఈజీగా దూరిపోతాయి. బయట వర్షం ఎక్కువగా ఉన్నప్పుడు, పొడి ప్రదేశం కోసం వెతుకుతున్న పాముకు ఈ చిన్న ఖాళీలు లోపలికి రావడానికి దారి చూపిస్తాయి. ఇంటి చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తకుప్పలు, కట్టెల నిల్వలు పాములకు స్థలాలుగా మారతాయి.

67
పాములు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : Pinterest

పాములు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

• ద్వారాలు, ఖాళీలు మూసివేయండి: తలుపుల కింద ఖాళీలు లేకుండా డోర్ స్వీప్స్ అమర్చండి. గోడలు, ఫ్లోరింగ్ పై ఉండే రంధ్రాలు, పైపుల చుట్టూ ఉన్న ఖాళీలను సిమెంట్ లేదా మెష్‌తో మూసివేయండి.

• ఆహార పదార్థాల నిల్వ: ఎలుకలు రాకుండా ధాన్యాలను గాలిచొరబడని డబ్బాల్లో ఉంచండి. చెత్త డబ్బాలపై మూతలు సరిగ్గా ఉంచండి. మిగిలిపోయిన పెంపుడు జంతువుల ఆహారాన్ని రాత్రివేళల్లో బయట ఉంచవద్దు.

• పరిసరాల పరిశుభ్రత: ఇంటి చుట్టూ ఉన్న గడ్డి, పొదలను ఎప్పటికప్పుడు కత్తిరించండి. ఇంటికి 10-15 అడుగుల దూరంలో కట్టెల కుప్పలు, ఇటుకలు, చెత్త లేకుండా చూసుకోండి.

• చెప్పులు, బ్యాగులు జాగ్రత్త: బయట ఉంచే షూలు, చెప్పులలో పాములు దాక్కునే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎత్తైన ప్రదేశాల్లో ఉంచండి లేదా తొడుక్కునే ముందు ఒకసారి సరిచూసుకోండి.

77
ఒకవేళ ఇంట్లో పాము కనిపిస్తే ఏం చేయాలి?
Image Credit : Gemini

ఒకవేళ ఇంట్లో పాము కనిపిస్తే ఏం చేయాలి?

కంగారు పడకండి, ప్రశాంతంగా ఉండండి. పాముకు దూరంగా ఉండండి. దానిని పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించవద్దు. పిల్లలను, పెంపుడు జంతువులను దూరంగా ఉంచండి. వీలైతే ఆ గది తలుపు మూసివేసి, వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు లేదా శిక్షణ పొందిన పాముల రెస్క్యూయర్ కు సమాచారం అందించండి. చాలా వరకు పాములు దూకుడుగా ఉండవు, అవి బెదిరితే లేదా అనుకోకుండా తొక్కినప్పుడు మాత్రమే కరుస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత దేశం
Latest Videos
Recommended Stories
Recommended image1
Masala Spices: ఇక్కడ బిర్యానీ మసాలాలు చాలా చీప్ గా దొరుకుతాయి..!
Recommended image2
Chicken Egg: కోడి కడుపులో గుడ్డు ఎలా తయారవుతుందో తెలుసా? ఒక్క ఎగ్ కోసం ఎంత టైమ్ పడుతుంది?
Recommended image3
Rain Facts : వర్షాన్ని ఎలా కొలుస్తారు? మిల్లీమీటర్, సెంటీమీటర్ వర్షం అంటే ఎంత?
Related Stories
Recommended image1
Snake Bite First Aid: పాము కరిస్తే నిమిషాల్లో చేయాల్సిన పని ఇదే.. చాలామందికి తెలియని నిజాలు !
Recommended image2
IMD Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఏయే జిల్లాల్లో అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved