MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Peaceful Beaches: సూర్యలంక మాత్రమే కాదు.. ఏపీలో ఎవరికీ తెలియని ఈ ప్రశాంతమైన బీచ్‌లను చూశారా?

Peaceful Beaches: సూర్యలంక మాత్రమే కాదు.. ఏపీలో ఎవరికీ తెలియని ఈ ప్రశాంతమైన బీచ్‌లను చూశారా?

Peaceful Beaches: గోవా, వైజాగ్ వంటి రద్దీ బీచ్‌లు కాకుండా మీరు ప్రశాంతంగా వుండే వాటి కోసం చూస్తున్నారా? అయితే, ఏపీలో ప్రశాంతంగా గడపడానికి సూర్యలంక, మైపాడు, కొత్తపట్నం, కృష్ణపట్నం వంటి తీర ప్రాంతాలు కూడా వీకెండ్ ట్రిప్‌కు మంచి ఎంపికలుగా ఉన్నాయి.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 14 2026, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గోవా, వైజాగ్ వద్దు గురూ.. ఏపీలో క్రౌడ్ లేని ఈ 4 అద్భుత బీచ్‌లను ట్రై చేయండి
Image Credit : Chatgpt

గోవా, వైజాగ్ వద్దు గురూ.. ఏపీలో క్రౌడ్ లేని ఈ 4 అద్భుత బీచ్‌లను ట్రై చేయండి

సెలవులు వచ్చాయంటే చాలు, చాలామంది మైండ్ కలర్‌ఫుల్‌గా గోవానో లేక వైజాగ్ ఆర్కే బీచ్‌నో వెళ్లాలని ఫిక్స్ అయిపోతుంది. కానీ అక్కడ ఉండే జనం, రద్దీ చూస్తే సగం మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిజానికి ప్రశాంతంగా అలల శబ్దాన్ని వింటూ, చల్లటి గాలిలో చిల్ అవ్వడానికి అంత దూరం పరిగెత్తాల్సిన అవసరమే లేదు..

మన ఆంధ్రప్రదేశ్ తీరంలోనే ఎవరి హడావుడి లేని, కాలుష్యం సోకని క్యూట్ అండ్ ప్రశాంతమైన బీచ్‌లు చాలానే ఉన్నాయి. రొటీన్ లైఫ్, వర్క్ ప్రెజర్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని మైండ్ రీఫ్రెష్ చేసుకోవాలనుకునేవారికి ఇవి పర్ఫెక్ట్ స్పాట్స్. వీకెండ్ ప్లాన్స్ వేసుకునే వారి కోసం అలాంటి 4 అమేజింగ్ బీచ్‌ల డీటైల్స్ మీకోస.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సూర్యలంక బీచ్ (బాపట్ల)
Image Credit : gemini

సూర్యలంక బీచ్ (బాపట్ల)

నగరాల్లో ఉండే నైట్ లైఫ్, రోజూవారీ రద్దీకి బోర్ కొట్టి, ప్రశాంతమైన సముద్ర తీరంలో వారాంతం గడపాలనుకునే వారికి బాపట్లలోని సూర్యలంక బీచ్ ఫస్ట్ ప్రైయారిటీ. హైదరాబాద్ నుంచి కేవలం 5 నుంచి 6 గంటల డ్రైవ్‌తో ఈ స్పాట్‌కి ఈజీగా చేరుకోవచ్చు.

విశాలంగా పరిచినట్టు ఉండే ఇసుక తిన్నెలు, పైకి లేచే అలలతో ఈ బీచ్ చాలా క్యూట్‌గా ఉంటుంది. తెల్లవారుజామున వచ్చే సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం ఇక్కడ చూస్తే రెండు కళ్లూ చాలవు. ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్ వాలీబాల్ ఆడటానికి, సముద్రపు నీటిలో సరదాగా అడుగులు వేయడానికి ఇది బెస్ట్ అడ్డా. ఇక్కడ ఏపీ టూరిజం వారి రిసార్ట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి, కాబట్టి నైట్ స్టే ప్లాన్ చేసుకోవడం కూడా చాలా సులభం.

36
మైపాడు బీచ్ (నెల్లూరు)
Image Credit : Others

మైపాడు బీచ్ (నెల్లూరు)

నెల్లూరు జిల్లాలో ఉండే మైపాడు బీచ్ గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ. ఒకసారి ఇక్కడికి వెళ్తే మాత్రం కచ్చితంగా ఈ ప్లేస్‌కి ఫ్యాన్ అయిపోతారు.. ఇక్కడి ఇసుక బంగారు రంగులో మెరుస్తూ పర్యాటకులను భలే ఆకట్టుకుంటుంది.

చెన్నై లేదా వైజాగ్ బీచ్‌లలో ఉండే పబ్లిక్ హడావుడి ఇక్కడ అస్సలు కనిపించదు. కేవలం ఎగిసిపడే సముద్రపు అలల సవ్వడి, ప్రశాంతంగా వీచే చల్లటి గాలి మాత్రమే మిమ్మల్ని పలకరిస్తాయి. ఒక మంచి పుస్తకం చదువుకుంటూ, లేదంటే సైలెంట్‌గా సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ హెడ్‌ఫోన్స్‌లో పాటలు వినడానికి ఇది అల్టిమేట్ స్పాట్. రాత్రి వేళ ఆకాశాన్ని చూడటానికి కూడా మైపాడు తీరం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

46
కోత్తపట్నం బీచ్ (ప్రకాశం)
Image Credit : chat gpt

కోత్తపట్నం బీచ్ (ప్రకాశం)

కమర్షియల్ హంగులు లేకుండా, ఎలాంటి షో-ఆఫ్ లేకుండా స్వచ్ఛమైన ప్రకృతి అందాలను చూడాలనుకుంటే ప్రకాశం జిల్లాలోని కోత్తపట్నం బీచ్‌కు కచ్చితంగా వెళ్లాల్సిందే. ఒంగోలు పట్టణానికి చాలా సమీపంలో ఉండే ఈ తీరం అద్భుతంగా ఉంటుంది.

ఇక్కడ స్థానిక మత్స్యకారుల జీవనశైలిని చాలా దగ్గరగా గమనించవచ్చు. ఉదయాన్నే వేటకు వెళ్లే పడవలు, నీలిరంగు అలల దొంతరలు ఫోటోగ్రఫీ ప్రేమికులకు మంచి ఫ్రేమ్స్ ఇస్తాయి. బడ్జెట్‌లో ప్రశాంతంగా బీచ్ వాక్ చేస్తూ, సముద్రపు గాలిని ఆస్వాదించడానికి కోత్తపట్నం ఒక బెస్ట్ ఆఫ్-బీట్ ఛాయిస్.

56
కృష్ణపట్నం బీచ్
Image Credit : Others

కృష్ణపట్నం బీచ్

నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉండే కృష్ణపట్నం అనగానే చాలామందికి ఓడరేవు మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ, ఈ పారిశ్రామిక ప్రాంతానికి ఆనుకుని ఉండే తీర ప్రాంతాలు పర్యాటకుల హడావుడికి దూరంగా, ప్రశాంతమైన రహస్య తీరాల్లా ఉంటాయి.

ఇక్కడ విశాలమైన సముద్ర తీరం, తెల్లటి అలలు మనసుకు ఎంతో రిలీఫ్‌ను ఇస్తాయి. సాయంత్రం వేళల్లో ఒడ్డున కూర్చుని అలా సముద్రాన్ని చూస్తుంటే రోజంతా ఉన్న అలసట అంతా పారిపోతుంది. కొన్ని తీర ప్రాంతాల్లో లైట్‌హౌస్ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. అయితే ఇక్కడికి వెళ్లేముందు స్థానికంగా ఎంట్రీ అనుమతులు, రవాణా సదుపాయాలు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

66
బీచ్ రైడ్‌కు వెళ్లేముందు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
Image Credit : Tripadvisor

బీచ్ రైడ్‌కు వెళ్లేముందు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి

• టైమింగ్స్: మధ్యాహ్నం ఎండలో వెళ్లకుండా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వెళ్తే పర్ఫెక్ట్ వైబ్స్ ఎంజాయ్ చేయవచ్చు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం చాలా కూల్‌గా ఉంటుంది.

• సేఫ్టీ ముఖ్యం: అలలు ప్రశాంతంగా కనిపిస్తున్నాయని సముద్రంలోకి లోతుగా వెళ్లకూడదు. లైఫ్‌గార్డ్స్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే నీటిలోకి దిగండి.

• ప్లాస్టిక్ నో: మన బీచ్‌లు అందంగా ఉండాలంటే పరిశుభ్రత చాలా ముఖ్యం. మీ వెంట తీసుకెళ్లే వాటర్ బాటిళ్లు, వాడిన ప్లాస్టిక్ వ్యర్థాలను తిరుగు ప్రయాణంలో వెనక్కి తీసుకెళ్లడం మర్చిపోకండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ సెంట‌ర్ ఫ్రెష్ యాడ్ చూస్తే.. మీ ఆలోచ‌న విధాన‌మే మారుతుంది, ఇక‌పై అస్స‌లు ఓవ‌ర్ థింక్ చేయ‌రు
Recommended image2
Most Expensive Cafes: ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్ 5 కెఫేలు ఇవే.. ఒక్క కాఫీ ధర వింటే మైండ్ బ్లాకే
Recommended image3
ఇండియాలో ఓ పంటను పండించడం నేరం.. కానీ అమ్మడం నేరం కాదు? అదేదో తెలుసా?
Related Stories
Recommended image1
Mutual Funds: రూ.5 లక్షలు ఉంటే చాలు.. రూ.80 లక్షల జాక్‌పాట్ కొట్టే సింపుల్ ట్రిక్
Recommended image2
Indian Rupee: ఇండియా కాకుండా రూపాయి చెల్లే ఇతర దేశాలు ఏవో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved