MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Tariffs : అసలు టారీఫ్ అంటే ఏమిటి? అమెరికా భారత్ పై టారీఫ్స్ విధించినా కట్టేది అమెరికన్లే, అదెలాగో తెలుసా?

Tariffs : అసలు టారీఫ్ అంటే ఏమిటి? అమెరికా భారత్ పై టారీఫ్స్ విధించినా కట్టేది అమెరికన్లే, అదెలాగో తెలుసా?

అమెరికా భారత వస్తువులపై 25 శాతం టారిఫ్ ప్రతిపాదించింది. ఈ క్రమంలో చాలామందికి ఓ డౌట్ వస్తుంది... అమెరికా విధించే ఈ పన్ను భారత ప్రభుత్వం కడుతుందా? వ్యాపారులు కడతారా? లేక కొనుగోలు చేసే అమెరికన్లు కడతారా? అని. మరి ఈ టారీప్స్ ఎవరు కడతారో తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Nov 27 2026, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మరోసారి టారీఫ్ బాంబు పేల్చిన అమెరికా
Image Credit : Asianet News

మరోసారి టారీఫ్ బాంబు పేల్చిన అమెరికా

భారతదేశంపై అమెరికా టారిఫ్స్ విధిస్తే మన దేశానికి నష్టం జరుగుతుందని వార్తలు వింటుంటాం. కానీ ఈ పన్ను నేరుగా భారత ప్రభుత్వమో, భారతీయ వ్యాపారులో చెల్లించేది కాదు... అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై విధించే టారిఫ్‌ను అక్కడి దిగుమతిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే చివరకు ఈ పన్ను భారం ఎవరిపై పడుతుంది? అమెరికా ప్రజలు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుందా? భారతీయ కంపెనీలు తమ లాభాలను తగ్గించుకోవాల్సి వస్తుందా? ఓ చిన్న ఉదాహరణతో ఈ టారిఫ్స్ లెక్కను అర్థం చేసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలు టారిఫ్ అంటే ఏమిటి?
Image Credit : X

అసలు టారిఫ్ అంటే ఏమిటి?

ఒక దేశం మరో దేశం నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు వాటిపై విధించే పన్నునే టారిఫ్ (Tariff) అంటారు. విదేశాల నుంచి వచ్చే వస్తువులు తమ దేశ మార్కెట్లో అమ్ముడవుతున్నప్పుడు వాటిపై అదనపు పన్ను విధించడం ద్వారా దిగుమతులను నియంత్రించేందుకు, దేశీయ కంపెనీలకు పోటీ నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు టారిఫ్స్ విధిస్తుంటాయి.

ఉదాహరణకు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం టారిఫ్ విధిస్తే.. అమెరికాలో ఆ వస్తువులను దిగుమతి చేసుకునే సంస్థ కస్టమ్స్ వద్ద ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇది భారత ప్రభుత్వం అమెరికాకు చెల్లించే పన్ను కాదు. అమెరికాలోకి వస్తువులను తీసుకువచ్చే దిగుమతిదారుపై విధించే ట్యాక్స్ అన్నమాట.

35
25 శాతం టారీప్ అంతే ఎంత?
Image Credit : Getty

25 శాతం టారీప్ అంతే ఎంత?

ఉదాహరణకు హైదరాబాద్‌లో అద్వైత అనే యువతి గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్వహిస్తోందని అనుకుందాం. ఆమె తన ఫ్యాక్టరీలో తయారు చేసిన షర్ట్స్‌ను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అక్కడి ఓ షాపు యజమాని ఒక్కో షర్ట్‌ను రూ.1000 చొప్పున కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ షర్ట్‌పై 25 శాతం టారిఫ్ విధిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

షర్ట్ అసలు దిగుమతి ధర - రూ.1,000

25% టారిఫ్ - రూ. 250

టారిఫ్ తో కలిపి ఆ షర్ట్ ధర - kp.1250

అంటే రూ.1000 విలువైన షర్ట్‌ను అమెరికాలోకి దిగుమతి చేసుకునేందుకు షాపు యజమాని అదనంగా రూ.250 టారిఫ్ చెల్లించాల్సి వస్తుంది. ఈ పన్ను అమెరికా కస్టమ్స్‌కు వెళ్తుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ అదనపు భారాన్ని షాపు యజమానే భరిస్తాడా? లేక మరొకరిపైకి బదిలీ చేస్తాడా?

45
ఈ 25 శాతం టారీఫ్ భారం ఎవరిపై పడుతుంది?
Image Credit : Pixabay

ఈ 25 శాతం టారీఫ్ భారం ఎవరిపై పడుతుంది?

అమెరికాలో షాపు నిర్వహించే యజమాని ఈ అదనపు పన్ను భారాన్ని భరించకుండా ఉండేందుకు మూడు మార్గాలను ఎంచుకోవచ్చు.

1. తన లాభాలను తగ్గించుకోవడం

షర్ట్‌ను రూ.1000కు కొనుగోలు చేసి, దానిపై రూ.250 టారిఫ్ చెల్లిస్తే దిగుమతిదారుడి ఖర్చు రూ.1250 అవుతుంది. షాపు యజమాని అదే పాత ధరకు అమ్మితే తన లాభం తగ్గిపోతుంది. టారిఫ్ భారాన్ని తనే భరించి కస్టమర్లకు ధర పెంచకుండా అమ్మవచ్చు. కానీ ఎక్కువ కాలం ఇలా చేయడం వ్యాపారానికి నష్టం కలిగించవచ్చు.

2. భారతీయ కంపెనీపై ధర తగ్గించాలని ఒత్తిడి చేయడం

అమెరికా షాపు యజమాని భారతీయ ఎగుమతిదారుతో మాట్లాడి షర్ట్ ధర తగ్గించాలని కోరవచ్చు. గతంలో రూ.1000కు కొనుగోలు చేసిన షర్ట్‌ను ఇప్పుడు రూ.750కి ఇవ్వాలని అడగవచ్చు. దీంతో రూ.750పై 25 శాతం టారిఫ్ రూ.187.50 అవుతుంది. అమెరికా దిగుమతిదారుకు షర్ట్ మొత్తం ఖర్చు రూ.937.50 అవుతుంది. ఇలా టారిఫ్ భారంలో కొంత భాగాన్ని భారతీయ తయారీదారుపైకి బదిలీ చేసినట్లవుతుంది. కానీ దీనివల్ల భారతీయ కంపెనీకి లాభాలు తగ్గడంతో పాటు ఉత్పత్తి ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, వ్యాపార నిర్వహణపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

3. కస్టమర్లపై ధరల భారం వేయడం

ఇక మూడో మార్గం.. టారిఫ్ భారాన్ని కస్టమర్లపై వేయడం. రూ.1000కు దిగుమతి చేసుకున్న షర్ట్‌పై రూ.250 టారిఫ్ పడితే.. షాపు యజమాని తన ఖర్చులకు తగ్గట్టుగా అమ్మకపు ధరను పెంచవచ్చు. దీంతో అమెరికాలో ఆ షర్ట్ కొనుగోలు చేసే కస్టమర్ గతంలో కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది.

అంటే విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్స్ పెరిగితే వాటి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. చివరకు ఆ ప్రభావం సామాన్య వినియోగదారుల జేబుపై పడొచ్చు. అయితే ప్రతి వస్తువు ధర 25 శాతం పెరుగుతుందని చెప్పలేం. దిగుమతిదారులు, ఎగుమతిదారులు, వ్యాపారులు ఈ భారాన్ని ఎలా పంచుకుంటారనే దానిపై ధరలు ఆధారపడి ఉంటాయి.

55
టారిఫ్స్ ఎందుకు విధిస్తారు?
Image Credit : X

టారిఫ్స్ ఎందుకు విధిస్తారు?

టారిఫ్స్ విధించడం వెనుక దేశాలకు అనేక ఆర్థిక, వాణిజ్యపరమైన కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి..

1. దేశీయ కంపెనీలకు రక్షణ : విదేశాల నుంచి తక్కువ ధరలకు వచ్చే వస్తువులతో స్వదేశీ కంపెనీలు పోటీ పడలేకపోవచ్చు. దిగుమతులపై పన్నులు విధించడం ద్వారా దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి.

2. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం : దిగుమతి సుంకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. ఇలా ట్యాక్స్ రెవెన్యూ పెంచుకునేందుకు టారీప్స్ ఉపయోగపడతాయి.

3. విదేశాలతో వాణిజ్య చర్చల్లో ఒత్తిడి : ఇతర దేశాలు తమ మార్కెట్లను తెరవాలని, కొన్ని విధానాల్లో మార్పులు చేయాలని కోరుతూ టారిఫ్స్‌ను ఒక సాధనంగా ఉపయోగించవచ్చు.

4. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం : విదేశీ వస్తువుల ధరలు పెరిగితే స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతారని ప్రభుత్వాలు భావిస్తాయి.

అయితే టారిఫ్స్ ఎక్కువగా విధిస్తే విదేశీ వస్తువుల ధరలు పెరగడం, వ్యాపార సంబంధాలు దెబ్బతినడం, ఇతర దేశాలు కూడా ప్రతిగా పన్నులు విధించడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఏషియానెట్ న్యూస్
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bangle City: గాజుల తయారీలో దేశంలోనే నెంబర్ వన్ నగరం.. ఇక్కడి గాజులు చాలా స్పెషల్!
Recommended image2
10 నెలలు ఆకాశంలో ఎగురుతూ బతికే పక్షి గురించి మీకు తెలుసా? గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఎగిరే పక్షి ఏది?
Recommended image3
12 నెలలు కాదు, ఈ దేశంలో ఏడాదికి 13 నెలలు.. అస‌లు కార‌ణం ఏంటంటే?
Related Stories
Recommended image1
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Recommended image2
Trump Tariff : ఈ దెబ్బకు ఇండియాలో ఏ రంగాలు బలవుతాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved