MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Mutual Funds: రూ.5 లక్షలు ఉంటే చాలు.. రూ.80 లక్షల జాక్‌పాట్ కొట్టే సింపుల్ ట్రిక్

Mutual Funds: రూ.5 లక్షలు ఉంటే చాలు.. రూ.80 లక్షల జాక్‌పాట్ కొట్టే సింపుల్ ట్రిక్

Mutual Funds: లాంగ్ టర్మ్ ఆర్థిక లక్ష్యాల కోసం ప్లాన్ చేసుకునే వారికి, వేగంగా సంపదను సృష్టించుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. రూ. 5 లక్షలు సరైన మ్యూచువల్ ఫండ్స్‌లో దాచి కాంపౌండింగ్ పవర్‌కు వదిలేస్తే అది రూ. 80 లక్షలకు పైగా కార్పస్‌గా మారుతుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 13 2026, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మ్యూచువల్ ఫండ్స్‌లో లంప్‌సమ్ మ్యాజిక్.. ఈ ఒక్క ప్లాన్‌తో రూ.80 లక్షలు మీ చేతుల్లో!
Image Credit : chatgpt

మ్యూచువల్ ఫండ్స్‌లో లంప్‌సమ్ మ్యాజిక్.. ఈ ఒక్క ప్లాన్‌తో రూ.80 లక్షలు మీ చేతుల్లో!

ఈ రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ముందుగానే ఆలోచిస్తున్నారు. ఎక్కువ మొత్తం లబ్ధి పొందేందుకు అందరికీ ముందుగా గుర్తొచ్చేది మ్యూచువల్ ఫండ్స్. చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అనగానే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా నెలకు కొంతమొత్తం మాత్రమే ఇన్వెస్ట్ చేయగలమని భావిస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో లంప్‌సమ్ అంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని కూడా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంది.

మీరు ఒకేసారి రూ. 5 లక్షల మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో లంప్‌సమ్ విధానంలో 10, 15 లేదా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ఆ సొమ్ము ఎంతగా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
10 ఏళ్ల పెట్టుబడికి ఎంత రిటర్న్ వస్తుంది?
Image Credit : Asianet News

10 ఏళ్ల పెట్టుబడికి ఎంత రిటర్న్ వస్తుంది?

మీరు రూ. 5 లక్షలను మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి లంప్‌సమ్ రూపంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు, 10 ఏళ్ల కాలపరిమితిలో మీ సొమ్ము మంచి వృద్ధిని నమోదు చేస్తుంది.

• 10% రిటర్న్: ప్రతి ఏటా 10% రిటర్న్ వస్తే, 10 ఏళ్ల తర్వాత మీ పెట్టుబడి విలువ సుమారు రూ. 12.97 లక్షలు అవుతుంది.

• 12% రిటర్న్: ఒకవేళ రిటర్న్ 12% ఉంటే, మీ కార్పస్ సుమారు రూ. 15.53 లక్షలకు చేరుకుంటుంది.

• 15% రిటర్న్: వార్షిక రిటర్న్ 15% వరకు ఉంటే మాత్రం 10 ఏళ్లలో మీ సొమ్ము సుమారు రూ. 20.23 లక్షలుగా మారుతుంది.

35
15 ఏళ్ల వ్యవధిలో మారుతున్న లెక్కలు
Image Credit : Getty

15 ఏళ్ల వ్యవధిలో మారుతున్న లెక్కలు

మీ పెట్టుబడి కాలపరిమితిని 15 ఏళ్లకు పెంచితే కాంపౌండింగ్ ప్రభావంతో మీ రిటర్న్స్ పూర్తిగా మారిపోతాయి. కాలిక్యులేషన్ ప్రకారం మీ డబ్బు ఏ విధంగా పెరుగుతుందో ఇక్కడ చూడవచ్చు..

• 10% రిటర్న్: 10% రేటుతో 15 ఏళ్లలో రూ. 5 లక్షల పెట్టుబడి విలువ సుమారు రూ. 20.89 లక్షలు అవుతుంది.

• 12% రిటర్న్: 12% రిటర్న్ లభిస్తే ఈ మొత్తం సుమారు రూ. 27.37 లక్షలకు పెరుగుతుంది.

• 15% రిటర్న్: అదే 15% రిటర్న్ వస్తే ఈ సొమ్ము ఏకంగా సుమారు రూ. 40.69 లక్షలకు చేరుకుంటుంది.

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 10%, 15% రిటర్న్స్ మధ్య వ్యత్యాసం సుమారు రూ. 19.80 లక్షలుగా ఉంది. అంటే రిటర్న్స్‌లో కేవలం 5% తేడా ఉన్నా, దీర్ఘకాలంలో అది ఎంత పెద్ద వ్యత్యాసాన్ని చూపుతుందో స్పష్టంగా అర్థమవుతోంది.

45
20 ఏళ్ల దాకా ఉంచితే కాంపౌండింగ్ మ్యాజిక్ ఇదే
Image Credit : Asianet News

20 ఏళ్ల దాకా ఉంచితే కాంపౌండింగ్ మ్యాజిక్ ఇదే

మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌ను 20 ఏళ్ల పాటు అలాగే కొనసాగిస్తే కాంపౌండింగ్ అసలు పవర్ బయటపడుతుంది. సుదీర్ఘ కాలపరిమితి వల్ల మీ రూ. 5 లక్షల లంప్‌సమ్ పెట్టుబడి ఊహించని స్థాయిలో వృద్ధి చెందుతుంది..

• 10% రిటర్న్: 20 ఏళ్ల పాటు 10% రిటర్న్ వస్తే రూ. 5 లక్షలు సుమారు రూ. 33.64 లక్షలు అవుతాయి.

• 12% రిటర్న్: 12% అంచనాతో చూస్తే ఈ మొత్తం సుమారు రూ. 48.43 లక్షలకు చేరుతుంది.

• 15% రిటర్న్: ఒకవేళ మీ ఫండ్ 15% వార్షిక రిటర్న్ ఇస్తే గనుక, మీ రూ. 5 లక్షల ఇన్వెస్ట్‌మెంట్ ఏకంగా సుమారు రూ. 81.83 లక్షల భారీ మొత్తంగా మారుతుంది.

55
సరైన ప్లానింగ్‌తో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం
Image Credit : Getty

సరైన ప్లానింగ్‌తో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం

ప్రస్తుత కాలంలో ఉద్యోగం చేసే వారి నుంచి సామాన్యుల వరకు అందరికీ మ్యూచువల్ ఫండ్స్ మొదటి ప్రాధాన్యంగా మారాయి. అయితే లంప్‌సమ్ విధానంలో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఆశించే రిటర్న్స్, మెచ్యూరిటీ కాలపరిమితి, మీకు కావలసిన ముగింపు కార్పస్ నిష్పత్తిని సరిగ్గా అంచనా వేసుకోవడం మంచిది. దీర్ఘకాలిక లక్ష్యాలతో క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగిస్తే అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
UPI Charges: పండగ వేళ వ్యాపారులకు ఊరట.. యూపీఐ ఛార్జీల అమ‌లుపై కీల‌క నిర్ణ‌యం
Recommended image2
Prices: మీ వంటింటి బ‌డ్జెట్ ఎందుకు పెరిగిందో తెలుసా.? నెల‌కు రూ. 1500 అద‌నంగా
Recommended image3
Gold Price Today: పసిడి ప్రియులకు రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలివే
Related Stories
Recommended image1
WhatsApp Scheduled Messages: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. మెసేజ్‌లు షెడ్యూల్ చేయడం ఎలాగంటే?
Recommended image2
IRCTC: పద్మనాభస్వామి నుంచి రామేశ్వరం వరకు.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే సౌత్ టెంపుల్ టూర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved