MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • River: భారతదేశంలో అత్యంత స్వచ్ఛమైన నది ఇదే, నీటి అడుగున ఉన్న రాళ్లు కూడా కనిపిస్తాయి

River: భారతదేశంలో అత్యంత స్వచ్ఛమైన నది ఇదే, నీటి అడుగున ఉన్న రాళ్లు కూడా కనిపిస్తాయి

River: మనదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. వాటిలో అద్భుతమైన స్వచ్ఛమైన నది ఒకటుంది. అది చాలా స్పెషల్ నది. ఈ నది ఎక్కడుంది? ఆ నదిలో నీరు ఎందుకంత స్వచ్ఛంగా ఉంటుంది? అనేది తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 01 2026, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మనదేశంలో స్వచ్ఛమైన నది
Image Credit : TripiWiki

మనదేశంలో స్వచ్ఛమైన నది

భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. వాటిలో అత్యంత స్వచ్ఛమైన నదిగా గుర్తింపు పొందినది.. ఉమ్‌గోట్ నది. ఈ అద్భుతమైన నది మేఘాలయ రాష్ట్రంలోని డాకీ అనే చిన్న పట్టణంలో ప్రవహిస్తుంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉండే ఈ నదిని స్థానికులు డాకీ నది అని కూడా పిలుస్తారు. షిల్లాంగ్ నగరం నుండి దాదాపు 95 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంటారు. ఇక్కడి నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే, నది అడుగున ఉండే గులకరాళ్ళు, ఈదులాడే చేపలను కూడా పైనుంచే స్పష్టంగా చూడవచ్చు. సూర్యకాంతి పడినప్పుడు ఆ నది అద్దంలా మెరిసిపోతుంది. ఈ నది చూడటానికి ఎంతో మంది పర్యాటకులు వస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పడవలు గాలిలో తేలుతున్నట్టు
Image Credit : stockPhoto

పడవలు గాలిలో తేలుతున్నట్టు

ఈ నదిలోని నీటి స్వచ్ఛత వల్ల పడవలు నీటిలో కాకుండా గాలిలోనే తేలియాడుతున్నట్లు కనిపిస్తాయి. ఫోటోలు తీసినప్పుడు పడవ నీడ నేరుగా నది అడుగు భాగాన పడుతూ కనిపిస్తుంది. దాంతో పడవ ఆకాశంలో ఎగురుతోందా అన్న అద్భుత భావన కలుగుతుంది. ఇక్కడ దేశీయ పడవల ప్రయాణం చేయడం పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత నవంబర్ నుండి ఏప్రిల్ నెలల మధ్య కాలంలో నీరు ఇంకా పారదర్శకంగా మారుతుంది. ఈ సమయంలోనే ఈ నదిని చూసేందుకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు.

33
నది ఎందుకంత స్వచ్ఛంగా ఉంటుంది
Image Credit : stockPhoto

నది ఎందుకంత స్వచ్ఛంగా ఉంటుంది

ఉమ్ గోట్ నది ఇంత పరిశుభ్రంగా ఉండటానికి ప్రధాన కారణం స్థానిక ఖాసీ, జైంతియా గిరిజన ప్రజల కృషి. వీరు ప్రకృతిని దైవంగా భావిస్తూ ఎన్నో ఏళ్లుగా నదిని కాపాడుకుంటున్నారు. నీటిలోకి ప్లాస్టిక్ లేదా ఇతర చెత్తను వేయకుండా అడ్డుకుంటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నదిని నిరంతరం శుభ్రం చేస్తూ కాలుష్యం లేకుండా చూసుకుంటారు. ఇలాంటి పర్యావరణ స్పృహ వల్లనే ఉమ్‌గోట్ నది దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రకృతి ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలలో డాకీ నది ఒకటి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mystery Temple: దేవుడికి మందును నైవేద్యంగా పెట్టే ఆల‌యం.. నేటికీ వీడని మిస్టరీ
Recommended image2
VRK Diet : అసలు ఏమిటీ విఆర్కే డైట్? డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులను నయం చేస్తుందా?
Recommended image3
తల నరికేసినా కూడా వారాల తరబడి బతికేయగల వింత జంతువు ఇది..!
Related Stories
Recommended image1
గుడిలో పెట్టే పులిహోర రెసిపీ ఇదిగో.. ఈ సీక్రెట్ టిప్స్ తో రుచి అదిరిపోతుంది
Recommended image2
Mutton Curry: చలికాలంలో మటన్ కూర చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved