MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Mutton Curry: చలికాలంలో మటన్ కూర చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎందుకు?

Mutton Curry: చలికాలంలో మటన్ కూర చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎందుకు?

Mutton Curry: చలికాలంలో మటన్ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇది మన శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చల్లని వాతావరణంలో మటన్ కూడా రుచిగా ఎందుకు అనిపిస్తుంది?

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 30 2026, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
టేస్టీ మటన్ కూర
Image Credit : Gemini AI Generated

టేస్టీ మటన్ కూర

మటన్ కూర అంటే నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టం. మిగతా సీజన్ల కంటే చలికాలంలో మటన్ కూర చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించి చూడండి… చల్లని వాతావరణంలోనే మటన్ కూర ఎక్కువ రుచిగా అనిపిస్తుంది. ఆ సీజన్ లో ఆ టేస్ట్ ఎలా పెరుగుతుందో తెలుసా?

చలికాలంలో మన శరీరం వెచ్చదనాన్ని కోరుకుంటుంది. మటన్ లో ఉండే ప్రొటీన్, కొవ్వు పదార్థాలు మన శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతాయి. అందుకే వేడి వేడి మటన్ కూర తిన్నప్పుడు మనకు భలే తృప్తిగా అనిపిస్తుంది. రుచిగా అనిపిస్తుంది. మన శరీరానికి ఎంతో నచ్చుతుంది దాని రుచి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మటన్ మెత్తగా ఉడికితే ఆ రుచే వేరు
Image Credit : Gemini AI Generated

మటన్ మెత్తగా ఉడికితే ఆ రుచే వేరు

మటన్ వండేటప్పుడు మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క లాంటి మసాలాలు అన్నీ వేసి వండుతారు. వీటిలోని పోషకాలు రక్తప్రసరణను పెంచి శరీర ఉష్ణోగ్రతను కాపాడతాయి. చలికాలంలో ఈ మసాలాల ఘుమఘుమలు మటన్ రుచిని అమాంతం పెంచేస్తాయి. మటన్ ను ఎప్పుడూ సన్నని మంటపై ఉడికిస్తేనే ఆ అసలైన రుచి వస్తుంది.

మటన్ మెత్తగా ఉడికి, ముక్కలకు మసాలా పట్టాలంటే కాస్త టైమ్ పడుతుంది. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మటన్ నెమ్మదిగా ఉడుకుతుంది. దీనివల్ల గ్రేవీ చాలా సాఫ్ట్ గా తయారై, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది.

33
మటన్ తినడం వల్ల లాభాలు
Image Credit : Getty

మటన్ తినడం వల్ల లాభాలు

చలికాలంలో మన శరీరం వేడిని కోరుకుంటుంది. మటన్ లో ఉండే ప్రొటీన్, ఫ్యాట్ శరీరానికి కావాల్సిన శక్తిని, వేడిని ఇస్తాయి. మటన్ లో విటమిన్ బి12, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచి చలికాలంలో వచ్చే జబ్బుల నుంచి మనల్ని కాపాడతాయి.

మటన్ లో ఉండే హై క్వాలిటీ ప్రొటీన్ కండరాల ఎదుగుదలకు, శరీర దారుఢ్యానికి బాగా సాయపడుతుంది. ఇందులో ఉండే ఐరన్, విటమిన్లు రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచి రక్తహీనత రాకుండా అడ్డుకుంటాయి. మటన్ లోని విటమిన్ బి కాంప్లెక్స్ నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
DMart: ఈ దసరాకు డీమార్ట్ లో షాపింగ్ చేయండి.. రూ.1500 వరకూ ఆదా చేయండి
Recommended image2
ఉప్పు డబ్బాలో నీళ్లు పడ్డాయా? ఇలా పొడిగా మార్చేయండి
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం మనల్ని గౌరవించని వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో తెలుసా?
Related Stories
Recommended image1
Holidays: ప్రపంచంలో అత్యధిక సెలవులు కలిగిన దేశం ఏదో తెలుసా? షాక్ అయిపోతారు
Recommended image2
PM Modi: పీఎం మోడీ ఫోన్ కాలర్ ట్యూన్ ఏంటో తెలుసా? మీరూ వినేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved